FROM 2021 OCTOBER 7 SHARAN NAVARATRI CELEBRATIONS START THROUGHOUT INDIA RNK
Navaratri: 2021 శరన్నవరాత్రులు.. అమ్మవారి 9 అలంకరణలు!
దేశవ్యాప్తంగా మనం అంగరంగ వైభవంగా నిర్వహించుకునే పండగ దసర. ఈ రోజు విజయానికి ప్రతీక. అందుకే విజయ దశమి అంటారు. ముఖ్యంగా ఈరోజు జమ్మి చెట్టు దర్శనం చేస్తాం.
దేశవ్యాప్తంగా మనం అంగరంగ వైభవంగా నిర్వహించుకునే పండగ దసర. ఈ రోజు విజయానికి ప్రతీక. అందుకే విజయ దశమి అంటారు. ముఖ్యంగా ఈరోజు జమ్మి చెట్టు దర్శనం చేస్తాం.
హిందువులకు ప్రధాన పండగ విజయదశమి vijaya dashami . దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. దసరాగా పిలవబడే ఈ పర్వదినాల్లో అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. 9 రోజులు 9 అవతారాల్లో అమ్మవారిని అలంకరిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే.. పదిజన్మల పాపం పోతుందని నమ్మకం.
మొదటిరోజు.. శైలపుత్రి
పాడ్యమిరోజు విశేష పూజలు పెడతారు.
రెండోరోజు.. బాలాత్రిపురసుందరీ దేవి
ఈ రోజు కుమారిపూజ చేస్తారు.
మూడోరోజు.. గాయత్రీదేవి
అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీదేవి.
మంత్రజపంతో చతుర్వేధ పుణ్యం దక్కుతుంది.
నాలుగోరోజు.. లలితాదేవి
ముఖ్యంగా చెరుకుగడను ధరిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సుహాసిని పూజ చేయాలి.
ఐదవ రోజు..సరస్వతి దేవి
మూల నక్షత్రం రోజు నిర్వహిస్తారు. భక్తుల అజ్ఞాన తిమిరాన్ని తొలగిస్తుంది.
ఆరవ రోజు... అన్నపూర్ణ దేవి.
ప్రాణకోటికి జీవనధారం.. సాక్షాత్తూ పరమశివుడికే అన్నదానం చేసిన అమ్మ.
ఏడవ రోజు.. మహాలక్ష్మి
గజరాజు సేవిస్తుండగా అమ్మవారి దర్శనం కలుగుతుంది. లోలాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది. శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే.. సర్వమంగళకర యోగాలు దక్కుతాయి.
ఎనిమిదవ రోజు..దుర్గాదేవి
దుర్గతులను నివారించే పరాశక్తి. మహాస్వరూపాల్లో మొదటిది దుర్గాదేవి. అమ్మను అర్చిస్తే.. శత్రుపీడ పోతుంది. ఎర్రని వస్త్రం, ఎర్రని అక్షితలు అమ్మవారికి సమర్పించాలి.
పదవ రోజు.. రాజరాజేశ్వరీ దేవి
అమ్మవారి చివరి అలంకారం. మహాత్రిపుర సుందరీ దేవి. అపరాజితా దేవి.అనంత శక్తివంతమైన శ్రీ చక్రానికి ఈ అమ్మ అధిష్టాన దేవత. లలిత సహస్త్రనామం ఈ రోజు పటించాలి.
దేవిశరన్నవరాత్రులు అధర్మంపై ధర్మం గెలిచినట్లుగా నిర్వహిస్తాం.
దేవిశరన్నవరాత్రులు అక్టోబర్ 7 ఆశ్వియుజ శుద్ధ నవమి వరకు జరుపుకుంటాం.
ఒకేరోజు అమ్మవారిని రెండు అలంకారాలు చేసేది 11వ తేదీనాడు వస్తోంది. ఆశ్వియుజ శుద్ధ పంచమినాడు పూజిస్తాం. విజయ దశమి 15 వ తేదీన నిర్వహిస్తారు.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.