Money Astrology: మనీ లేనిది మనిషి జీవితమే లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ (Bank Balance).. జేబులో పర్స్ ఫుల్ గా ఉంటేగాని రోజులు గడిచే పరిస్థితి లేదు.. అన్నింటికీ డబ్బే అవసరం.. అందుకే ప్రతి ఒక్కరూ సంపాదన కోసం విరామం లేకుండా శ్రమిస్తుంటారు.. డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకుని తీవ్ర ఒత్తిడికి గురై.. ఆరోగ్యాన్ని సైతం పాడుచేసుకుంటారు.. చాలామంది శ్రమించి సంపాదిస్తారు కానీ ఆ సంపాదన (Income) మాత్రం మిగలదు.. ఎంత సంపాదించిన.. అంతకు మించి ఖర్చులు పెరుగుతాయి. గ్రహచారం బాగులేకనో.. జాతకంలో సమస్యల వల్లో ఇలా జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఎవరి జాతం ఎలా ఉన్నా.. సూర్యభగవానుడు (Lord sun) ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. సూర్యుడి రాశి మారడాన్నే సంక్రాంతి అంటారు. ఆగస్టు 17న సూర్యుడు తన రాశిని మార్చి సింహరాశిలోకి (Sun Transit in leo 2022) ప్రవేశించాడు. ఆ కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదమైంది. సూర్యుని ఈ మార్పు నెల రోజులపాటు ఈ రాశులకు అపారమైన డబ్బును, కెరీర్ లో పురోగతిని ఇస్తుంది. దాని కోసం ఏం చేయాలి అంటే..?
ప్రస్తుతం సింహరాశిలో సూర్యుని ప్రవేశం నాలుగు రాశుల వారికి చాలా మేలు చేస్తుంది. ఈ సూర్య సంచారం మేష, కర్కాటక, సింహ, మీన రాశుల వారికి అపారమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. అలాగే ఈ రాశుల వారిది ఏ రంగమైనా అందులో ముందుడుగు వేసేందుకు ఇది అనుకూలమైన సమయం.. పెట్టుబడులు పెడితే కచ్చితంగా కలిసి వస్తుంది.. ఇతర రాశులు వారు సైతం ఈ చిన్న రెమిడీస్ చేస్తే.. కచ్చితంగా వారి సంపాదనకు ఎలాంటి లోటు ఉండదు అంటున్నారు.
డబ్బు సంపాదించడానికి మార్గాలు:
ఎవరి జాతకంలోనైనా సూర్యుడు బలంగా ఉంటే, ఆ వ్యక్తి అన్ని విధాలా ముందడుగు వేస్తాడు. ముఖ్యంగా డబ్బులు బాగా సంపాదిస్తాడు. అయితే సూర్యుడిని బలపరస్తే శుభ ఫలితాలను పొందవచ్చు. జీవితంలో త్వరగా విజయం సాధించాలనుకుంటే, ప్రతి ఆదివారం ఉదయం స్నానం చేసి, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. అలాగే ఆవుకి బెల్లం, రోటీ తినిపించండి. ఈ రెమెడీని రోజూ చేస్తే.. మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి.
సూర్యుడు కూడా తండ్రికి కారక గ్రహమే. అందుకే ప్రతిరోజూ మీ తల్లిదండ్రుల పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోండి. దీని కారణంగా సూర్యుడు బలపడి శుభ ఫలితాలను ఇస్తాడు. ఉన్నత హోదా పొందడానికి, ప్రతి ఆదివారం తెల్లవారు జామున స్నానం చేసి.. ఎరుపు రంగు దుస్తులు ధరించి, 'ఓం హ్రాన్ హ్రీం హ్రౌన్స్ సూర్యాయ నమః' అనే మంత్రాన్ని జపించండి. ఈ జపాన్ని కనీసం 3 లేదా 5 సార్లు జపించండి. రోజూ ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. అలాగే ఆదివారాలు ఉప్పు తినకుండా ఉపవాసం ఉండండి. ఇది అనేక వ్యాధులను నయం చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Earn money, Future Prediction, Horoscope