Home /News /astrology /

Horoscope 30-7-2021: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు శుభవార్త వింటారు..

Horoscope 30-7-2021: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు శుభవార్త వింటారు..

Horoscope 30-7-2021: నేటి రాశి ఫలాలు

Horoscope 30-7-2021: నేటి రాశి ఫలాలు

Horoscope today: ఇవాళ శుక్రవారం. నేడు కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంది. శుభవార్తలు వింటారు. మరికొందరికి మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి మేషం నుంచి మీనం వరకు ఎవరికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

  కాలజ్ఞానం

  దిన ఫలాలు

  జులై 30, 2021

  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ధనలాభం ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. సుఖసంతోషాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తోంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. వితరణ కార్యక్రమంలో పాల్గొంటారు. శుభవార్త వింటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

  వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ముఖ్యమైన పనుల్లో అప్రమత్తత అవసరం. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. కొందరు బంధువుల నుంచి చికాకులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. తగినంత విశ్రాంతి అవసరం. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.

  మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులుంటాయి. ఆదాయ వనరులు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మరింత శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఇంట్లో, శాంతికి, సుఖానికి లోటుండదు. శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.

  కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. సమాజంలో కీర్తిప్రతిష్టలు అందుకుంటారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ముఖ్యమైన పని ఒకటి పూర్తవుతుంది. శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.

  సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఉద్యోగంలో సుస్థిరత ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంది. పట్టుదలతో కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

  కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఎంతో ప్రయత్నం మీద పనులు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. మీకు రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి.

  తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మున్ముందు కలిసి వస్తాయి. కుటుంబ సమస్య ఒకటి ఇబ్బంది పెడుతుంది. ఇంటా బయటా ఒత్తిళ్లు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది.

  వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) ఉద్యోగ జీవితం బాగానే ఉంటుంది కానీ, కుటుంబంలో ప్రశాంతత తగ్గుతుంది. వ్యాపారపరంగా అప్రమత్తంగా ఉంటే మంచిది. సమాజంలో చక్కని గుర్తింపు లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. తలచిన పనులు నెరవేరుతాయి. ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.

  ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టం జరగవచ్చు.

  మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుని పనులు మొదలు పెట్టండి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. కొన్ని కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు.

  కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇంటా బయటా శక్తికి మించి శ్రమ పడతారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులకు సహాయం చేస్తారు. ఆదాయం ఒడిదుడుకులకు లోనవుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మిత్రులతో విభేదాలు తలెత్తుతాయి.

  మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఉద్యోగంలో హెూదా పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. సంకల్ప బలంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఇతర సంస్థల నుంచి కొత్త ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac sign

  తదుపరి వార్తలు