భాగస్వామితో సహా అందరి నుంచి తమకు ప్రైవసీ (Privacy) కావాలని చాలా మంది ప్రజలు అనుకుంటారు. ముఖ్యంగా తమ ఫోన్ (Phone)ను భాగస్వామి (Partner) లేదా ప్రియులు (Lover) కూడా చెక్ చేయడానికి ఒప్పుకోరు. దీంతో ప్రియులు వారి ప్రైవసీకి గౌరవం ఇచ్చి మొబైల్ చెక్ (Mobile Check) చేయకుండా ఊరుకుంటారు. కానీ కొందరు మాత్రం తమ లవర్ లేదా భాగస్వామి ఫోన్ చెక్ చేయకుండా అసలు ఉండలేరు. తమ లవర్ నిజాయితీగా ఉన్నారా? లేక మోసం చేస్తున్నారా? వారి విశ్వసనీయత ఎంత అనేది తెలుసుకోవడానికి వీరు మొబైల్ చెక్ చేస్తారు. జ్యోతిష్య శాస్త్రం (Astrology) ప్రకారం, నాలుగు రాశుల వారికి ఈ అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఈ రాశుల వారు (Zodiac Signs) సందు దొరికితే చాలు తమ భాగస్వామి మొబైల్ మొత్తం చెక్ చేస్తారు. మరి వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
వృశ్చికరాశి
వృశ్చికరాశి (Scorpio) వారు గుడ్డిగా ఏదీ నమ్మరు. అన్ని విషయాలు తమ కళ్లతో ప్రత్యక్షంగా చూసిన తర్వాతే వారికి నమ్మకం కుదురుతుంది. వీరు తమకు, తమ భాగస్వామికి మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదని అనుకుంటారు. ఇతరులతో పోలిస్తే వీరికి అనుమానం కూడా కూసింత ఎక్కువే. ఆ అనుమానంతోనే తమ లవర్ టెక్స్ట్ మెసేజెస్ లేదా ఈ-మెయిల్లను తరచూ చెక్ చేస్తూ ఉంటారు. వీరికి తమ లవర్‌పై బొత్తిగా నమ్మకం, విశ్వాసం ఉండదు. అలా వృశ్చికరాశి వారు పర్ఫెక్ట్ లవర్ కాకుండా మిగిలిపోతారు.
మీనరాశి
మీనరాశి (Pisces) వారు తమ జీవిత భాగస్వామిపై పూర్తిగా నమ్మకం ఉంచుతారు. కాకపోతే వీరిలో ఉత్సుకత చాలా ఎక్కువగా ఉంటుంది. అలా అంతులేని క్యూరియాసిటీతో వారు తమ వారి బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ ఫోన్లోని చాటింగ్స్‌ను రహస్యంగా చూసేస్తారు. ఒకవేళ ఈ విషయం లవర్ తెలుసుకున్నా.. ఆ పని తాము చేయలేదని తీవ్రంగా దబాయిస్తారు.
సింహ రాశి
సింహ రాశి (Leo) వారు ఇతరుల నుంచి చాలా ప్రైవసీ కోరుకుంటారు. అలాగే తన ఫోన్‌కి లాక్ వేసుకొని ఫోల్డర్లకు పాస్వర్డ్ కూడా పెట్టుకుంటారు. ఫోన్లో ఉన్న తమ పర్సనల్ వివరాలు ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తపడే వీరు ఇతరుల వ్యక్తిగత వివరాలు మాత్రం తెలుసుకునేందుకు ప్రయత్నించారు. పాస్‌వర్డ్‌లను పంచుకోమని నేరుగా వీరు తమ బంధుమిత్రులను అడుగుతారు. అలాగే ప్రియులను కూడా మొబైల్ పాస్వర్డ్ ఇవ్వాలని బలవంతం చేస్తారు. అయితే లవర్ అలా చేయడానికి నిరాకరిస్తే, వారు మోసం చేస్తున్నారని అనుమానిస్తారు. ఛాన్స్ దొరికితే వీరు తమ లవర్ రహస్యాలను తెలుసుకోవడానికి వారి ఫోన్‌ను పూర్తిగా చెక్ చేస్తారు.
పైన పేర్కొన్న రాశుల వారితో పాటు వృషభరాశి వారు కూడా తమ భాగస్వామి గురించి రహస్యాలు తెలుసుకోవాలనుకుంటారు. కర్కాటక రాశి వారు జీవిత భాగస్వాములకు చాలా నమ్మకంగా ఉంటారు. అలాగే తమ భాగస్వామి నుంచి కూడా అదే నమ్మకాన్ని ఆశిస్తారు. ఈ విశ్వసనీయతను చెక్ చేసేందుకు అప్పుడప్పుడు తమ లవర్ రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మేషరాశి, మకర రాశి వారికి కూడా అనుమానం కాస్త ఎక్కువే. అందువల్ల, వీరు కూడా మొబైల్ చెక్ చేసే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lovers, Smartphones, Zodiac signs