హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Lord Ganesha : ఏ పూజ లేదా శుభకార్యమైనా ముందు వినాయకుడినే ఎందుకు పూజిస్తారో తెలుసా

Lord Ganesha : ఏ పూజ లేదా శుభకార్యమైనా ముందు వినాయకుడినే ఎందుకు పూజిస్తారో తెలుసా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Lord Ganesha : వినాయకుడు(Ganapati) హిందూమతంలో ఆరాధించబడే మొదటి దేవుడిగా పరిగణించబడ్డాడు. ఏదైనా పూజ లేదా శుభ కార్యం ప్రారంభించే ముందు గణేశుడిని ముందుగా పూజిస్తారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  Lord Ganesha : వినాయకుడు(Ganapati) హిందూమతంలో ఆరాధించబడే మొదటి దేవుడిగా పరిగణించబడ్డాడు. ఏదైనా పూజ లేదా శుభ కార్యం ప్రారంభించే ముందు గణేశుడిని ముందుగా పూజిస్తారు. వినాయకుడిని పూజించకుండా ఏ శుభకార్యమూ జరగదని నమ్ముతారు. అయితే వినాయకుడిని దేవతలందరిలో మొదటి పూజ్యమైన దేవతగా ఎందుకు భావిస్తారో తెలుసా? గణేశుడిని మొదటి పూజ్య దైవంగా ఆరాధించడం వెనుక అనేక పురాణ కథ తెలుసుకుందాం.


  శివుడు ప్రకటించగానే
  మొదటి పూజ్య దైవం గణేషుడి గురించి రెండు ప్రధాన కథలు ఉన్నాయి. ఒక పురాణం ప్రకారం మొదటిసారిగా పార్వతీ దేవి గణేశుడిని తన గదికి కాపలా ఉండమని ఆదేశించినప్పుడు వినాయకుడు తన తల్లి ఆదేశాలను అనుసరించి, శివుడిని లోపలికి రాకుండా అడ్డుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు వినాయకుడి తలను నరికేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన పార్వతీదేవి విశ్వం మొత్తాన్ని నాశనం చేస్తానని బెదిరించింది. అప్పుడు శివుడు ఏనుగు తలను పెట్టి గణేశుడిని బ్రతికించాడు, కానీ పార్వతి ఏనుగు ముఖం గణేశుడి శరీరంపై ఉంచడంతో సంతోషించలేదు. దీంతో ఏదైనా పూజ లేదా శుభకార్యానికి ముందు గణేశుడిని పూజిస్తారని, గణేశుడి ఆశీర్వాదం లేకుండా ఏ పని పూర్తికాదని శివుడు ప్రకటిస్తాడు.  Ganesh Idol : గణనాథుడిపై జీఎస్టీ ప్రభావం..భారీగా పెరిగిన గణేష్ విగ్రహాల ధరలు!


  తెలివిగా రేసులో గెలిచాడు

  మరొక పురాణం ప్రకారం శివుడు ఒక పోటీని నిర్వహించాడు. విశ్వాన్ని మూడు ప్రదక్షిణలు చేయమని దేవతలందరినీ కోరాడు. మొదటి ప్రదక్షిణను ఎవరు పూర్తి చేస్తారో వారు పూజించబడే మొదటి దేవుడిగా ప్రకటించబడతారు. దీనికి వినాయకుడు, అతని అన్నయ్య కుమారస్వామి సహా ఇతర దేవతలు హాజరయ్యారు. కార్తికేయ భగవానుడు తన వాహనం నెమలిపై ఎక్కి విశ్వ ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో తన తల్లితండ్రులే తన ప్రపంచం అని వినాయకుడు తన తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతాడు. దీంతో రేసులో వినాయకుడు గెలుస్తాడు. ఆ తర్వాత గణేషుడిని ఆరాధించే మొదటి దేవుడిగా ప్రకటిస్తారు.

  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: Lord Ganesh, Vinayaka chavathi

  ఉత్తమ కథలు