Horoscope Today: అక్టోబరు 15 రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి పెళ్లి కుదురుతుంది..

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today: నేడు విజయదశమి. మరి దసరా రోజున ఏ రాశుల వారికి ఎలా ఉంది? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు. మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకుందాం.

  • Share this:
    కాలజ్ఞానం

    అక్టోబరు 15, 2021

    దినఫలాలు


    మేష రాశి (Aries): ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు, సమస్యలు ఎదురవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్య౦ పరవాలేదు. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. శుభవార్త ఒకటి ఊరట కలిగిస్తుంది. కుమారుడికి ఇష్టపడినవారితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారులకు పెద్దగా ఎదుగుదల ఉండకపోవచ్చు.

    వృషభ రాశి (Taurus): ఉద్యోగం సంతృప్తిగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సత్ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి.

    మిథున రాశి (Gemini): ఉద్యోగంలో బాధ్యతల మార్పుకు అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు బాగాపెరుగుతాయి. పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ధనలాభ సూచనలున్నాయి. ఆర్థిక ప్రయత్నాలకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారం పెళ్లికి దారితీస్తుంది.

    కర్కాటక రాశి (Cancer): ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చే అవకాశం ఉంది. బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆర్ధిక, రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం బాగుంది. కీలక విషయాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించండి. వ్యాపారులు లాభాలు అర్జిస్తారు. పెళ్లి సంబంధం ఖాయం చేసుకుంటారు.

    సింహ రాశి (Leo): ఉద్యోగం మారాలనే నిర్ణయానికి వస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వీలైనంతగా దుబారాను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి వ్యాపారులకు, స్వయం ఉపాధివారికి అన్నివిధాలా బాగుంది.

    కన్య రాశి (Virgo): ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితులు అపార్థం చేసుకునే సూచనలున్నాయి. పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో కాలక్షేపం చేస్తారు.

    తుల రాశి (Libra): ఉద్యోగంలో తగిన గుర్తింపు లభిస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు.

    వృశ్చిక రాశి (Scorpio): ఉద్యోగంలో అనుకోకుండా సమస్యలు ఎదురవుతాయి. స్థాన చలనానికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. దూరపుబంధువులు కలిసే అవకాశం ఉంది. వ్యాపారులు బాగా శమపడాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.

    ధనస్సు రాశి (Sagittarius): ఉద్యోగంలో విజయవంతంగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. అన్నివిధాలా సమయం అనుకూలంగా ఉంది. అనారోగ్యం నుంచి బయటపడతారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంత అవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆదాయాన్ని పంచుకునే దిశలో ఆలోచనలు ప్రారంభిస్తారు.

    మకర రాశి (Capricorn): ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ, ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారుల మీద ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. మధ్య మధ్య అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త, దగ్గరవారికి ఆర్థికంగా సహాయపడతారు.

    కుంభ రాశి (Aquarius): ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అదాయం నిలకడగా ఉంటుంది. కానీ, ఖర్చులు అదుపు తప్పుతాయి. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. వ్యాపారులకు శ్రమ ఎక్కువ రాబడి తక్కువ అన్నట్టుగా ఉంటుంది.


    మీనరాశి (Pisces): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు, స్వయం ఉపాధి రంగాలవారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదురవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. స్పెక్యులేషన్‌ లాభించకపోవచ్చు.
    Published by:Shiva Kumar Addula
    First published: