హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Ganesh Chaturthi 2022: వినాయక పూజలో 21 రకాల ఆకులు.. వీటితో ఎలాంటి రోగమైనా పారిపోవాల్సిందే

Ganesh Chaturthi 2022: వినాయక పూజలో 21 రకాల ఆకులు.. వీటితో ఎలాంటి రోగమైనా పారిపోవాల్సిందే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ganesh Chaturthi: . నవరాత్రులు పూజలందుకున్న తర్వా త వినాయకుడి ప్రతిమతో పాటు ఆకులను నదులు, చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల.. ఈ పత్రిలో ఉండే ఔషధ గుణాలను వాటిని శుభ్రం చేస్తాయట.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  నేడు వినాయక చవితి (Ganesh Chaturthi). ఊరూరా గణేష్ చతుర్ధి వేడుకలు  (Vinayaka Chavithi)ఘనంగా జరుగుతున్నాయి. వినాయక పూజలో పత్రిలను, ఫలాలను చూస్తుంటా. మొత్తం 21 రకాల పత్రిలతో గణేశుడిని పూజిస్తారు. ఇవి గణనాథుడికి ఎంతో ఇష్టమైనవి. అంతేకాదు ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. కొత్త మట్టితో చేసిన వినాయక విగ్రహం వద్ద ఈ 21 పత్రిలు ఉంచడం వల్ల.. వాటి మీదుగా వీచే గాలి.. మనలోని అనారోగ్య సమస్యలని తగ్గిస్తుందట. నవరాత్రులు పూజలందుకున్న తర్వా త వినాయకుడి ప్రతిమతో పాటు ఆకులను నదులు, చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల.. ఈ పత్రిలో ఉండే ఔషధ గుణాలను వాటిని శుభ్రం చేస్తాయట. మరి గణేశుడి పూజలో వాడే ఏయే పత్రి వాడతారు. దాని ఉపయోగాలేంటో తెలుసుకుందాం.వినాయకుని పండుగ సమయంలో ఈ గణపతి ఆలయాలను సందర్శిస్తే అదృష్టం
  1. మాచీపత్రం (మాచిపత్రి) : ఇది చేమతి జాతికి చెందిన మొక్క. సువాసన వెదజల్లుతుంది. ఇది దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కళ్లు, చర్మ సంబంధమైన వ్యాధులు నివారణలో అద్భుతంగా పని చేస్తుంది.
  2. బృహతీ పత్రం(వాకుడాకు) : దీనిని ములక అని కూడా పిలుస్తారు. దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర వ్యాధులను, నేత్ర వ్యాధులను నయం చేస్తుంది. వీటితో పళ్లు కూడా తోముకోవచ్చు. దోహదపడుతుంది.
  3. బిల్వ పత్రం( మారేడు) : ఇది చాలా మందికి తెలిసి చెట్టు. బిల్వ పత్రం శివుడికి ఎంత ఇష్టమైనది. విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులను తగ్గితస్తుంది. శరీర దుర్గంధ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.
  4. దూర్వాయుగ్మం(గరిక) : గరక ప్రతి పొలంలో కనిపిస్తుంది. ఈ గడ్డిజాతి మొక్క.. వినాయకుడికి ఎంతో ఇష్టమైనది. గాయాలు, చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు, మొలల నివారణలో దోహదపడుతుంది.
  ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా..? హరిద్ర గణపతిని పూజిస్తే ఎన్నో ప్రయోజనాలు..
  5. దత్తూర పత్రం(ఉమ్మెత్త) : ఉమ్మెత్త.. వంకాయ జాతికి చెందిన మొక్కల. సెగ గడ్డలు, స్తన వాపు, చర్మ వ్యాధులు, పేను కొరుకుడు, శరీర నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు, ఋతు వ్యాధుల నివారణలో బాగా పనిచేస్తుంది. ఇందులో విషం గుణాలు ఎక్కువగా ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి.
  6. బదరీ పత్రం(రేగు) : ఇది అందరికీ తెలిసింది. గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. రేగు పళ్లు కూడా చాలా బాగుంటాయి. ఇది జీర్ణకోశ వ్యాధులు, రక్త సంబంధ వ్యాధులు, చిన్న పిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుతుంది.
  7. ఆపామార్గ పత్రం(ఉత్తరేణి) : ఉత్తరేణి మొక్క కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆకులు గుండ్రంగా ఉంది. గింజలు, ముళ్లు ఉంటాయి. దీనిని దంత ధావనానికి వాడుతారు. పిప్పి పన్ను, చెవి పోటు, రక్తం కారటం, మొలలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యలకు వాడుతారు.
  చంద్రుడు ప్రతిష్టించిన గణేషుడు గురించి విన్నారు.. మనసారా కోరుకుంటే మీ సమస్యలు తీరినట్టే..
  8. తులసి (తులసి): హిందువులుకు ఎంతో పవిత్రంగా చూసుకునే మొక్క ఇది. తులసితో దగ్గు, జలుబు, జ్వరం, చుండ్రు, అతిసారం, చెవిపోటు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ముఖ సౌందర్యంతో పాటు ఒంట్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
  9. చూత పత్రం( మామిడాకు) : హిందువుల శుభ కార్యాలు జరిగినా.. పండగలు వచ్చినా.. ఇది తప్పనిసరిగా ఉండాలి. మామిడి తోరణాలతో ఇళ్లంతా అలంకరిస్తారు. మామిడాకులు రక్త విరోచనాలు, చర్మ వ్యాధులకు పనిచేస్తుంది. మామిడి తోరణాలతో ఇంటిలోనికి క్రిమి కీటకాలు రావు.
  10. కరవీర పత్రం( గన్నేరు) : ఇది గన్నేరు మొక్క. తెలుపు, ఎరుపు, పసుపు రంగు పూలు పూస్తాయి. తేలుతో పాటు ఇతర విష కీటకాల కాటు, దురద, కళ్ళ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఈ ఆకులను ఉపయోగిస్తారు.
  ఈ ప్రత్యేక యోగా గణేష్ పండుగ నాడు.. వినాయకుడి పూజకు ఇదే సరైన సమయం
  11. విష్ణుక్రాంత పత్రం( విష్ణు కాంత) : ఈ మొక్కకు నీలం రంగులో పువ్వులు పూస్తాయి. విష్ణుక్రాంత మొక్కల ఆకులతో జ్వరం, కఫం, దగ్గు, ఉబ్బసం తగ్గితుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
  12. దాడిమీ పత్రం(దానిమ్మ) : దానిమ్మ ఆకులనే దామిడీ పత్రం అంటారు. ఇది విరోచనాలు, అతిసారం, దగ్గు, కామెర్లు, మొలలు, కండ్ల కలకలు, గొంతు నొప్పి, ముక్కు నుండి రక్తం కారడం, చర్మ వ్యాధులు తగ్గించడానికి సహాయపడుతుంది.
  13. దేవదారు పత్రం(దేవదారు) : దేవుళ్లకు ఎంతో ఇష్టమైన చెట్టు ఇది. చాలా ఎత్తుగా పెరుగుతాయి. అజీర్తి, ఉదర సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటి వ్యాధులను తగ్గించడానికి దేవదారు ఆకులు దోహదపడతాయి.
  14. మరువక పత్రం (మరువం) : ఇది కూడా చాలా సుపరిచితమైనదే. పూల దండల్లో కూడా దీనిని వాడుతారు. వాడుక భాషలో ధవనం అని కూడా అంటారు. ఎంతో సువాసన కలిగి ఉంటుంది. ఈ ఆకులతో జీర్ణశక్తి పెరుగుతుంది. జుట్టు రాలడం, చర్మ వ్యాధులు తగ్గించేందుకు దీనిని వాడుతారు.
  వినాయకుడి మంటపాన్ని అలంకరించేందుకు మీకోసం కొన్ని ఐడియాస్
  15. సింధూర పత్రం( వావిలి) :- వాడుక భాషలో వావిలాకు అని పిలుస్తారు. ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తారు. జ్వరం, తలనొప్పి, చెవిపోటు, కీళ్ళ నొప్పులు, మూర్ఛ వ్యాధులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు.
  16. జాజీ పత్రం ( జాజి ఆకు) : ఇది మల్లె జాతి మొక్క. వాడుక భాషలో సన్నజాజులు అంటారు. ఈ మొక్క ఆకులను నోటి పూత, కామెర్లు,వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, చర్మ వ్యాధులను తగ్గించేందుకు ఎక్కువగా వాడుతారు.
  17. గండకీ పత్రం (దేవ కాంచనం) : దీనిని లతా దుర్వా అని కూడా పిలుస్తారు. భూమిపై తీగ మాదిరి పాకుతుంది. దీని ఆకులను ఆహారంగా కూడా స్వీకరిస్తారు. మూర్ఛ వ్యాధి, పొట్ట సంబంధ వ్యాధులు. నులి పురుగుల నివారణకు చక్కగా పనిచేస్తుంది.


  18. శమీ పత్రం (జమ్మి ఆకు) : ఇది కూడా అందరికీ తెలిసినదే. దసరా రోజున జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి.. ఆకులను ఇచ్చిపుచ్చుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. జమ్మి ఆకులను కుష్టు వ్యాధి, అతిసారం, దంత వ్యాధులు, కఫ సమస్యల్లో ఎక్కువగా వినియోగిస్తారు.
  19. అశ్వత్థ పత్రం ( రావి ఆకు) : ఈ చెట్లను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆలయాల వద్ద ఎక్కువగా కనిపిస్తాయి. వీటి ఆకులను మల బద్ధకం, వాంతులు, జ్వరాలు, మూత్ర వ్యాధుల్లో వాడుతారు. వీటిని తీసుకుంటే జీర్ణ శక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
  20. అర్జున పత్రం( తెల్ల మద్ది) : ఈ చెట్టు ఆకులు కూడా మర్రి ఆకుల్లానే కనిపిస్తాయి. వీటిని చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, గుండె జబ్బుల నివారణలో ఉపయోగిస్తారు.
  21. ఆర్క పత్రం( జిల్లేడు) : గ్రామాల్లో జిల్లెడు చెట్లు ఎక్కువగా ఉంటాయి. తెల్ల జిల్లేడును వినాయక పూజలో వాడుతారు. వీటి ఆకులను చర్మ వ్యాధులు, కోరింత దగ్గు, సెగ గడ్డలు, కీళ్ళ నొప్పులు, చెవిపోటు, విరేచనాలు, తిమ్మిర్లు వంటి వాటిని తగ్గించడానికి వినియోగిస్తారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Ganesh Chaturthi​, Ganesh Chaturthi​ 2022, Health, Vinayaka Chavithi 2022

  ఉత్తమ కథలు