హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Vinayaka Chavithi: వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపన ఎలా చేయాలి? ఏ సమయంలో పూజ చేయాలి?

Vinayaka Chavithi: వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపన ఎలా చేయాలి? ఏ సమయంలో పూజ చేయాలి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vinayaka Chavithi 2022: ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 1:38 గంటల మధ్య గణేశుడిని పూజించడానికి  శుభ సమయం.ఈ రోజున ఉదయం 05:58 నుంచి మధ్యాహ్నం 12:12 వరకు రవియోగం ఉంటుంది. ఈ సమయంలో శుభ కార్యాలు చేయడం చాలా మంచిదని భావిస్తారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  నేడు వినాయక చవితి (Vinayaka Chavithi). దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి (Ganesh Chaturthi) ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. అంతటా ఎంతో భక్తి శ్రద్ధలతో పండగను జరుపుకుంటున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం... భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు వినాయకుడి జన్మోత్సవాన్ని జరుపుకుంటారు.  సకల దేవతలు గణాధిపత్యాన్నిపొందిన రోజు కూడా ఇదే అని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది 31 ఆగస్టు 2022 బుధవారం రోజు గణేశ్ చతుర్థి వచ్చింది. చవితి రోజు దేవాలయాలు, ఇళ్లు, కాలనీలోని మంటపాలను ఏర్పాటు చేసి.. గణేశ విగ్రహాలను (Ganesh Idol Installation)  ప్రతిష్టిస్తారు. స్థోమతకు తగినట్లుగా 3,5, 9, 11 రోజుల పాటు గణపతికి పూజాలు చేసి.. ఆ తర్వాత నది లేదా కొలనులో నిమజ్జనం చేస్తారు.


  చంద్రుడు ప్రతిష్టించిన గణేషుడు గురించి విన్నారు.. మనసారా కోరుకుంటే మీ సమస్యలు తీరినట్టే..


  గణేష్ చతుర్థి పూజకు శుభ సమయం (Ganesh Chaturthi Puja)
  గణేష్ చతుర్థి తేదీ ఆగస్టు 30 మంగళవారం మధ్యాహ్నం 3:34 గంటలకు ప్రారంభమవుతుంది. చతుర్థి తిథి ఆగస్టు 31వ తేదీ బుధవారం మధ్యాహ్నం 03.23 గంటలకు ముగుస్తుంది. ఇవాళ ఉదయం 11.05 గంటలకు గణపతి ప్రతిష్ఠాపన శుభ ముహూర్తాలు ప్రారంభమై... సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 01.38 గంటల వరకు కొనసాగుతాయి. ఇవాళ (ఆగస్టు 31) ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 1:38 గంటల మధ్య గణేశుడిని పూజించడానికి  శుభ సమయం.ఈ రోజున ఉదయం 05:58 నుంచి మధ్యాహ్నం 12:12 వరకు రవియోగం ఉంటుంది. ఈ సమయంలో శుభ కార్యాలు చేయడం చాలా మంచిదని భావిస్తారు.  గణేశుడి విగ్రహ ప్రతిష్టాపన విధానం

  ఈ రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఇంటిలోని పూజా మందిరంలో దీపం వెలిగించాలి. అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ముందుగా మీ పూజా మందిరం, మంటపాన్ని గంగా జలంతో శుద్ధి చేయాలి. వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించే పీటపై ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి. దానిపై అక్షింతలు వేయాలి. అనంతరం వినాయకుడిని ప్రతిష్టించాలి. ఆ తర్వాత వినాయకుడి విగ్రహానికి గంగాజలం చల్లాలి. విగ్రహానికి రెండు వైపులా రిద్ధి-సిద్ధిగా తమలపాకులను పెట్టాలి. గణేశుడి విగ్రహానికి కుడి వైపున నీటితో నింపిన కలశాన్ని ఖచ్చితంగా ఉంచాలి. పూజా సమయంలో చేతితో అక్షింతలు, పువ్వులతో గణేశుడికి ప్రార్థించాలి. 'ఓం గణపతయే నమః', 'ఓం శ్రీ విరసిద్ధి వినాయక స్వామియే నమ:' అనే మంత్రాలను జపించాలి. అనంతరం 21 రకాల పత్రిలతో వినాయకుడికి పూజ చేయాలి. గణేశుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు లేదా లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Ganesh Chaturthi​, Ganesh Chaturthi​ 2022, Vinayaka Chavithi 2022

  ఉత్తమ కథలు