Home /News /astrology /

Navaratri 2021: నవరాత్రుల్లో ఈ పనులు చేస్తే.. ధనాకర్షణ పెరుగుతుంది!

Navaratri 2021: నవరాత్రుల్లో ఈ పనులు చేస్తే.. ధనాకర్షణ పెరుగుతుంది!

Navaratri puja: నవరాత్రి పూజను చేసుకుంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. జీవితంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని మార్గాల్లో అమ్మ రక్షణ ఉంటూ.. శత్రు పీడ నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే నవరాత్రి పూజ చేసుకోవాలి అంటారు.

ప్రతి సంవత్సరం దసరా  Dussehra వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటాం. అమ్మవారిని ఇంట్లో ఏర్పాటు చేసుకుని రోజుకు ఒక అవతారంలో పూజించి, అమ్మకు ఇష్టమైన నైవేధ్యాన్ని అందించి నచ్చిన రంగు వస్త్రాలతో అలంకరించి దేవి కృపకు పాత్రులమవుదాం.

నవరాత్రుల్లో అమ్మవారి పూజలు చేస్తే.. నెగిటీవ్‌ ఎనర్జీ Negative energy పోవడంతోపాటు ఆ ఇల్లు సుఖఃసంతోషాలతో ఉంటుంది. నవరాత్రి మొదలైంది. 9 రోజులపాటు 9 రూపాల్లో దుర్గా పూజలు చేస్తాం. ఈ రోజుల్లో ఉపవాసం ఉండి అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. నవరాత్రుల్లో నిర్వహించే పూజల వల్ల జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. కొన్ని నియమాలు పాటించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి కొలువుదీరుతుంది. ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి.

ఇది కూడా చదవండి: శరన్నవరాత్రులు.. అమ్మవారి 9 అలంకరణలు!

స్వస్తిక్‌ గుర్తు..
నవరాత్రి సమయంలో కొన్ని ప్రత్యేక పనులు చేయాలి. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తిక్‌ గుర్తు పెట్టాలి. ఇది ఆ ఇంటికి సంతోషాన్ని తీసుకురావడంతోపాటు జీవితంలో అడ్డంకులను దుర్గామాత తొలగిస్తుంది.

నెగిటీవ్‌ ఎనర్జీ..
ఇంటి ప్రధాన ద్వారం గడపకు మామిడి ఆకుల తోరణాలు కట్టాలి. ఇది ఆ ఇంటికి మంచిది. ఇంట్లోని నెగిటీవ్‌ ఎనర్జీని తొలగిస్తుంది. నవరాత్రి సమయంలో ఈ పని తప్పక చేయాలి.

పాదముద్ర..
ఈ సమయంలో ప్రధాన ద్వారంపై అమ్మవారి పాదముద్ర తప్పనిసరిగా వేయాలి. ఇది ఇంటిలోని ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. ఆనందం, శాంతియుతంగా ఉంటుంది. చెడు దృష్టి తొలుగుతుంది.
వాస్తు ప్రకారం ఉత్తర, ఈశాన్య దిశ పూజ చేయడం ఉత్తమం. ఈ దిశలో అమ్మవారి పటం లేదా ఘటాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఇది అదృష్టాన్ని తీసుకువస్తుంది.

ఇది కూడా చదవండి: నవరాత్రుల్లో ఏ రోజు ఏ రంగు వస్త్రం.. ఏ ప్రసాదం అమ్మవారికి ప్రీతికరం..

చేయకూడని పనులు..
ముఖ్యంగా నవరాత్రుల్లో కొన్ని పనులు చేయకూడదు. నలుపు రంగు దుస్తులు ధరించవద్దు. ఈ సమయంలో నలుపు రంగు శుభప్రదంగా పరిగణించరు. అలాగే, తల్లి దుర్గా ఆరాధన, అలంకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పూజగది అలంకరణ లేత రంగుల్లో ఉండాలి. ఇది కాకుండా ఎరుపు రంగు పూవులను కూడా ఉపయోగించవచ్చు.

దేవిశరన్నవరాత్రులు అధర్మంపై ధర్మం గెలిచినట్లుగా నిర్వహిస్తాం. దేవిశరన్నవరాత్రులు అక్టోబర్‌ 7 ఆశ్వియుజ శుద్ధ నవమి వరకు జరుపుకుంటాం. ఒకేరోజు అమ్మవారిని రెండు అలంకారాలు చేసేది 11వ తేదీనాడు వస్తోంది. ఆశ్వియుజ శుద్ధ పంచమినాడు పూజిస్తాం. విజయ దశమి 15 వ తేదీన నిర్వహిస్తారు.
Published by:Renuka Godugu
First published:

Tags: Durga Pooja, Dussehra 2021, Navaratri

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు