Home /News /astrology /

HOROSCOPE 23RD JANUARY 2022 HERE TODAY ASTROLOGY RASHIFAL FOR ALL 12 ZODIAC SIGNS PJC GH SK

Horoscope Today: జనవరి 23 దినఫలాలు.. ఈ రాశుల వారికి శృంగారంపై ఆసక్తి పెరుగుతుంది

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today: మేషం నుంచి మీన రాశి వరకు.. జనవరి 23, ఆదివారం నాడు ఎవరికి ఎలా గడుస్తుందో దినఫలాల్లో తెలుసుకుందాం..

(పూజాచంద్ర, జ్యోతిష్య నిపుణులు)

నేడు ఆదివారం. వివిధ రాశుల వారికి శుభకరంగా ఉండనుంది. కొందరు తమ పాత మిత్రులను కలుసుకుంటారు. మరికొందరు తమ దైనందిన జీవితంలో కొందరితో పోరాడాల్సి ఉంటుంది. ఇలా మేషం నుంచి మీన రాశి వరకు.. జనవరి 23, ఆదివారం నాడు ఎవరికి ఎలా గడుస్తుందో దినఫలాల్లో తెలుసుకుందాం..* మేషం (Aries): మార్చి 21-ఏప్రిల్ 19
గతంలో ఇచ్చిన హామీలను పూర్తి చేయడానికి ఇది సరైన సమయం. క్షమించే గుణం ఉన్న వ్యక్తుల సహాయంతో పాత గాయాలు నయమవుతాయి. మానసిక ఆనందం కోసం మీ భాగస్వామితో కొంత సమయం గడపండి. శాకాహారం తీసుకుంటే మంచిది. పరిపాలనలో ఉన్న వ్యక్తులు బాగా పని చేసే అవకాశం.

లక్కీ సైన్- మూడు పావురాలు

* వృషభం(Taurus) : ఏప్రిల్ 20-మే20
ప్రాధాన్యతా క్రమంలో అత్యవసర పనులను పూర్తి చేయండి. మీ నైపుణ్యాలను దూరపు బంధువులు మెచ్చుకుంటారు. చట్టపరమైన విషయాలను పొడిగించకపోవడం మంచిది. కోర్టు వెలుపల పరిష్కారమయ్యే అవకాశం ఉంటే దాన్ని ఫాలో అవ్వండి. మీ కుటుంబంతో కలిసి వేడుకలకు హాజరవుతారు. బహిరంగ స్థలాల్లో జాగ్రత్తగా ఉండండి.. ఎందుకంటే దొంగతనం జరిగే ఛాన్స్ ఉంది.

లక్కీ సైన్- కొత్త పుస్తకాలు

Vastu Tips: మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులా? డబ్బు నిలవడం లేదా? ఈ తప్పులు చేయకండి

* మిథునరాశి (Gemini): మే 21- జూన్ 21
ఫ్యాక్టరీ యజమానులు, చిన్న వ్యాపారులు పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికపరంగా సానుకూల ఫలితాలు ఉన్నాయి. పత్రాలపై సంతకం చేసేముందు జాగ్రత్త. పనిలో భాగంగా ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఏదైనా పనిని చేసేందుకు బద్దకిస్తారు.

లక్కీ సైన్- సిట్రస్ ఫ్రూట్

* కర్కాటకం(Cancer): జూన్ 22- జూలై 22
ఈ రాశి వారు షాపింగ్ చేసే అవకాశం. గంటల తరబడి డిజిటల్ స్క్రీన్‌కి అతుక్కుపోతారు. శృంగారంపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. క్లిష్టమైన ప్రణాళికలపై మెరుగ్గా పని చేయండి.

లక్కీ సైన్- వెండి ట్రే

ఈ తేదీలో పుట్టిన వారికి ఎంతటివారితోనైనా మాట్లాడే శక్తి ఉంటుంది! రాజులు మహారాజులు

* సింహం (Leo): జూలై 23- ఆగస్టు 22
మీరిప్పుడు కొంచెం శక్తిమంతంగా మారుతారు. న్యాయ పోరాటం తాత్కాలికమే. అది మీకు అనుకూలంగా వస్తుంది. గడువు తేదీల్లో మార్పు కారణంగా అంతరాయం కలిగే అవకాశం. మంచి ఫ్రెండ్​ ద్వారా మీ జీవితాన్ని సులభతరం చేసుకోండి. అవతలి వ్యక్తులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అందుకే మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ప్రయత్నించండి.

లక్కీ సైన్- పావురం

* కన్య(Virgo): ఆగస్టు 23-సెప్టెంబర్ 22

జీవితంలో షార్ట్‌కట్‌ల కోసం వెతక్కుండా ప్రస్తుత పరిస్థితుల పట్ల సరిగా వ్యవహరించండి. ఫలితంగా భవిష్యత్తులో మరింత బలపడతారు. తాత్కాలిక పరిష్కారాలకు బదులు దూకుడుగా ఆలోచించండి. మీ పాత స్నేహితుడు ఒకరు వ్యాపార ప్రతిపాదనను పంపుతారు. ఇది మీకు ఉపయోగకరంగానే ఉంటుంది.

లక్కీ సైన్- న్యూ షాప్

రాశిచక్రం ప్రకారం.. 2022లో జతకట్టబోయే బెస్ట్ జోడీ ఏదో తెలుసా?

* తుల (Libra): సెప్టెంబర్ 23-అక్టోబర్ 23
ప్రస్తుతానికి జీవిత పరిస్థితి చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది. కొందరు బంధువులు లేదా స్నేహితులు త్వరలో కలిసిపోవాలని ప్లాన్ చేస్తుంటారు. డబ్బు సమస్యల నుంచి కొంత సానుకూలత కనిపిస్తాయి. ఊహించని పని కొత్త సవాలుగా ఎదురైనప్పటికీ.. ప్రేరణ పొందేందుకు తగినంత ఉత్తేజం లభిస్తుంది. గత సమస్యల నుంచి మీ మనస్సు క్లియర్​గా ఉంచుకోండి.

లక్కీ సైన్- ఫ్రెంచ్ విండో

* వృశ్చికం (Scorpio): అక్టోబర్ 24 - నవంబర్ 21
మీ భావోద్వేగాలను ఎక్కువగా అణచుకోకండి. సృజనాత్మకత కొత్త వెలుగునిస్తుంది. సరికొత్త ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి. గొడవలు, వాదనలు జరిగే అవకాశం ఉంది. ఆ పరిస్థితులను నివారించండి. ఈ రోజు షాపింగ్ చేస్తారు. అనుకోకుండా కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం. కుటుంబంలోని వృద్ధులతో మంచిగా మాట్లాడండి. వారి కోసం కొంత సమయం కేటాయించండి.

లక్కీ సైన్- గడ్డి

* ధనుస్సు(Sagittarius): నవంబర్ 22 - డిసెంబర్ 21
మీ మనస్సులో అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈ గందరగోళం కొంతకాలం కొనసాగవచ్చు. ఈ విషయాలను అతిగా ఆలోచించకండి. అర్థం చేసుకునే స్నేహితుడు ఒకరు.. భావోద్వేగంగా మద్దతు అందిస్తారు. కొత్త దినచర్యను వెదుక్కొండి.

లక్కీ సైన్- తెల్లటి కప్పు

ఈ 6 రాశులవారు పుట్టుకతోనే ఐశ్వర్యవంతులు.. వీరికి లక్ష్మి అనుగ్రహం

* మకరం(Capricorn) : డిసెంబర్ 22-జనవరి 19
మీ పని ప్రదేశం వద్ద నుంచి శుభవార్త వింటారు. మీరు చేసే ప్రయత్నాలను మీ సీనియర్లు గమనిస్తారు. మీ భాగస్వామి మీతో ఏదైనా విషయంపై చర్చించేందుకు మొహమాట పడతారు. మీరే చర్చను ప్రారంభించండి. కీలక సమయాల్లో నిశ్శబ్దాన్ని మెయింటెన్ చేయండి. ప్రతి వాదనలో ఇన్​వాల్వ్ కావలసిన అవసరం లేదు.

లక్కీ సైన్- ఇష్టమైన పానీయం

* కుంభం (Aquarius): జనవరి 20- ఫిబ్రవరి 18
గత కొన్ని రోజుల నుంచి నెమ్మదిగా ఉన్న జీవితంలో ఇప్పుడు వేగం పెరుగుతుంది. కొత్త నియమ నిబంధనల కారణంగా వాణిజ్య లావాదేవీలకు ఆటంకం ఏర్పడుతుంది. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కోసం దరఖాస్తు చేయడానికి ప్రయత్నిస్తే ఆలస్యం అవుతుంది. బ్యాంకు రుణాల నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది.

లక్కీ సైన్- ఎర్ర బస్సు

* మీనం (Pisces): ఫిబ్రవరి 19 - మార్చి 20
భావోద్వేగ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నట్లయితే.. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అయితే ఈ దశ త్వరలోనే గడిచిపోతుంది. జరిగిందంతా ఒక కారణంతో జరిగిందని గ్రహించండి. మీ సన్నిహిత వ్యక్తి నుంచి సహాయం పొందే అవకాశం ఉంది. అదే మిమ్మల్ని ముందుకు తీసుకువెళుతుంది.
లక్కీ సైన్- బంగారు పూత టపాకాయలు
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు