• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • HOROSCOPE 07 5 2021 HERE IS TODAYS ASTROLOGY PREDICTIONS FOR ALL 12 ZODIAC SIGNS IN TELUGU SK

Horoscope today: మే 7 రాశి ఫలాలు.. వీరికి అనుకోకుండా పెళ్లి కుదురుతుంది

Horoscope today: మే 7 రాశి ఫలాలు.. వీరికి అనుకోకుండా పెళ్లి కుదురుతుంది

ప్రతీకాత్మక చిత్రం

Horoscope today: నేటి రాశి ఫలాలు. శుక్రవారం 12 రాశుల వారి దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • Share this:
    కాలజ్ఞానం

    దినఫలాలు

    మే 7, 2021

    మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

    అన్నివిధాలా అనుకూంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులతో గానీ, స్నేహితులతో గానీ సరదాగా గడుపుతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. ఎంతో శ్రమ మీద పనుల పూర్తవుతాయి.



    వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

    ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు ఆర్థికంగా పుంజుకుంటారు
    ఎంతో శ్రమపడి పనులు పూర్తి చేస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సన్నిహితులు మీకు అండగా నిబడతారు.



    మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

    ఆదాయం పరవాలేదు కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. హామీగా ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త.

    కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

    ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా ఆలస్యమైన పనులు పూర్తవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.



    సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

    ఉద్యోగం మారదలచుకుంటే గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. ఇంటా బయటా శ్రమ ఎక్కువగా ఉంటుంది.



    కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

    ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. రావాల్సిన డబ్బు డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం బాగా ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు, ప్రోత్సాహం లభిస్తాయి. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి.


    తులా (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

    ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. దూరపు బంధువుతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య పరిష్కరించుకుంటారు.



    వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

    అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయి. ఆదాయం పరవాలేదు. కానీ ఖర్చు పెరుగుతాయి. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. తలపెట్టిన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.



    ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

    ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుకు కళ్లెం వేయాలి. ఇతరు వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది.



    మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

    ఉద్యోగంలో అధికారుల నుంచి అభినందనలు లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.



    కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

    రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభ ా ర్తు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎక్కడా ఎవరికీ హామీ ఉండవద్దు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. చెడు స్నేహాలకు వీలైనంత దూరంగా ఉండండి. జూదాల జోలికి వెళ్లవద్దు.



    మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

    ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పరవా లేదు. ఖర్చు బాగా తగ్గించుకోవాలి. సంతానం నుంచి శుభవార్త వింటారు. చిన్ననాటి స్నేహితుల్ని పలకరిస్తారు. ఎవరికీ డబ్బు ఇవ్వొద్దు. శరీరానికి కాస్తంత విశ్రాంతి అవసరం.
    Published by:Shiva Kumar Addula
    First published: