హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Rama Navami 2022: తల్లి సీతమ్మ నుంచి అమ్మాయిలు నేర్చుకోవాల్సిన 5 ముఖ్యమైన జీవిత పాఠాలు..

Rama Navami 2022: తల్లి సీతమ్మ నుంచి అమ్మాయిలు నేర్చుకోవాల్సిన 5 ముఖ్యమైన జీవిత పాఠాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Sri ramanavami 2022: రామాయణంలో కాస్త అరుదుగా మాట్లాడే కథానాయిక సీత. రాముడితో సమానంగా, శక్తివంతమైన ధృడసంకల్పం కలిగిన మహిళ.

Sri ramanavami 2022: మనం రామాయణం (Ramayana) గురించి మాట్లాడితే.. రాముడి గురించి హీరోగా కీర్తిస్తాం. కానీ, నిశ్శబ్ద కథానాయిక సీత (Seetha)  గురించి అతి తక్కువగా మాట్లాడతాం. ఆమెది పౌరాణిక పాత్ర అయినప్పటికీ సీతకు ఉన్న అనేక విలువలు నేటి భారతీయ యువతులకు గొప్పి జీవిత పాఠాలుగా నిలిచాయి. ఆమె కథ ఈ ఆధునిక ప్రపంచానికి సంబంధించిన, స్ఫూర్తిదాయకంగా కొనసాగుతుంది.

సీత నుంచి ప్రతి యువతి నేర్చుకోగలిగే 5 జీవిత పాఠాలు..

ప్రశ్నలు అడగడం..

సీతాదేవి తన చిన్ననాటి నుంచి కథలంటే ఆసక్తి చూపేది. తన తండ్రి జనకుడు లేదా తల్లి సునయనను ఎల్లప్పుడూ ప్రశ్నలు అడిగేదట. మీ పిల్లలను కూడా ఇలాగే ఏదైనా ప్రశ్న మనస్సులో వస్తే అడగనివ్వండి. ఒక్కసారి సంకోచిస్తే.. అది ఎప్పటికీ పోదు.

ఇది కూడా చదవండి: Feng shui vastu: ఫెంగ్ షుయ్ ఫర్నిచర్ చిట్కాలు.. దీంతో మీ ఇంట్లో పాజిటివిటీ పక్కా..

ఎప్పడూ భయపడలేదు..

రాముడితో వివాహాం అయ్యాక అందరిలాగే తన భర్తతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కలలు కనేది.కానీ, కైకెయి కారణంగా 14 ఏళ్లు వనవాసానికి భర్తతోపాటు వెళ్లింది. ఆ సమయంలో సీత అయోధ్యలోని రాజభవనంలో నివసించడానికి, సౌకర్యవంతమైన జీవితాన్ని ఎంచుకోవచ్చు. కానీ, కష్ట సమయంలో భర్తతో కలిసి ఉంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అని మనం కూడా నేర్చుకోవచ్చు.

ప్రతికూల సమయం..

రావణుడు తనను అపహరించినప్పుడు కూడా పరిస్థితులకు లొంగకుండా.. రావణుడిని తన చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యం, సంకల్పం ఆమెకు ఉంది. కష్ట సమయంలో తనేంటే నిరూపించుకుంది. నిజంగానే సీతమ్మతల్లి పోరాటయోధురాలు అందుకే ఎంతటి కఠినమైన సందర్భాల్లో కూడా తన ప్రశాంతతను కాపాడుకుంది. నేటి కాలం ఆడపిల్లలకు ఇది ఆదర్శప్రాయం.

ఇది కూడా చదవండి: Ram Navami 2022: దేశంలోని 5 ప్రసిద్ధ రాముడి దేవాలయాలు.. ఒక్కసారైనా సందర్శించాల్సిందే..

ఒంటరి..

రాజ్యజనపదుల మాటల వల్ల రాముడు సీతమ్మను అయోధ్య నుంచి బహిష్కరించినప్పుడు వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. అక్కడే కవలలైన లవ,కుశలను కని, ఒంటిరిగానే పెంచింది. భారతీయ పురాణాల్లో ఒంటిరి తల్లల్లో మొదటిది సీతమ్మతల్లి.

పరువు..

అగ్ని పరీక్షలో నెగ్గి, అయోధ్యకు తిరిగిరావడానికి అవకాశం వచ్చినా... సీత తన పరువు కోసం పోరాడింది. తన భర్తతో వెళ్లకుండా భూతల్లి మింగేయడమే మంచిదని భావించింది. ఒక శక్తివంతమైన మహిళలకు ఇదే సరైందని భావించింది. ఇది అమ్మాయిలందరూ గ్రహించాల్సిన ఒక పాఠం.

(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)

Published by:Renuka Godugu
First published:

Tags: Sri Rama Navami 2022

ఉత్తమ కథలు