Home /News /astrology /

HERE IS THE THINGS THAT NOT DO IN 2022 AS PER YOUR ZODIAC SIGN NS GH

Zodiac Signs: మీ రాశి ప్రకారం 2022లో చేయకూడని పనులు ఇవే.. ఎవరికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..

మీ రాశి ప్రకారం 2022లో చేయకూడని పనులు ఇవే.. ఎవరికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..

మీ రాశి ప్రకారం 2022లో చేయకూడని పనులు ఇవే.. ఎవరికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..

మరికొన్ని రోజుల్లోనే మనమంతా న్యూ ఇయర్ (New Year 2022) లోకి వెళ్లబోతున్నాం. అయితే.. ఈ సందర్భంగా జ్యోతిషులు సూచించిన వివరాల ప్రకారం 2022లో ఏయే రాశుల (Zodiac Signs) వారు ఎలాంటి పనులు చేయకూడదో చూద్దాం.

మరికొన్ని రోజుల్లో మనమందరం కొత్త సంవత్సరంలోకి (New Year 2022) అడుగుపెట్టనున్నాం. ఎప్పటిలానే మనలో చాలా మంది న్యూ ఇయర్ రిజల్యూషన్ (నూతన సంవత్సర తీర్మానం)కు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తిరిగి ఎప్పటిలానే ఆ తీర్మానాన్ని ఎంతో మంది గాలికొదిలేయడం కూడా సహజమే. ఇలా ఏదైనా చేయాలని అనుకోవడం, సాధ్యపడక మధ్యలోనే వదిలేయకుండా అనుకున్న కార్యాలపై దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండాలి. రెండు సంవత్సరాలుగా పూర్తి అనిశ్చితితో కరోనా మహమ్మారి దెబ్బతీసిన తరుణంలో మంచి రోజుల కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతిషులు నిర్దేశించిన ప్రకారం 2022లో ఏయే రాశుల వారు ఎలాంటి పనులు చేయకూడదో చూద్దాం.

మేషం..
గతాన్ని మీ ప్రస్తుతంతో ముడిపెట్టవద్దు. చేసిన తప్పులు, పొరపాట్ల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే విజయం, సంతృప్తి వాటంతట అవే వస్తాయి.
Rahu effect: జాగ్రత్త.. 2022లో రాహువు కన్ను ఈ 6 రాశులపైనే ఉంటుందట..

వృషభం..
మీ హద్దులు, పరిమితుల నుంచి విముక్తి పొందాలంటే ఆందోళనలు, అనిశ్చితులను వదిలిపెట్టాలి. కొత్త విషయాలను ప్రయత్నించండి. సులభమైన మార్గాన్ని ఎంచుకోకండి.
Zodiac Signs: 2022లో వీళ్లకు ఇబ్బందులు.. ఈ రాశుల వాళ్లకు తిరుగులేదు.. పూర్తి వివరాలు

మిథునం..
మెరుగైన, ఆరోగ్యకరమైన ఆహారంతో మీ జీవనశైలిని మార్చుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ను కొనసాగించండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం.

కర్కాటకం..
మీలో మంచి, చెత్త లక్షణాలను గుర్తించడానికి ప్రయత్నించండి. వాటిని వేరుగా చూడండి. 2022లో కొన్ని అంశాల్లో మార్పు జరగవచ్చు. అంతేకాకుండా మీకు మరో అవకాశం లభించవచ్చు. కాబట్టి గొప్ప అవకాశాలను అసలు వదులుకోకండి.

సింహం..
ఓపికగా ఉండండి. కొత్త సంవత్సరంలో మీ ప్రయత్నాలకు తగిన ప్రతిఫలాలను తక్షణమే ఆశించకండి. మీకు కావాల్సింది చేరువలోనే ఉంది. కాబట్టి ఆందోళన చెందకండి.

కన్య..
మీపై ప్రేమ, శ్రద్ధ చూపించే వారితో గడిపేందుకు ప్రయత్నించండి. అయితే మీరు అందరితోనూ స్నేహంగా ఉండాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని పట్టించుకోని వారికి దూరంగా ఉండండి.

తుల..
కొత్త సంవత్సరంలో మీరు చేయాల్సిన పనుల గురించి ఓ జాబితాను సిద్ధం చేసుకోండి. మీ సమయాన్ని వృథా చేసుకోకండి. ఈ సంవత్సరం గత రెండేళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. కాబట్టి టైమ్‌ను సద్వినియోగం చేసుకోండి.

వృశ్చికం..
మోసపూరిత స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండండి. వీళ్లంతా మీలో మంచితనాన్ని అర్థం చేసుకోలేరు.

ధనుస్సు..
ఈ ఏడాది ఆర్థిక విషయాలపై జాగ్రత్త వహించండి. దుబారా ఖర్చు చేయకండి. డబ్బును ఆదా చేసుకోవడానికి ప్రయత్నించండి.

మకరం..
ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపకండి. మీ పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. చదువు, ఉద్యోగం లాంటి విషయాలపై దృష్టి పెట్టండి. వాటిపై ఏకాగ్రత పెడితే మీ లక్ష్యాలను ఆపడం ఎవరి తరం కాదు.

కుంభం..
రోజంతా ఇంట్లోనే ఉండి పనిచేయకండి. సెలవులు, విహారయాత్రల ద్వారా మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడవచ్చు. కొత్త అవకాశాలకు, ఆలోచనలకు స్వాగతం పలకవచ్చు.

మీనం..
మీకు ఇష్టమైనవారితో ఎక్కువ టైమ్ గడపండి. మీ కుటుంబం, ప్రియమైనవారితో ఎక్కువ సమయం గడిపే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Astrology, New Year 2022, Year Ender, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు