Horoscope 28-6-2021: ఈ రాశుల వారికి పెరగనున్న సంపాదన... మాటకు తిరుగులేదు

Horoscope 28-6-2021: నేటి రాశిఫలాలు

Horoscope today 28-6-2021: నేడు సోమవారం. రాశి ఫలాల్లో సోమవారం ప్రత్యేకమైనది. మరి ఇవాళ ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో... ఏం సూచిస్తున్నాయో తెలుసుకుందాం. జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారో చూద్దాం.

  • Share this:
    Horoscope 28-6-2021: భవిష్యత్తును ఊహించడం కష్టమే అయినప్పటికీ.. జ్యోతిష పండితులు కొన్ని పద్ధతుల ద్వారా ఊహిస్తారు. మన రాశుల నక్షత్రాలు, గ్రహలు, సూర్య గమనం, విశ్వంలో నక్షత్రాలు, తిథులు, కాలం, వారం, వర్జ్యం, రోజు, వంటి అన్ని అంశాల్నీ లెక్కలోకి తీసుకొని... కొన్ని అంచనాలు వేస్తున్నారు. అవి వంద శాతం సక్సెస్ కాకపోవచ్చు. కానీ చాలా వరకూ వాటిలో చెప్పినట్లు జరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి పంచాంగం చెప్పారో, ఎలాంటి ఫలితాలను జ్యోతిష పండితులు సూచించారో తెలుసుకుందాం.

    మేష రాశి (Aries)
    ఉద్యోగంలో అనుకూలమైన కాలం నడుస్తోంది. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా బాగుంటుంది. బంధుమిత్రులు సహాయమందిస్తారు. దగ్గరి బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆవేశానికి దూరంగా ఉండాలి. హామీలు ఉండవద్దు.

    వృషభ రాశి (Taurus)
    ఉద్యోగపరంగా కొంత ప్రతికూలత ఉంటుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. పెళ్లి సంబంధం సానుకూలపడుతుంది. వృత్తి వ్యాపారాల వారికి ఇది అనుకూల సమయం. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

    మిథున రాశి (Gemini)
    ఉద్యోగంలో అభివృద్ది ఉంటుంది. అదృష్ట కాలం కొనసాగుతోంది. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది కానీ, ఊహించని ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం పరవాలేదు. మీరు ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులకుసహాయం చేస్తారు. వ్యాపారపరంగా అనుకూల వాతావరణం కనిపిస్తోంది. నిరుద్యోగులకు చిరుద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం సానుకూలపడుతుంది.

    కర్కాటక రాశి (Cancer)
    మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. ఆర్థికంగా అనుకూల కాలం నడుస్తోంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో కొంత జాగ్రత్త అవసరం. పట్టుదలతో అనకున్నది సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల సలహాలతో ప్రయోజనం పొందుతారు. కుటుంబంలో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలవారు అభివృద్ది సాధిస్తారు.

    సింహ రాశి (Leo)
    ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారులకు దగ్గరవుతారు. ఆర్దిక స్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అద్దె ఇళ్లలో ఉంటున్నవారు ఇల్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. సంతానం పురోగతి సాధిస్తారు. వృత్తి వ్యాపారాల వారి పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

    కన్య రాశి (Virgo)
    ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలు పూర్తి చేసి, ప్రశంసలు అందుకుంటారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా శ్రమ ఉంటుంది. పెళ్లి సంబంధం కుదరకపోవచ్చు. దూర ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల పరిస్థితి బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి.

    తుల రాశి (Libra)
    కొత్త పనులు చేపట్టడంలో ఆచితూచి అడుగేయాలి. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు గుర్తుకు వచ్చి బాధపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. డాక్టర్‌ని కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార లాభం కనిపిస్తోంది. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది.

    వృశ్చిక రాశి (Scorpio)
    ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులు బాగా సహకరిస్తారు. ధన లాభం ఉంటుంది. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. కుటుంబానికి సంబంధించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వృత్తి వ్యాపారాల్గో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.

    ధనస్సు రాశి (Sagittarius)
    ఉద్యోగంలో అనుకోకుండా సంపాదన పెరుగుతుంది. కొత్త పనులు చేపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి అనుకున్నది సాధిస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. వ్యాపారులకు అన్నివిధాలా బాగుంటుంది. వృత్తి నిపుణులకు మంచి ఆపర్లు వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

    మకర రాశి (Capricorn)
    ఆదాయం పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. అనవసర ఖర్చులతో అవస్థలు పడతారు. ఉద్యోగం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు లాభాల బాట పడతారు. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. పెల్లి సంబంధం కుదురుతుంది.

    కుంభ రాశి (Aquarius)
    ఉద్యోగరీత్యా శుభం జరుగుతుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయి. మిత్రుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. ఒక కుటుంబ సమస్య కొద్దిగా చికాకు కలిగిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. ప్రస్తుతానికి ఎవరికీ హామీ ఉండవద్దు.

    ఇది కూడా చదవండి: Vastu Tips: రోజూ నిద్ర లేచాక ఈ 10 వస్తువుల్ని చూడకండి... చూస్తే ఆ రోజంతా కష్టాలే!

    మీన రాశి (Pisces)
    ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. బంధువులతో పట్టు విడుపులతో వ్యవహరించండి. కలిసి వస్తున్న కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. సంతానం పురోగతి సాధిస్తారు. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి.
    Published by:Krishna Kumar N
    First published: