హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Horoscope 23-8-2021: రాశి ఫలాలు.. పనులు పూర్తి, హామీలతో సమస్యలు

Horoscope 23-8-2021: రాశి ఫలాలు.. పనులు పూర్తి, హామీలతో సమస్యలు

Horoscope: రాశి ఫలాలు

Horoscope: రాశి ఫలాలు

Horoscope today 23-8-2021: నేడు సోమవారం. ఇవాళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏ రాశుల వారికి బాగా కలిసొస్తుందో.. ఎవరికి అప్రమత్త సూచనలు ఉన్నాయో తెలుసుకుందాం.

Horoscope 23-8-2021: రాశిఫలాలు ఎన్నో అంశాలపై ప్రభావితమై ఉంటాయి. గ్రహాలు, తిథులు, నక్షత్రాలు, సూర్య గమనం, కాలం... ఇలా ఎన్నో అంశాలు రాశి ఫలాలను ప్రభావితం చేస్తాయి. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి కొన్ని సమయాలు కలిసొస్తాయి. అలాగే... కొన్ని రాశుల వారికి కొన్ని సమయాలు ప్రమాదకరంగా మారతాయి. అంతా బాగుంటే... మనం టెన్షన్ పడాల్సిన పనిలేదు. అదే... ప్రమాదం పొంచి ఉంటే మాత్రం అప్రమత్తం అవ్వాలి. అలా అయ్యేందుకు రాశి ఫలాలు సహకరిస్తాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. మరి ఇవాళ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో, ఎవరికి బాగా కలిసొస్తుందో తెలుసుకుందాం.

మేష రాశి (Aries)

ఒక ప్రణాళిక ప్రకారం పట్టుదలగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారంలో కొద్దిగా ఇబ్బందులు ఎదురైనా సమయస్ఫూర్తితో వ్యవహరించి నెగ్గుకొస్తారు. ఒక కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకోవాలి.

వృషభ రాశి (Taurus)

ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపారం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. తల పెట్టిన పనులు బాగా శ్రమ మీద పూర్తవుతాయి. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు.

మిథున రాశి (Gemini)

ఆర్థికంగా అదృష్ట కాలం నడుస్తోంది. ఇప్పుడు తల పెట్టిన పనులు సత్ఫలితాలనిస్తాయి. ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తోంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

కర్కాటక రాశి (Cancer)

ఉద్యోగంలో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. గృహ, వాహనయోగాలకు అవకాశం ఉంది. మీకు రావాల్సిన డబ్బు అందుతుంది. ఒక శుభ వార్త మీ ఆందోళనను తగ్గిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. మీవల్ల కొందరికి మంచి ఉపకారం జరుగుతుంది. వ్యాపారం జాగ్రత్త.

సింహ రాశి (Leo)

మంచి యోగం పట్టే కాలం ఇది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చిన్న ప్రయత్నంతోనే ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ధనలాభానికి అవకాశం ఉంది. అధికారుల వల్ల మేలు జరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోండి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం వస్తుంది.

కన్య రాశి (Virgo)

ఆటంకాలు ఎదురవుతున్నా ఏకాగ్రతతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడి, శ్రమ ఎక్కువవుతుంది. ఒత్తిడికి గురి కావద్దు. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబపరంగాను, ఉద్యోగపరంగాను మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కొద్దిగా ఆదాయం పెరుగుతుంది.

తుల రాశి (Libra)

ఉద్యోగ, వ్యాపారపరంగా కాలం అనుకూలిస్తోంది. పదవీ లాభం కనిపిస్తోంది. వ్యాపారం లాభదాయకమవుతుంది. బంధుమిత్రులకు మీ ద్వారా మేలు జరుగుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. స్థాన చలన సూచనలున్నాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబపరంగా శాంతి లభిస్తుంది.

వృశ్చిక రాశి (Scorpio)

మీ ప్రయత్నాల మీద మీ పురోగతి ఆధారపడి ఉంటుంది. పట్టుదలగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులుంటాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. హామీలు ఉండవద్దు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి.

ధనస్సు రాశి (Sagittarius)

ఉద్యోగ, వ్యాపారాల్లో పట్టుదలగా లక్ష్యాన్ని చేరే ప్రయత్నం చేయండి. ఒక విశేష శుభం జరిగే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. కలహాలకు, విభేదాలకు అవకాశం ఇవ్వవద్దు. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక ప్రయత్నాలు కొద్దిగా ఆశాభంగం కలిగిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మకర రాశి (Capricorn)

శుభ పరిణామాలున్నాయి. ఉద్యోగంలో విశేషమైన గుర్తింపు లభిస్తుంది. శ్రమ మీద పనులు కొన్ని పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మీ కోరిక ఒకటి నెరవేరుతుంది.

కుంభ రాశి (Aquarius)

ఉద్యోగపరంగా మేలు జరుగుతుంది. శ్రద్ధ పెడితే ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది. ఆదాయం పరవాలేదు. అనవసర ఖర్చులకు అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. ఇంట్లో శుభం జరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. శుభవార్త వింటారు.

ఇది కూడా చదవండి: Zodiac Signs: రాశుల్లో కార్డినల్ రాశులేవి? వాటి ప్రత్యేకతేంటి?

మీన రాశి (Pisces)

ఉద్యోగపరంగా సకాలంలో బాధ్యతలు, లక్ష్యాలు పూర్తి చేస్తారు. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ముఖ్య కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారంలో విశేష లాభాలు సంపాదిస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. బంధుమిత్రులకు సాయపడతారు.

First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac sign

ఉత్తమ కథలు