Home /News /astrology /

Dusserha 2021: దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూస్తారు? చూస్తే ఏమవుతుంది?

Dusserha 2021: దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూస్తారు? చూస్తే ఏమవుతుంది?

Dusserha 2021: పాలపిట్టను చాలా మంది శివుడి ప్రతిరూపంగా భావిస్తున్నారు. అందుకే విజయదశమి రోజు ఈ పక్షిని చూస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు.  ఏపీ, తెలంగాణతో పాటు ఉత్తర భారత దేశంలోని చాలా రాష్ట్రాల ప్రజలు విజయదశమి రోజు పాలపిట్టను చూడడం అదృష్టంగా భావిస్తారు.

ఇంకా చదవండి ...
    దేశవ్యాప్తంగా దసరా వేడుకలు (Dussehra) ఘనంగా జరుగుతున్నాయి.  అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దసరా హిందువులకు ప్రత్యేకమైన పండగ. ఇదే అతి పెద్ద పండగగా భావిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఏటా దసరా జరుపుకుంటారు. ఐతే విజయ దశమి (Vijayadashami) రోజున అమ్మ వారికి దర్శనం, శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను కూడా చూడడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కాలం  యువతకు పాలపిట్ట (Indian roller) గురించి పెద్దగా తెలియదు. దసరా పండతో ఆ పక్షికి ఉన్న అనుబంధం గురించి అవగాహన లేదు.  దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూస్తారు..? చూస్తే ఏమవుతుంనే ప్రశ్నలు ప్రతి దసరా రోజు వినిపిస్తాయి. వాటికి సమాధానం ఇక్కడ తెలుసుకుందాం.

    దసరాకు, పాలపిట్టకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. విజయదశమి రోజున  పాలపిట్టను చూడటం ఆనవాయితీగా వస్తుంది.  పట్టణాల్లో వీడి జాడే కనిపించదు గానీ.. పచ్చని పల్లెటూర్లలో పాలపిట్టలు ఎక్కువగా కనిపిస్తాయి. విజయ దశమి రోజు గ్రామీణ ప్రాంతాల్లోని వారు పాలపిట్టను దర్శించుకుంటారు.  దీనికి పురాణాల్లో అనేక కథ ప్రాచుర్యంలో ఉన్నాయి. త్రేతాయుగంలో రావణాసురుడిని సంహరించేందుకు వెళ్లిన శ్రీరాముడికి (Lord SriRam) విజయదశమి రోజు పాలపిట్ట ఎదురవుతుంది.  ఆ త‌ర్వాత జ‌రిగిన యుద్ధంలో రాముడు విజ‌యం సాధిస్తాడు. దీంతో శ్రీరాముడు తనకు పాలపిట్టను కనిపించడం శుభశకునంగా భావించాడని అంటుంటారు.

    Dussehra: అందరికీ దసరా శుభాకాంక్షలు.. ఇవాళ ఈ పనులు అస్సలు చేయకండి.. చేస్తే దరిద్రమే..

    ఇక మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో వారికి పాలపిట్ట కనిపించిందట. ఆ తర్వాత వారు ఏం చేసినా విజయాల వరించాయట. అజ్ఞాత వాసానికి ముందు పాండ‌వులు జ‌మ్మి చెట్టుపై దాచిన ఆయుధాల‌ను ఇంద్రుడు పాల‌పిట్ట రూపంలో కాపాలా కాశాడని పురాణాలు చెబుతున్నాయి.

    Dussehra 2021: దసరా ముహూర్తం.. ఈరోజు ఇది తప్పకుండా చేయండి!

    పాలపిట్టను చాలా మంది శివుడి ప్రతిరూపంగా భావిస్తున్నారు. అందుకే విజయదశమి రోజు ఈ పక్షిని చూస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు.  ఏపీ, తెలంగాణతో పాటు ఉత్తర భారత దేశంలోని చాలా రాష్ట్రాల ప్రజలు విజయదశమి రోజు పాలపిట్టను చూడడం అదృష్టంగా భావిస్తారు. అందుకే సాయంత్రం జమ్మిచెట్టు వద్ద శమీ పూజ తర్వాత ఊరి ప్రజలంతా పంట పొలాల్లోకి వెళ్తుంటారు. అక్కడ పాలపిట్టను చూసిన తర్వాత తిరిగి ఇళ్లు చేరుకుంటారు. దసరా రోజు పాలపిట్ట వారి కంటికి కనిపిస్తే ... రానున్న రోజుల్లో తమకు తిరుగేలేదని, ఏం పని చేసినా అందులో విజయం కలుగుతుందని విశ్వసిస్తారు.

    Vastu Tips: దుర్గమ్మ పూజకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పూలు వాడకండి..!

    పాలపిట్ట‌కు ఇంతటి ప్రాశస్త్యం ఉన్నందునే చాలా రాష్ట్రాలు దీనిని రాష్ట్రపక్షిగా గుర్తించాయి. తెలంగాణ, ఏపీతో పాటు క‌ర్ణాట‌క‌, ఒడిశా, బిహార్ రాష్ట్రాలకు కూడా పాలపిట్టనే అధికారిక రాష్ట్ర పక్షి.  పాలపిట్ట నీలం, పసుపు రంగుల కలబోతగా ఉంటుంది. ఐతే పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ  పాలపిట్టలు అంతరించిపోయే పక్షుల జాతిలో ఉన్నాయి. ఐనప్పటికీ పచ్చని పల్లెలు, అడవుల్లో అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ పక్షులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. పచ్చటి చేలలో తిరుగుతూ  బ్లూ కలర్‌లో మెరుస్తూ ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Dussehra, Dussehra 2021, Life Style, Vijayadashami 2021, Vijya dashami

    తదుపరి వార్తలు