Horoscope 24-8-2021: నేటి రాశి ఫలాలు.. కొత్త నిర్ణయాలు సఫలం, అశ్రద్ధ అనర్థం

Horoscope: నేటి రాశి ఫలాలు

Horoscope 24-8-2021: ఇవాళ ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? గ్రహ బలాలు ఏం సూచిస్తున్నాయి? ఎవరికి మంచి ఫలాలు దక్కనున్నాయి? అన్ని విషయాలూ వివరంగా తెలుసుకుందాం.

 • Share this:
  Horoscope 24-8-2021: రాశి ఫలాలు వాస్తవాల్ని చెబుతాయా అనేది ఎప్పుడూ ఉండే ప్రశ్నే. కీడెంచి మేలు ఎంచమంటారు పెద్దలు. రాశి ఫలాల్లో మంచి శుభవార్తలు ఉంటే... ఆనందమే. అదే అనుకోని అనర్థాలు, ప్రమాద సంకేతాలు ఉంటే జాగ్రత్త పడొచ్చు. వివాదాలు, గొడవలు, ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తతలు, ఇంట్లో మనస్పర్థలు, వ్యాపారాల్లో నష్టాలు ఇలాంటి ఎన్నో అంశాల్లో మనల్ని అలర్ట్ చేస్తాయి రాశిఫలాలు. గ్రహాలు, తిథి, నక్షత్రం, వర్జ్యం ఇలా ఎన్నో అంశాల్ని లెక్కలోకి తీసుకొని వీటిని రూపొందిస్తున్నారు జ్యోతిష పండితులు. అందువల్ల ఇవి వాస్తవాలు చెబుతాయా లేదా అనే దాని కంటే... అప్రమత్తం అయ్యేందుకు ఇవి సరైన మార్గం సూచిస్తాయి. మరి ఇవాళ్టి రాశిఫలాలు చూద్దాం.

  మేష రాశి (Aries)
  ఈ రాశి వారు ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. మిత్రుల సహకారంతో ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తా రు. వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ధన లాభం ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం మంచి కాలం నడుస్తోంది. సద్వినియోగం చేసుకోండి. కుటుంబం ద్వారా ప్రయోజ నం పొందుతారు.

  వృషభ రాశి (Taurus)
  ఈ రాశి వారు పట్టుదలగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యులను కూడా సంప్రదించండి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తోంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

  మిథున రాశి (Gemini)
  ఈ రాశివారికి ఉద్యోగంలో మంచి అధికార యోగం కనిపిస్తోంది. మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ పెద్దల సహకారం ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.. కానీ ఖర్చులు పెరుగుతాయి. వాదనలకు దూరంగా ఉండండి. శ్రమ మీద కొంతవరకు పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. విశ్రాంతి చాలా అవసరం.

  ఇది కూడా చదవండి: Zodiac Signs: రాశుల్లో కార్డినల్ రాశులేవి? వాటి ప్రత్యేకతేంటి?

  కర్కాటక రాశి (Cancer)
  ఈ రాశి వారికి ఉద్యోగపరంగా అంతా మంచే జరుగుతుంది. వ్యాపారం అన్ని విధాలా అనుకూలిస్తుంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసులో నెగ్గుతారు.

  సింహ రాశి (Leo)
  ఈ రాశి వారికి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలుంటాయి. కొత్త నిర్ణయాలు, ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. తల పెట్టిన పనులు పూర్తవుతాయి.

  కన్య రాశి (Virgo)
  ఈ రాశి వారికి అకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. శ్రమ ఫలించి పనులు కొన్ని పూర్తవుతాయి. సన్నిహితులతో సహకారంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడించే అవకాశం ఉంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరాలకు సరిపడ డబ్బు అందుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

  తుల రాశి (Libra)
  ఈ రాశి వారికి అనుకోకుండా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూల సమయం. ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు.

  వృశ్చిక రాశి (Scorpio)
  ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల వేధింపులుంటాయి. లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తు న్నాయి. ఇతరుల మీద ఆధారపడకుండా వృత్తి వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకోండి. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు అదుపు చేసుకోవాలి. కొందరికి మీ ద్వారా మేలు జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

  ధనస్సు రాశి (Sagittarius)
  ఈ రాశి వారికి ముఖ్యమైన పనుల్లో విజయం వరిస్తుంది. ఆశించిన స్థాయిలో వ్యాపారంలో లాభాలుంటాయి. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగంలో అదనపు బాధ్య తలు మీద పడతాయి. కీలకమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. అవసరాలకు తగ్గట్టు డబ్బు అందుతుంది.

  మకర రాశి (Capricorn)
  ఈ రాశి వారికి ఉద్యోగపరంగా శుభయోగం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆర్థికంగా కోలు కుంటారు. అప్పుల బాధకు పరిష్కారం దొరుకుతుంది. ఇబ్బందుల్లో ఉన్న మిత్రుల్నిఆదుకుంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. శ్రమ మీద కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు.

  కుంభ రాశి (Aquarius)
  ఈ రాశి వారికి తలచిన పనులు త్వరగానే పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా కలిసి వస్తుంది. వాహన సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల కారణంగా లాభపడతారు. ఇప్పుడు మంచి పనులు తల పెడితే సత్పలి తాలు ఇస్తాయి. ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు.

  ఇది కూడా చదవండి: Zodiac Signs: ఏ రాశుల వారికి ఏ హాబీలు ఉంటాయి?

  మీన రాశి (Pisces)
  ఈ రాశి వారికి ఉద్యోగంలో బాగా శ్రమ పెరుగుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తే మంచే జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఎవరినీ పూర్తిగా నమ్మవద్దు. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించండి. పరిచయస్థులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆ రోగ్యానికి ఢోకా లేదు.
  Published by:Krishna Kumar N
  First published: