news18-telugu
Updated: December 28, 2020, 9:47 AM IST
వైష్ణో దేవి ఆలయం చెంత మంచు తుఫాను. (Left - File Image)
Snow fall at Vaishno Devi Temple: మనందరికీ మంచు కురిసే దృశ్యం బాగా నచ్చుతుంది. ఎందుకంటే మంచు అలా పడుతుంటే... ఆకాశం మొత్తం మేఘాలతో మూసుకుపోతుంది. అంతా చిమ్మ చీకటి కమ్ముకుంటుంది. ఆ సమయంలో చల్లటి మంచు... చిన్న చిన్న కణాలుగా పడుతూ... ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది. తాజాగా జమ్మూకాశ్మీర్‌లో మంచు తుఫాను వచ్చింది. పర్యాటక ప్రాంతాలన్నీ మంచు మయం అయ్యాయి. ముఖ్యంగా జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం దగ్గర మంచు భారీగా కురుస్తోంది. అదో అద్భుతమైన దృశ్యంలా మారింది. ఆలయం పైన, చుట్టుపక్కలా ఎక్కడ చూసినా మంచే. రాత్రి వేళ.. కరెంటు లైట్లు వెలుగుతుంటే... ఆ సమయంలో పడిన మంచు వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
జమ్ముకాశ్మీర్‌లోని కత్రాలో వైష్ణోదేవి ఆలయం ఉంది. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఈ సీజన్‌లో మంచు బాగా పడుతుంది. నదులన్నీ గడ్డ కట్టేస్తాయి. రోడ్లన్నీ మంచుతో నిండిపోతాయి. కత్రాలో ఈ సీజన్‌లో తొలి మంచు ఇదే. వీడియో చూడండి.
అమ్మవారి భక్తులు, పర్యాటకులు ఎంతో ఆనందపడుతున్నారు. తాము దర్శనానికి వచ్చినప్పుడే మంచు కురవడం మంచి ముహూర్తం అని అంటున్నారు. కరోనా కారణంగా దాదాపు 6 నెలలు మూసేసిన మాతా వైష్ణోదేవి ఆలయాన్ని ఆగస్టులో తెరిచారు. ఇదివరకు రోజుకు 7 వేల మంది భక్తులను అనుమతించేవారు. ఇప్పుడు రోజుకు 15 వేల మందిని మాత్రమే అనుమతినిస్తున్నారు.
ఇది కూడా చదవండి:Cold Moon 2020: అరుదైన పూర్ణ చందమామ... మిస్సవ్వకండి... పూర్తి వివరాలు ఇవీ
మొత్తానికి చీకటి కమ్మేసిన వేళ ఇలా మంచు కురుస్తూ మానసిక ఉల్లాసం కలిగిస్తున్నాయి ఆలయ పరిసరాలు.
Published by:
Krishna Kumar N
First published:
December 28, 2020, 9:47 AM IST