హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Navaratri 2021: నవరాత్రి.. అమ్మవారి 6వ అలంకరణ, ప్రసాదం, రంగు వస్త్రం!

Navaratri 2021: నవరాత్రి.. అమ్మవారి 6వ అలంకరణ, ప్రసాదం, రంగు వస్త్రం!

అమ్మవారికి ప్రీతికరమైన పుష్పాలు తెల్లని చామంతి, తెల్ల మందారం, తెల్ల గులాబీ.

అమ్మవారికి ప్రీతికరమైన పుష్పాలు తెల్లని చామంతి, తెల్ల మందారం, తెల్ల గులాబీ.

Navaratri 6th day puja: ఈరోజు సరస్వతి మాతను మారేడు దళలతో పూజించడం మంచిది. ముఖ్యంగా పుల్లగా ఉన్న పదార్థాలను తీసుకోకూడదు.

దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించుకునే హిందువుల పండుగ దసరా Dussehra .  ఈరోజుల్లో 9అవతారాల్లో 9రోజులపాటు దుర్గామాతను Durgamata పూజిస్తారు. ఈ రోజుల్లో ముఖ్యంగా అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. నవరాత్రుల్లో, నవదుర్గలు మనకు ఆశీర్వదిస్తారు.ఇక ఆరవరోజు అమ్మవారి అవతారం సరస్వతి మాత. ఇది అమ్మవారి ఏడో అలంకరణ. అమ్మ అలంకరణ మూల నక్షత్రం ఏరోజు వస్తే ఆరోజు నిర్వహించుకుంటారు. తిథి ఆశ్వీయుధ సప్తమి. ఈరోజు అమ్మవారికి తెలుపు రంగు చీరను కట్టిస్తారు. నైవేద్యం పరమాన్నం.

ఈ రోజు పటించాల్సిన మంత్రం..

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా.

ఇది కూడా చదవండి: దుర్గామాత ఆయుధాలు ధరించడం వెనుక రహస్యం?


ఈ మంత్రాన్ని 108 సార్లు పటించాలి. సరస్వతి అమ్మవారికి ప్రీతికరమైన పుష్పాలు తెల్లని చామంతి, తెల్ల మందారం, తెల్ల గులాబీ. ముఖ్యంగా ఈరోజు పుస్తకాలు, పెన్నులు, స్లేట్‌ పెన్సీల్స్‌ దానం చేస్తే.. విద్యాప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా మీ ఇంట్లో చదువునే పిల్లలు ఉంటే.. పంతుల్లతో విద్యాప్రాప్తి కోసం పూజలు చేయించండి.

అక్టోబర్‌ 12న సరస్వతీ అలంకరణ మంగళవారం వచ్చింది. ఇది తెల్లవారుజామున 4.09 నుంచి ప్రారంభమవుతుంది. రాత్రి 1.51 వరకు ఉంటుంది.

పూజా సమయం.. ఉదయం 10.31 నుంచి 11.49 వరకు.

ఇది కూడా చదవండి: నవరాత్రి 5వ రోజు అమ్మవారి అలంకరణ.. నైవేద్యం!


ఈరోజు ముఖ్యంగా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే.. చాలా మంచిది. ఇక సాయంత్రం పూజ సమయం 5.16 నుంచి 6.38 వరకు ఉంటుంది. అమ్మకు ఈరోజు పెరుగన్నం, ధద్యోజనం, పాలు, రవ్వకేసరి పెట్టినా మంచిదే. ఈ నైవేద్యాలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఆర్థికస్తోమతను బట్టి పూజించుకోవచ్చు. ఈరోజు సరస్వతి మాతను మారేడు దళలతో పూజించడం మంచిది. ముఖ్యంగా పుల్లగా ఉన్న పదార్థాలను తీసుకోకూడదు. ఇక పిల్లలు పటించాల్సిన మంత్రం..

ఓం ఐం సరస్వతీయే నమః అని పటించాలి. మీ పిల్లలకు మంచి బుద్ధి, చదువు రావాలంటే తప్పకుండా ఈరోజు సరస్వతీ పూజ చేయించాలి.

దేవిశరన్నవరాత్రులు అధర్మంపై ధర్మం గెలిచినట్లుగా నిర్వహిస్తాం.

దేవిశరన్నవరాత్రులు అక్టోబర్‌ 7 నుంచి ఆశ్వియుజ శుద్ధ నవమి వరకు జరుపుకుంటాం.

ఒకేరోజు అమ్మవారిని రెండు అలంకారాలు చేసేది 11వ తేదీనాడు వస్తోంది. ఆశ్వియుజ శుద్ధ పంచమినాడు పూజిస్తాం. విజయ దశమి 15 వ తేదీన నిర్వహిస్తారు.

Published by:Renuka Godugu
First published:

Tags: Durga Pooja, Dussehra 2021, Navaratri

ఉత్తమ కథలు