Home /News /astrology /

HOROSCOPE 19 7 2021 THESE ZODIAC SIGNS MAY GET MONEY TODAY AND THESE RASI PHALALU MAY GET QUARRELS TODAY NK

Horoscope 19-7-2021: నేటి రాశి ఫలాలు... వీరికి ధనలాభం... ఈ రాశుల వారికి వివాదాల ముప్పు

Horoscope: నేటి రాశి ఫలాలు

Horoscope: నేటి రాశి ఫలాలు

Horoscope Telugu: ఈ రోజు (జులై 19, 2021) రాశిఫలాలు ఎలా ఉన్నాయి? ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు?

  Horoscope today: గ్రహాలు, తిథి, నక్షత్రం వంటి అంశాల ఆధారంగా రాశి ఫలాలను నిర్దేశిస్తున్నారు జ్యోతిష పండితులు. ఇవి ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. గ్రహాలు ఏ రాశి క్షేత్రంలో తిరుగుతున్నాయో దాని ఆధారంగా... వారి రాశి ఫలాలపై మంచి, చెడు ఫలితాలు ప్రభావం చూపుతాయి. మంచి జరిగే అవకాశం ఉంటే... ఆనందమే. అదే చెడు జరిగే అవకాశం ఉంటే... అప్రమత్తం అవ్వాలి. మానవ సంబంధాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి. అలాగే ఫైనాన్షియల్ విషయాల్లో అలర్ట్‌గా ఉండాలి. అలా మనల్ని అప్రమత్తం చెయ్యడంలో రాశిఫలాలు ఉపయోగపడతాయి. మరి 19-7-2001 నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో... పండితులు ఎలాంటి పంచాంగం చెబుతున్నారో చూడండి.

  మేష రాశి (Aries)
  పనులు పూర్తి కావడానికి ఎక్కువగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. అనుకోని సమస్య ఒకటి ఎదురవుతుంది. ఉద్యోగ, వ్యాపారంలో శుభవార్త వింటారు. మిత్రులు సహాయపడతారు. సానుకూల దృక్పథంతో వ్యవహరించండి. ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

  వృషభ రాశి (Taurus)
  అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. సమయానికి సాయం అందుతుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆంతరంగిక విషయాలు ఎవరితోనూ చర్చించవద్దు. బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

  ఇది కూడా చదవండి: Zodiac Signs: ఈ రాశుల వారు మెంటల్‌గా స్ట్రాంగ్... ఒక్కసారి కమిటైతే...

  మిథున రాశి (Gemini)
  వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రయాణాలు కలసి వస్తాయి. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది.

  కర్కాటక రాశి (Cancer)
  ఉద్యోగ, వ్యాపారాలు సాఫీగా ముందుకు సాగిపోతాయి. స్వయంకృషితో మంచి పేరు తెచ్చుకుంటారు. సంపద పెంచుకునే ఆలోచన చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడిని తట్టుకుని సత్ఫలితాలు సాధిస్తారు. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

  సింహ రాశి (Leo)
  వృత్తి ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి అధికంగా ఉంటాయి. ప్రతి విషయాన్నీ కుటుంబ సభ్యులతో చర్చించి సలహాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ధనలాభానికి అవకాశం ఉంది. మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండండి. విదేశాల్లో ఉన్నా సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.

  కన్య రాశి (Virgo)
  ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. ఇంటా బయటా మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్య సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యమైన పనులల్లో అవరోధాలు తొలగుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఎవరికీ హామీలు ఉండొద్దు.

  తుల రాశి (Libra)
  శక్తి వంచన లేకుండా కృషి చేసి పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో సహెూద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. బంధువులకు మీ వల్ల మేలు జరుగుతుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధం కుదరవచ్చు.

  వృశ్చిక రాశి (Scorpio)
  మంచి జీవితం కోసం మార్గాలు ఆలోచిస్తారు. అనుకున్న పనులు శ్రమ మీద పూర్తవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. ఆదాయం పరవాలేదు. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. డబ్బు నష్టం జరగవచ్చు. ఆరోగ్యం పరవాలేదు.

  ధనస్సు రాశి (Sagittarius)
  ఉద్యోగ, వ్యాపారాల్లో మీ కృషి సత్ఫలితాలనిస్తుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉన్నత పదవులకు అవకాశం ఉంది. ఖర్చు విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఆరోగ్యం బాగుంటుంది. గృహ ప్రయత్నం ఫలిస్తుంది. సంతానం నుంచి చక్కని శుభవార్తలు వింటారు.

  మకర రాశి (Capricorn)
  ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు ఉపాధ్యాయుల ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. వివాదాలకు దూరంగా ఉండండి.

  ఇది కూడా చదవండి: Zodiac signs: ఈ రాశుల వారికి పర్వతాలు ఇష్టం... ప్రకృతిలోనే తిరుగుతారు

  కుంభ రాశి (Aquarius)
  ఉద్యోగపరంగా మంచి సమయం. వ్యాపారంలో శ్రమ పెరిగినా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆదాయం పెంచుకునే మార్గాల గురించి ఆలోచిస్తారు. అప్పులు తీరుస్తారు. శుభవార్తలు వింటారు. మిత్రులకు మీ వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యం పరవా లేదు.

  మీన రాశి (Pisces)
  అన్ని విధాలా అనుకూల సమయం. శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సహకారం ఉంటుంది. ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులు సునాయాసంగా లాభాలు ఆర్జిస్తారు.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: ', Astrology, Cheating horoscope, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac sign

  తదుపరి వార్తలు