హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Dussehra: బంధుమిత్రులకు విజయదశమి, దసరా శుభాకాంక్షలు ఇలా చెప్పండి.. వాట్సప్ స్టేటస్‌గా ఈ కొటేషన్స్ బెస్ట్

Dussehra: బంధుమిత్రులకు విజయదశమి, దసరా శుభాకాంక్షలు ఇలా చెప్పండి.. వాట్సప్ స్టేటస్‌గా ఈ కొటేషన్స్ బెస్ట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Happy Dussehra 2022: ఈ సంవత్సరం దసరా పండుగ అక్టోబర్ 5న వచ్చింది. ఈ నేపథ్యంలో పండుగ సందర్భంగా బంధుమిత్రులకు ఎలా శుభాకాంక్షలు తెలపాలి, వాట్సప్‌లో ఎలాంటి స్టేటస్‌లు పెట్టుకోవచ్చో తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Delhi, India

భారతదేశంలో నవరాత్రుల శోభ తుది ఘట్టానికి చేరుకుంటోంది. దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకలు ముగిసిన తర్వాత వచ్చే విశేషమైన పర్వదినం ‘దసరా’కు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం దసరా లేదా విజయదశమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు.

చెడుపై మంచి సాధించిన విజయాన్ని ఈ పర్వదినం సూచిస్తుంది. రావణుడిపై శ్రీరాముడు విజయం సాధించిన రోజుగా, మహిషాసురుడనే రాక్షసుడిపై దుర్గాదేవి సాధించిన విజయానికి గుర్తుగా దసరా వేడుకలు నిర్వహించుకుంటారు. ఈ సంవత్సరం దసరా పండుగ అక్టోబర్ 5న వచ్చింది. ఈ నేపథ్యంలో పండుగ సందర్భంగా బంధుమిత్రులకు ఎలా శుభాకాంక్షలు తెలపాలి, వాట్సప్‌లో ఎలాంటి స్టేటస్‌లు పెట్టుకోవచ్చో తెలుసుకుందాం.

* దసరా శుభాకాంక్షలు- వాట్సప్ స్టేటస్

- దసరా సందర్భంగా రాముడు మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, విజయాన్ని నింపాలని ప్రార్థిస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు!

- ఈ దసరా నుంచి మీ అన్ని సమస్యలు తొలగిపోతాయి... దసరా శుభాకాంక్షలు!

- మీలోని రాక్షసుడు ఎల్లప్పుడూ ఓడిపోతాడు, దైవం మీ ఆలోచనలను ఎప్పటికీ నియంత్రిస్తుంది. దసరా శుభాకాంక్షలు!

- చెడుపై మంచి సాధించిన విజయాన్ని ఆస్వాదించండి. గొప్ప విశేషం ఉన్న, ఆహ్లాదకరమైన, ఆనందకరమైన రోజును ఆస్వాదించండి. దసరా శుభాకాంక్షలు!

* దసరా శుభాకాంక్షలు కొటేషన్స్

- దుర్గాదేవి మీ కోరికలన్నీ తీర్చి, మీకు మంచి ఆరోగ్యం, విజయం, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ.. విజయదశమి శుభాకాంక్షలు!

- మీ కష్టాలన్నీ ఈ దసరాతో తీరిపోవాలని ఆశిస్తూ.. విజయ దశమి శుభాకాంక్షలు!

- దసరా సందర్భంగా రావణుడి దిష్టిబొమ్మతో పాటు మీలో ఉన్న అహం, ద్వేషం, కోపాలను కాల్చండి!

- రాముడు మీ విజయానికి మార్గాన్ని చూపే వెలుగును ఇస్తూనే ఉంటాడు. మీరు జీవితంలోని ప్రతి దశలోనూ విజయం సాధిస్తారు. జై శ్రీ రామ్. దసరా శుభాకాంక్షలు.

- ఈ దసరా మీ జీవితంలోని చీకటిని, బాధను దహించి మీకు ఆనందం, శ్రేయస్సును తెస్తుందని ఆశిస్తూ.. విజయదశమి శుభాకాంక్షలు!

- చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ దసరా వేడుకలు జరుపుకుందాం రండి..! ఈ పవిత్రమైన రోజు మీకు ప్రేమ, అదృష్టం, ఆనందాన్ని తెస్తుంది. హ్యాపీ దసరా.

- అంతిమంగా చెడు ఎప్పుడూ అంతమై మంచి అనేదే గెలుస్తుందని గుర్తుచేసే రోజు ఇది. ఈ పరమార్థాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుందాం. దసరా శుభాకాంక్షలు!

- దసరా సందర్భంగా రావణుడి దిష్టిబొమ్మతో పాటు మీలో ఉన్న అహం, ద్వేషం, కోపాన్ని కాల్చండి!

- రాముడు భూమిపై చెడును నాశనం చేసినట్లే, మీరు కూడా మీ మనసు నుంచి అన్ని ప్రతికూల ఆలోచనలను విజయవంతంగా దూరం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. హ్యాపీ దసరా!

- ఈ దసరా సందర్భంగా ధర్మ మార్గాన్ని అనుసరించడానికి శ్రీరాముడు మీకు శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ.. హ్యాపీ విజయదశమి!

Published by:Paresh Inamdar
First published:

Tags: Dussehra 2022, VIRAL NEWS, Whatsapp

ఉత్తమ కథలు