Horoscope today: రాశి ఫలాలు... వీరికి ధనప్రాప్తి, ప్రశంసలు

Horoscope today: రాశి ఫలాలు

Horoscope today 12-July-2021: ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి. ఏ రాశుల వారికి బాగా కలిసొస్తుంది. ఆర్థిక అంశాలు ఎవరికి ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

 • Share this:
  Zodiac Signs Daily: జులై 12, 2021 దినఫలాలు ఏం సూచిస్తున్నాయి? నేటి రాశి ఫలాలలో ఏయే రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి. జ్యోతిష పండితులు ఏ రాశుల వారికి ఎలాంటి సూచనలు చేస్తున్నారో తెలుసుకుందాం. ఏవైనా అప్రమత్త సూచనలు చేస్తే... తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. భవిష్యత్తును మనం కరెక్టుగా ఊహించలేకపోవచ్చు గానీ... జ్యోతిష పండితులు తిథులు, రాశులు, నక్షత్రాలు, కాలం, సూర్య గమనం, గ్రహ బలం వంటి అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రాశి ఫలాలు ఇస్తారు. మరి జులై 12న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  మేష రాశి (Aries)
  సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఆటంకాలు ఎదురవుతున్నా పనులు పూర్తి చేస్తారు. ముఖ్య కార్యాల మీద బాగా శ్రద్ధ పెట్టండి. ఉద్యోగంలో ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. వ్యాపారంలో లాభాలు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.

  వృషభ రాశి (Taurus)
  అనుకూలమైన సమయం ఇది. పనులన్నీ పూర్తవుతాయి. అవరోధాలు, ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మిమ్మల్ని చూసి అసూయపడే వారుంటారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. పని ఒత్తిడి ఉంటుంది.

  మిథున రాశి (Gemini)
  ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. సంపద పెరిగే సూచనలున్నాయి. వ్యాపారపరంగా శ్రమ ఎక్కువవుతుంది. పలుకుబడి పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరికీ హామీలు ఉండొద్దు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది.

  కర్కాటక రాశి (Cancer)
  తగినంత ప్రయత్నం చేస్తే అదృష్టం మీదవుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అన్నివిధాలా అనుకూలమైన సమయం ఇది. ఉద్యోగంలో అవకాశాలు కలిసి వస్తాయి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. ప్రశాంతత చేకూరుతుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. వ్యాపారులకు చాలా బాగుంది.

  సింహ రాశి (Leo)
  ప్రయత్నాల్ని కొనసాగిస్తే విజయం సిద్ధిస్తుంది. జీవితంలో స్థిరత్వం ఏర్పడడానికి నాంది పలుకుతారు. ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు ఇది సమయం కాదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.

  కన్య రాశి (Virgo)
  ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఎటు చూసినా శుభమే గోచరిస్తోంది. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. చేస్తున్న పనులలో పురోగతి ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించి అవసరమైన ప్రణాళికలను ఆలోచిస్తారు. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త.

  తుల రాశి (Libra)
  ఉద్యోగంలో ఉత్సాహంతో పని చేస్తారు. అవసరాలకు ధనం లభిస్తుంది. ఆదాయపరంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడికి కాకుండా మంచి నిర్ణయాలు తీసుకోండి. మిత్రుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. డబ్బు జాగ్రత్త.

  వృశ్చిక రాశి (Scorpio)
  ముఖ్యమైన పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక వ్యవహారాలు ఫలిస్తాయి.

  ధనస్సు రాశి (Sagittarius)
  కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కొన్ని కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధువులకు సహాయం చేస్తారు.

  మకర రాశి (Capricorn)
  గతంలో తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉన్న ఊళ్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు.

  కుంభ రాశి (Aquarius)
  ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. సానుకూల వాతావరణం నెలకొని ఉంది. వ్యాపారంలో కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. ధనలాభం ఉంది. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. రుణాలు తీరుస్తారు. పిల్లలు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది.

  ఇది కూడా చదవండి: Vastu Shastra: ఇంట్లో ఈ 8 వస్తువులూ ఉంచండి... ఇక డబ్బుకు కొరత ఉండదు

  మీన రాశి (Pisces)
  ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఉద్యోగపరంగా గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూల సమయం. ఆరోగ్యం పరవాలేదు. హామీలు ఉండొద్దు.
  Published by:Krishna Kumar N
  First published: