బతుకమ్మ Bathukamma తెలంగాణలో చాలా ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ వర్షాకాలం చివరిలో శీతాకాలం తొలిరోజుల్లో వస్తుంది. ఈ సమయంలో వర్షాలకు చెరువులన్నీ నిండి రంగురంగు పువ్వులు విరబూసి ఉంటాయి. ఇందులో గునుగు పూలు, తంగేడు పూలు ఎక్కువగా పెరుగుతాయి. అంతేకాదు, నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. జొన్న పంట కూడా సిద్ధంగా తల ఊపుతూ ఉంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యమైన రంగురంగుల పూలను కీర్తిస్తూ బతుకమ్మ పండుగను వేడుకగా చేసుకుంటారు. ఈ 9 రోజులు ప్రతి గడపకు పండుగ కళ వస్తుంది. అక్కాచెల్లెలు అంతా ఒక దగ్గరకు చేరుకుని కలిసి, ఆడి, పాడుతారు.
ముఖ్యంగా 9 రోజులపాటు ప్రతిరోజు ఒక రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిదిరోజులు ఎవరైనా నైవేద్యం తయారు చేయవచ్చు. కానీ, సద్దుల రోజు మాత్రం కేవలం మహిళలు మాత్రమే నైవేద్యాన్ని తయారు చేస్తారు.
మహాలయ అమావాస్య లేదా పెతారమాస రోజు అంటే మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మను తయారు చేస్తారు. ఈ రోజు బతుకమ్మకు నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
మూడో రోజు నిర్వహించుకునే ఈ బతుకమ్మకు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యాన్ని సమర్పిస్తారు.
నానపెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి, బతుకమ్మకు సమర్పిస్తారు. ఇది నాలుగో రోజు జరుపుకునే బతుకమ్మ వేడుక.
ఐదవరోజు వచ్చేది అట్ల బతుకమ్మ. ఈ రోజు దోశలు లేదా అట్టు పోసి బతుకమ్మకు నైవేద్యం పెడతారు.
ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి నైవేద్యమేమీ సమర్పించరు.
ఏడో రోజు వేపకాయల బతుకమ్మ జరుపుకుంటారు. బియ్యం పిండిని వేయించి వేప పండ్లుగా తయారు చేస్తారు. దీన్ని బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు.
ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజు జరుపుకుంటారు. ఈ రోజు దుర్గాష్టమి కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఇది చివరిది కాబట్టి ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, నువ్వుల అన్నం, కొబ్బరి అన్నం.
ఈ రోజుల్లో ఆడపడుచులు మెట్టినింటి నుంచి పుట్టింటికి చేరుకుని బతుకమ్మను ఆడతారు. ప్రతిరోజూ సాయంత్రం ఒక వేడుకలా జరుపుకుని ఆ తరువాత దగ్గర్లో ఉన్న చెరువుల్లో లేదా బావుల్లో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bathukamma