Lord Ganesha pooja : గణేషుడి పూజకు కచ్ఛితంగా ఉండాల్సిన పూవు ఏదంటే..!

హిందూ దేవతలను కేవలం వారికి ఇష్టమైన పూలతో మాత్రమే పూజిస్తాం. అందుకే కొన్ని ప్రత్యేకమైన పూలతో ఏ దేవుడిని పూజిస్తే, మంచిదంటే..!

హిందూ దేవతలను కేవలం వారికి ఇష్టమైన పూలతో మాత్రమే పూజిస్తాం. అందుకే కొన్ని ప్రత్యేకమైన పూలతో ఏ దేవుడిని పూజిస్తే, మంచిదంటే..!

  • Share this:
సాధారణంగా ముల్లోకాల్లో ముక్కోటి దేవతులు ఉంటారంటారు. అందులో ముఖ్యమైన దేవతాదేవుళ్లు ఉన్నారు. ప్రతిరోజూ వారిని మనం పూజిస్తూ.. దీపారాధన చేస్తూ వారి కృపకు పాత్రులమవుతున్నాం. అయితే, ఈ దేవుళ్లలో ఒక్కక్కరికీ ఒక్కో రకమైన పూలు, పండ్లతో పూజిస్తాం. ప్రత్యేకంగా శంకరుడు, విష్ణు, లక్ష్మీదేవి, గణేషుడు, సరస్వతి దేవుళ్లకు కొన్ని పూలంటే అమీతమైన ప్రీతి అంటా. అవేంటో తెలుసకుందాం.

ఉమ్మెత్త పూవు– శివుడు
ఇది శివుడికి అత్యంత ప్రీతికరమైన పూవు. శివుడి చాతి భాగంపై కనిపిస్తుంది. పాలసముద్రం మథించినపుడు ఆ భోళా శంకరుడు హళాహలన్ని తాగుతాడు. అప్పటి నుంచి ఉమ్మెత్త ఆయనకు చాలా ఇష్టమట. ఇది గర్వం, శతృత్వం, స్వర్థానికి దూరంగా ఉండటానికి చిహ్నాంగా భావిస్తారు.

ఎర్ర మందారం– కాళికామాత..
ఇది కాళిమాత నాలుకకు చిహ్నాంగా భావిస్తారు. ఈ రంగు మాత అగ్రహాజ్వాలలకు ప్రతీక. ఈ మందార పూవు (Hibiscus) దేవతలందరికీ ప్రీతికరమే. 108 పూలతో అమ్మవారికి మాల చేసి సమర్పిస్తారు.

పారిజాత– విష్ణు..
దేవతలందరూ కలిసి క్షీరసాగరాన్ని మథించినపుడు ఈ పారిజాత పుష్పం కూడా బయల్పడిందని అంటారు. ఇది చాలా అందంగా, అద్భుతమైన సువాసనను వెదజల్లుతుంది. అందుకే దీన్ని విష్ణుమూర్తి స్వర్గానికి తీసుకెళ్లాడని అంటారు. ఈ సువాసన కారణంగా ఆయనకు ఈ పుష్పం అత్యంత ప్రీతికరమైందిగా భావిస్తారు.

తామర పుష్పం– లక్ష్మీ దేవి..
ఈ పుష్పం లక్ష్మీదేవికి పుట్టుకకు ప్రతీకగా అందరికీ తెలిసిన విషయమే. సుఖ సౌభాగ్యాలను అందించే లక్ష్మీదేవి ఈ పూవులో కూర్చుంటుంది. ఈ పూవు లక్ష్మీదేవికి ఇష్టమని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

బంతిపూవు– గణేష..
ఎరుపు రంగులో ఉండే బంతి పూవు (Marigold)  అలాగే కాషాయం రంగులో ఉండే పూవులు గణేషుడికి అత్యంత ప్రీతికరమైనవి. బంతి పూవు.. పాజిటివిటీతోపాటు, శుభాలు కలుగుతాయని భావిస్తారు.

మోదుగ పుష్పం– సరస్వతి..
ఈ పూవు సరస్వతి మాతకు చాలా ఇష్టం. ఈ పూవు జ్ఙానానికి, సృజనాత్మతకు ప్రతీక.

తులసీ ఆకు ..కృష్ణ
కృష్ణుడికి తులసీ చాలా ఇష్టం. కృష్ణుడికి తులసీ ఆకులతో పూజించడం చాలా ముఖ్యం. వాసుదేవుడికి ఇచ్చే ప్రసాదంలో ఈ తులసీని కలుపుతారు.

అఖండ పుష్పం– శివ..
ఈ పూవును క్రౌన్‌ ఫ్లవర్‌ అని కూడా అంటారు. ఇది ఎంతో అందంగా అద్భుతంగా ఉంటుంది. ఈ పూవు ఆకారం శివుడికి చాలా ఇష్టమని అంటారు. ఇది విషపూరితమైందే అయినా శివుడికి దీన్ని సమర్పిస్తారు.

మల్లెపూవు– హనుమంతుడు..
హనుమంతుడికి మల్లెపూవు (Jasmine) చాలా ప్రీతికరమైనవట. ముఖ్యంగా హనుమంతుని పూజించేటపుడు ఐదు మల్లెలను సమర్పించాలట. దీన్ని బొండుమల్లెలు అని కూడా అంటారు.
Published by:Renuka Godugu
First published: