Shivalinga with eyes open: ఆశ్చర్యం.. వింత.. శివలింగానికి తెరచుకున్న కళ్లు?

శివలింగానికి తెరచుకున్న కళ్లు?

Shivalinga with eyes open: 2004లో లాగే మళ్లీ ఇప్పుడూ జరిగింది. ఇది దేనికి సంకేతం? ఆ శివలింగం కళ్లు తెరిస్తే ఏమవుతుంది? స్థానికులు ఏమంటున్నారు?

 • Share this:


  మన చిన్నప్పుడు వినాయక స్వామి పాలు తాగినట్లు చెప్పే ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మన దేశంలో అప్పుడప్పుడూ ఇలాంటివి జరుగుతుంటే, మనం వాటిని చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటన ఒకటి కర్ణాటకలోని బెల్గాం జిల్లాలోని... గోకాకలో జరిగింది. అక్కడి పరమేశ్వరుడి ఆలయంలో... ఓ శివలింగం ఉంది. ఆ శివలింగం తాజాగా కళ్లు తెరవడంతో... ఒక్కసారిగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. అసలేం జరిగిందంటే... రోజూలాగే పూజారి ఉదయాన్నే స్వామికి పూజలు చేసి... అన్నీ ముగించుకొని ఏదో పని ఉంటే బయటకు వెళ్లిపోయారు. అయితే... స్థానికంగా ఉండే మహిళ రాజేశ్వరి భూతీ... స్వామి దర్శనం కోసం ఆలయానికి వెళ్లింది. శివలింగాన్ని దర్శించుకుంటూ జాగ్రత్తగా చూడగా... శివలింగానికి 2 కళ్లు తెరిచి ఉన్నట్లు ఆమెకు కనిపించింది. ఆమె నమ్మలేకపోయింది. మరికాస్త జాగ్రత్తగా చూడగా... నిజంగానే 2 కళ్లు తెరచి తననే చూస్తున్నట్లు కనిపించింది. దాంతో ఆమె షాకైంది. సంభ్రమాశ్చర్యాలు చెందింది. స్వామికి మొక్కుకొని... ఊళ్లోకి వెళ్లి చెప్పింది. అంతే... ఎక్కడి వాళ్లు అక్కడే చేస్తున్న పనులన్నీ ఆపేసి... ఆలయానికి పోటెత్తారు.

  ఈ వార్త గంటలో ఆ ఊరి నుంచి గోకాక నగరం మొత్తం వ్యాపించింది. చుట్టుపక్కల గ్రామాలకూ పాకింది. అంతే... అందరూ ఆలయానికి క్యూ కట్టారు. ఎప్పుడూ లేనంత మంది భక్తులు వచ్చేశారు. రాజకీయ సభలకు వచ్చినట్లుగా బోలెడు మంది ఫ్యామిలీలతో సహా వచ్చేశారు. ఆలయం ముందంతా జనమే. చుట్టుపక్కల అంతా వాహనాల పార్కింగ్. ఎటుచూసినా రద్దీ వాతావరణం. అందరిలోనూ టెన్షన్. తాము చూడగలమో లేదో, తమకు ఛాన్స్ వచ్చేటప్పటికి ఆ కళ్లు తెరిచే ఉంటాయో, మూసుకుపోతాయో అని ఒకటే టెన్షన్.

  lord shiva, shiva lingam, Shivalinga with eyes open, bhakti, telugu news, puja news, parameshwara, శివుడు, ముక్కంటి, శివలింగం, భక్తి, తెలుగు వార్తలు,
  శివలింగానికి తెరచుకున్న కళ్లు?


  ఇది రెండోసారి:
  విషయం తెలిసిన పూజారి... ఏమాత్రం కంగారు పడకుండా తాపీగా ఆలయానికి వచ్చారు. ఎందుకంటే... ఆ శివలింగానికి ఇలా కళ్లు తెరచుకోవడం ఇది రెండోసారట. 2004లో తొలిసారి ఇలా జరిగిందట. అప్పట్లో ఇలా జరిగిన తర్వాత ప్రపంచానికి మేలు జరిగిందనీ... మళ్లీ ఇప్పుడు అదే విధంగా జరిగింది కాబట్టి... మంచే జరుగుతుందని తెలిపారు.  ఇది కూడా చదవండి:Bhakti: శివుడికి ఇష్టమైన పువ్వు ఏదో తెలుసా... దానితో పూజ చేస్తే... వరాల జల్లే...

  ఇదెలా సాధ్యం?
  ఇలా శివలింగానికి కళ్లు తెరచుకున్నాయంటే ఎవరూ నమ్మలేరు. ముఖ్యంగా హేతువాదులు ఖండిస్తారు. శాస్త్రీయబద్ధంగా నిరూపించాలంటారు. కానీ ఇక్కడ అలా ఎందుకు జరుగుతుందో తమకు తెలియదని పూజారీ, స్థానికులూ చెబుతున్నారు. ఈ విషయానికి సంబంధించి శివలింగంపై ఎలాంటి ప్రయోగాలూ చేయకూడదనీ, అలా చేస్తే... అపచారం కలుగుతుందని చెబుతున్నారు. ఐతే... దీన్ని ఖండిస్తున్నవారూ ఉన్నారు. ఇదంతా నాటకమేననీ... ఏ కళ్లూ తెరవకపోయినా... అలాంటి ప్రచారం చేసుకొని... ప్రజలకు భ్రమ కలిగిస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఆ కళ్లు మళ్లీ మూసుకుపోయినట్లు తెలిసింది.
  Published by:Krishna Kumar N
  First published: