మీరు ఎన్నయినా మర్చిపోవచ్చు కానీ.. దీపం పెట్టేటప్పుడు ఈ 4 పాయింట్లు గుర్తుంచుకోండి.. లేకపోతే అరిష్టం..

దీపం పరబ్రహ్మ స్వరూపం. అందుకే ఒక దీపంతో ఎన్నో దీపాలను వెలిగించవచ్చు. ఇదే సరైన సంప్రదాయం.

దీపం వెలిగించడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. దాన్ని పాటించి దీపాలను పెట్టుకోవాలి. లేకుంటే ఆ ఇంటికి అరిష్టాలు కలుగుతాయి.

  • Share this:
దేవుడికి దీపారాధన diva చేసే విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. అలా కాకుండా.. ఇష్టానుసారంగా చేస్తే, ఆ ఇంటికి అరిష్టం. ఈ దీపారాధన విషయంలో అనేక మందికి సందేహలు వస్తాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

మనం దీపం వెలిగించే టపుడు కొన్ని నియమాలు పాటించాలి. కొందరు మట్టి దీపం పెడితే.. దానిపై మరో దీపం పెట్టి ఆ పిదప దీపాన్ని వెలిగిస్తారు. అలా చేయకూడదు. ఎందుకంటే దేవుడికి పెట్టే దీపంలో ఒక దీపానికి రెండు వత్తిలు వేయాలి. అదే లెక .. వేరే విధంగా పెడితే.. కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

  1. కంచు దీపం ఏదైనా ఒకసారి వాడితే దాన్ని బాగా శుభ్రం చేసి మళ్లీ ఉపయోగించాలి. మట్టి ప్రమిద మడినట్లుగా ఉంటే.. దాన్ని వెంటనే మార్చివేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు.

  2. దీపానికి కూడా అలంకరించాలి. అంటే ప్రమిద ఏదైనా దాని బయటవైపు పసుపు రుద్ది దాని నాలుగు వైపులా కుంకుమ బొట్టు పెట్టాలి.

  3. దీపం పెట్టే అడుగు భాగం కింద కాసిన్ని బియ్యం లేదా పూవుల రెమ్మలు వేయాలి. ఆపైన దీపపు ప్రమిద పెట్టుకోవాలి. ఈ దీపం దిశను కూడా ఉత్తర దిశకు వత్తి ఉండేలా వెలిగించుకోవడం సాధారణం. ఈ వత్తి ఒక్కొవైపు ఒక్కో అర్థాన్ని ఇస్తుంది. కానీ, ఆ ప్రమిదలో ఉండే వత్తిని దేవుడి చిత్రపటానికి బయటవైపుగా ఉండకూడదు.

  4. మరి కొంతమంది దీపంలో వత్తి ఆరిపోతే.. తిరిగి సాయంత్రం అదే వత్తిని వెలిగిస్తారు. దీంతో ఎంతో అరిష్టం కలుగుతుంది. ఎలా అంటే .. ఉదయం తిన్న కంచంలో మళ్లీ తిన్నట్లుగా అర్థం వస్తుంది.


మీకు తెలుసా.. భోజనం ఇలా చేస్తే దరిద్రమేనట!
  1. అందుకే ఒకసారి దీపాధాన చేసిన తర్వాత ఆ దీపం కొండెక్కితే..మ ళ్లీ సాయంత్రం ఎట్టిపరిస్థితుల్లో వెలిగించకూడదు. అది అత్యంత అపవిత్రం. ఆ వత్తిని తీసివేసి.. ఆ కుందులను తీసి కడిగి మళ్లీ నెయ్యి వేసి వెలిగించాల్సిందే. పొరపాటున కూడా తిరిగి ఉపయోగించరాదు. 

  2. దీపాన్ని వెలిగించేటపుడు మన పూర్వీకులు ఒక దీపపు ప్రమిదను తీసుకుని అందులో కాసింతనే నూనె పోసి, ఒక వత్తిని వేసి వెలిగించేవారు. దాంతోనే మిగతా దీపాలను వెలిగించేవారు. ఇది శుభప్రదం.

  3. ఒక్కోసారి ఇది వీలు కాదనిపిస్తే.. అగ్గిపుల్లతో వెలిగించవచ్చు. అగరబత్తితో కూడా దీపాన్ని వెలిగించవచ్చు. ఇది రెండో ఆప్షన్‌ మాత్రమే. కొవ్వొత్తులతో దీపాలని వెలిగించరాదు. ఇది మన సంప్రదాయం కాదు.

Published by:Renuka Godugu
First published: