Home /News /astrology /

HERE ARE THE STATES WHERE DUSSEHRA CELEBRATIONS TAKEN PLACE WITH ETHNIC ELEGANCE RNK

Dussehra 2021: దసరా ఉత్సవాలు ప్రతీష్టాత్మకంగా జరిగేది ఇక్కడే!

వారణాసి: దసరా ఉత్సవాలు

వారణాసి: దసరా ఉత్సవాలు

Dussehra celebrations: ఏడాది పొడవునా.. హిందువులు ఎదురు చూసే పండగ ఇది. ఈ సమయంలో ముఖ్యంగా దుర్గామాతను కొలుస్తారు.

అక్టోబర్‌–నవంబర్‌ రాగానే ప్రతి ఏడాది దసరా Dussehra ఉత్సవాలు మొదలవుతాయి. ప్రతి ఒక్కరూ అంగరంగా వైభంగా నిర్వహించుకుంటారు. అయితే, వివిధ రాష్ట్రాల్లో ఎక్కడ దసరాను కనులపండువగా జరుపుకుంటారో తెలుసుకుందాం. మనదేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ముఖ్యమైన పండ ఉండనే ఉంది. హిమాచల్‌ ప్రదేశ్, గుజరాత్‌ Gujarat నుంచి కర్ణాటక వరకు అలాగే ఉత్తరప్రదేశ్‌లో దసరా ఉత్సవాలను వైభంగా నిర్వహించుకుంటారు.

ఉత్తరప్రదేశ్‌..
దసరారోజు ముఖ్యంగా రావణ దహనంతో ముగుస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యత కలిగినది. ఉత్తరప్రదేశ్‌లో కూడా రాముడు, రావణుడిని వధించే విధంగా ఏర్పాట్లు చేస్తారు. ఇది ఈ రాష్ట్ర నలుమూలల్లో కనిపిస్తుంది. చెడుపై మంచి గెలుపునకు ప్రతీకగా ఈ వేడుక జరుపుకుంటారు. దీనికి వారణాసి పెట్టింది పేరు. లక్నో, కాన్పూర్‌లలో జరుగుతుంది.

ఇది కూడా చదవండి: దుర్గామాత ఆయుధాలు ధరించడం వెనుక రహస్యం?


మైసూర్, కర్ణాటక..
ఇక్కడి ప్రజలు చాలా సంప్రదాయబద్ధంగా దసరా నిర్వహించుకుంటారు. ఈరోజు వారి సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తారు. ముఖ్యంగా మైసూర్‌ ప్యాలస్‌ను దేధీప్యామానంగా అలంకరించి, సాంప్రదాయ పోటీలు నిర్వహిస్తారు. రాయల్‌ ఫ్యామిలీస్‌ కోసం ప్రత్యేకంగా దర్బార్‌ను ఏర్పాటుచేస్తారు.

హిమాచల్‌ ప్రదేశ్‌..
అందమైన కుల్లు హిల్‌ టౌన్‌ దసరాకు ప్రత్యేకం. ఎంతో గ్రాండ్‌గా ఉన్నతంగా వేడుకలు నిర్వహిస్తారు. ఇక్కడ ఈ పండుగను ఏడు రోజులపాటు నిర్వహిస్తారు. ముఖ్యంగా రఘునా«థుడికి పూజలు చేస్తారు.

రాజస్తాన్‌..
ఇక్కడి దసరా కోట అనే ప్రాంతంలో గ్రాండ్‌గా జరుపుతారు. ఇక్కడ కూడా సాంప్రదాయ కళాకారులు నృత్యప్రదర్శన ఉంటుంది. ఇక్కడి గ్రామీణులు ఈరోజు సంప్రదాయ దుస్తులను ధరిస్తారు. రాముడిని పూజించిన తర్వాత రావణదహన కార్యక్రమలు నిర్వహిస్తారు. ఇది చంబల్‌ నదీతీరంలో జరుపుతారు.

ఇది కూడా చదవండి: నవరాత్రి 5వ రోజు అమ్మవారి అలంకరణ.. నైవేద్యం!


గర్భా, గుజరాత్‌..
ఎన్నో కళలకు ప్రసిద్ధిగాంచిన గుజరాత్‌ ఈ సమయంలో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకం గర్భా డ్యాన్స్‌ Garbha . ఈరోజుల్లో సాంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల వుడేన్‌ స్టిక్స్‌తో గర్భా డ్యాన్స్‌ ఆడతారు.

మెదికెరీ, కర్ణాటక..
హాలేరి రాజుల కాలం నుంచి దసరాను వైభవంగా నిర్వహిస్తారు. ఈ పండుగను మరియమ్మా ఫెస్టివల్‌ అని కూడా అంటారు. ఇక్కడ కూడా వైభవంగా సాంప్రదాయ నృత్యాలు నిర్వహిస్తారు.

రామ్‌లీలా,ఢిల్లీ..
దసరా అని చెప్పగానే ఏమాత్రం ఆలోచించకుండా ఢిల్లీ అని చెప్పేస్తారు. ఈరోజుల్లో ఒక పెళ్లితంతుల జరుపుకుంటారు. ఇక్కడ రామ్‌లీలా మైదానంలో దసరా వేడుకలు గ్రాండ్‌గా నిర్వహిస్తారు. ఈరోజు రాముడు, రావణుడిపై ఎలా విజయం సాధిస్తాడు అని పూర్తిగా ఒక ప్రదర్శన రూపంలో చూపిస్తారు. మీరు తప్పకుండా ఒకసారి కచ్ఛితంగా చూడాల్సిన ప్రదేశం.

బస్తర్, ఛత్తీస్‌గఢ్‌..
ఇక్కడ ట్రైబల్స్‌ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ 75 రోజులపాటు వేడుకలు నిర్వహిస్తారు. ఇది 13వ శతాబ్దంలో ప్రారంభమైందట. పాట జాత్ర, కచన్‌ గాడీ, నిషా జాత్ర ప్రత్యేకంగా నిర్వహిస్తారు.
Published by:Renuka Godugu
First published:

Tags: Delhi, Durga Pooja, Dussehra 2021, Himachal Pradesh, Navaratri

తదుపరి వార్తలు