Horoscope 25-8-2021: నేటి రాశి ఫలాలు.. ఆర్థిక మెరుగదల, ప్రేమలో సవాళ్లు

Horoscope: నేటి రాశి ఫలాలు

Horoscope 25-8-2021: దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. థర్డ్ వేవ్ రాకముందే పెళ్లిళ్లు జరిగిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరి నేటి రాశి ఫలాల్లో ఎవరికి ఎలాంటి సంకేతాలు ఉన్నాయో తెలుసుకుందాం.

 • Share this:
  Horoscope 25-8-2021: ఓ మంచి పని చెయ్యడానికి ముహూర్తాలతో పనిలేదు. ఎప్పుడైనా చెయ్యవచ్చు. సకల దేవతలూ అందుకు అడ్డు చెప్పరు. కానీ... చేసిన పనిలో అత్యుత్తమ ప్రయోజనాలు కలగాలంటే కొన్ని పద్ధతులు, వ్యవహారాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అలాగే... ఎప్పుడు ఏం చెయ్యాలనేది కూడా ఎంతో కీలకమైనది. అందుకు రాశి ఫలాలు చక్కటి మార్గాలు చూపిస్తాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. 12 రాశులలో సూర్య గమనాన్ని పరిశీలించి, గ్రహాల కదలికలు వాటి ప్రభావం ఆయా రాశుల వారిపై ఎలా ఉంటుందో తెలుసుకొని రాశి ఫలాలు చెబుతున్నారు. మరి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  మేష రాశి (Aries)
  ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధికి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబంతో కలిసి ఆలయాలు దర్శించుకుంటారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. వ్యాపారులు బాగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

  వృషభ రాశి (Taurus)
  ఈ రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఖర్చులు మాత్రం అదుపు తప్పుతాయి. ప్రతివారినీ నమ్మేయడం అంత శ్రేయస్కరం కాదు. ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది.

  మిథున రాశి (Gemini)
  ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతా యి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. శుభ కార్యంలో పాల్గొంటా రు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులకు కలిసి వస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.

  కర్కాటక రాశి (Cancer)
  ఈ రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అదనపు పని భారం మీద పడుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. వ్యాపారులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. కోర్టు కేసులో గెలిచే సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

  సింహ రాశి (Leo)
  ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంది. పిల్లలకు సంబంధించి ఒక ముఖ్యమైన శుభవార్త వింటారు. చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు. ఆదాయం పెంచుకునే మార్గాలు ఆలోచిస్తారు. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఎవరికీ ఉదారంగా డబ్బులివ్వవద్దు.

  కన్య రాశి (Virgo)
  ఈ రాశి వారి ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. తలచిన పనులు శ్రమ మీద నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు తేలికగా పురోగతి సాధిస్తారు.

  తుల రాశి (Libra)
  ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. స్నేహితుల నుంచి సహాయం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ శ్రమకు, ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులు తమ వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.

  వృశ్చిక రాశి (Scorpio)
  ఈ రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం శ్రమ పడతారు. మీకు రావాల్సిన డబ్బు అవసర సమయంలో చేతికి అందుతుంది. వ్యాపారులు లాభార్జన చేస్తారు. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాలు పరవాలేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

  ధనస్సు రాశి (Sagittarius)
  ఈ రాశి వారి ఆదాయానికి లోటు ఉండదు కానీ, ఆరోగ్యం సంగతే చూసుకోవాలి. శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి. కోర్టు కేసు వాయిదా పడుతుంది.

  మకర రాశి (Capricorn)
  ఈ రాశి వారికి కొద్దిగా అనుకూల సమయం నడుస్తోంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలను, ప్రోత్సాహాన్ని అందుకుంటారు. వ్యాపారులకు చాలా బాగుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

  కుంభ రాశి (Aquarius)
  ఈ రాశి వారి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమావేశాల్లో పాల్గొంటారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొద్ది శ్రమతో లాభాలు ఆర్జి స్తారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. హామీలు ఉండవద్దు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కోర్టు కేసుల్లో నెగ్గుతారు.

  ఇది కూడా చదవండి: Zodiac Signs: మార్పుల్ని స్వాగతించే 4 రాశులు.. ఈ లక్షణంతో విజయాలు

  మీన రాశి (Pisces)
  ఈ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితులను ఆర్థికంగా ఆదుకుంటారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. రుణ బాధ తగ్గుతుంది. వ్యాపారులు, స్వయం ఉపాధివారు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెడతారు.
  Published by:Krishna Kumar N
  First published: