నవరాత్రుల్లో Navaratri నవదుర్గలను 9 అవతారాల్లో 9 రోజులపాటు పూజలు చేస్తారు. అయితే, నవరాత్రుల్లో మూడవ రోజు అలంకారం గాయత్రీ దేవి Gayithri devi రూపం. కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెడతారు. దీంతో పాటు కొబ్బెర బెల్లం కలిపి కూడా పెట్టవచ్చు. మూడవ రోజు తిథి ఆశ్వయుజ శుద్ధ తదియ అక్టోబర్ 8 శుక్రవారం మధ్యాహ్నం 01.31 నుంచి 9 శనివారం ఉదయం 11.18 నిమిషాల వరకు ఉంటుంది. ఆ రోజు గాయత్రీదేవి అలంకరణ పూజా సమయం శనివారం ఉదయం 7.30 నుంచి 9.00 గంటల వరకు పూజ చేసుకోవచ్చు. సాయంత్రం పూజా సమయం 5.10 నుంచి 7.25 వరకు చేసుకోవచ్చు. ఈ సమయంలో తాంబూలం, కుమారి పూజలు చేసుకోవచ్చు. పటించాల్సిన మంత్రం..
ఓం గాయత్రీ మాత్రే నమః
అంతేకాకుండా గాయత్రీ చాలిసా కూడా చదువుకోవచ్చు.
చీర రంగు..కాషాయం రంగులో అమ్మవారిని అలంకరించాలి. గాయత్రీ దేవిని ముఖ్యంగా తామరపూలను సమర్పిస్తే.. చాలా మంచిది. ఈరోజు నిషిద్ధమైంది వంకాయ. ఈరోజు వంకాయ కలిపిన ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఇలా అమ్మవారికి ఇష్టమైన విధంగా కొలిస్తే, కోర్కెలు తీరుస్తుంది.
ఈరోజు ఎర్రటి గాజులను దానంగా ఇవ్వాలి. అలా చేస్తే.. తేజస్సు పెరుగుతుంది. అమ్మవారి అష్టోత్తరాన్ని చదివినా మంచి ఫలితం ఉంటుంది. గాయత్రీ మాత అంటే సూర్య భగవాణుడి శక్తి. సకాల దోషాలు పోయి సుఖసంతోషాలతో అంటారు. నిమ్మకాయ అన్నం కూడా ఈ అమ్మకు చాలా ఇష్టం.
ఈ అమ్మను చంద్రఘంటా దేవి అని కూడా అంటారు.
ఓం హ్రీం శ్రీ చంద్రఘంట దుర్గాయే నమః అని కూడా 108 సార్లు పటించాలి. గాయత్రీ మంత్రం ఎంతో శక్తిమంతమైంది. ప్రతిరోజూ గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల మనలో సత్వ గుణాలను ప్రసాదిస్తుంది. అమ్మవారు పంచభూతాల నుంచి వచ్చే కష్టాల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఈ పూజకు పూజ చేసే మహిళలు కూడా అదేవిధంగా పసుపు లేదా నారింజ రంగు వస్త్రాలను ధరించాలి.
దేవిశరన్నవరాత్రులు అధర్మంపై ధర్మం గెలిచినట్లుగా నిర్వహిస్తాం.
దేవిశరన్నవరాత్రులు అక్టోబర్ 7 ఆశ్వియుజ శుద్ధ నవమి వరకు జరుపుకుంటాం.
ఒకేరోజు అమ్మవారిని రెండు అలంకారాలు చేసేది 11వ తేదీనాడు వస్తోంది. ఆశ్వియుజ శుద్ధ పంచమినాడు పూజిస్తాం. విజయ దశమి 15 వ తేదీన నిర్వహిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Durga Pooja, Dussehra 2021, Navaratri