హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Navaratri 2021: నవరాత్రి పూజలో నాలుగవ రోజు అమ్మవారి అలంకరణ!

Navaratri 2021: నవరాత్రి పూజలో నాలుగవ రోజు అమ్మవారి అలంకరణ!

ఈ తల్లికి నిత్యం కుంకుమతో అర్చించడం వల్ల శుభ ఫలితాలు దక్కుతాయి.

ఈ తల్లికి నిత్యం కుంకుమతో అర్చించడం వల్ల శుభ ఫలితాలు దక్కుతాయి.

Dussehra: విజయదశమి దేశవ్యాప్తంగా అందరు హిందువులు అంగరంగ వైభవంగా నిర్వహించుకునే పండుగ. ఈ రోజుల్లో ముఖ్యంగా అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. నవరాత్రుల్లో, నవదుర్గలు మనకు ఆశీర్వదిస్తారు.

విజయదశమి Dussehra దేశవ్యాప్తంగా అందరు హిందువులు అంగరంగ వైభవంగా నిర్వహించుకునే పండుగ. ఈ రోజుల్లో ముఖ్యంగా అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. నవరాత్రుల్లో, నవదుర్గలు మనకు ఆశీర్వదిస్తారు


Navaratri నవరాత్రుల్లో నాలుగవ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలో తెలుసుకుందాం. వచ్చే పౌర్ణమి గౌరి పౌర్ణమి. ఆరోజు లక్ష్మీజయంతి కూడా. దేవినవరాత్రుల్లో నాలుగవ రోజు ఆశ్వియుజ శుద్ధ చతుర్ధి, ఆదివారం. ఈరోజు అమ్మవారిని లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలో దర్శనమిస్తుంది. ఈ దేవికి ఎరుపు రంగు చీరను సమర్పిస్తారు. ఇక లలితా త్రిపుర సుందరీదేవికి ఇవ్వాల్సిన నైవేద్యం దద్యోజనం, క్షీరాన్నం.

ఇది కూడా చదవండి: నవరాత్రి మూడవరోజు పూజ.. నైవేద్యం, అలంకారం..ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం అక్టోబర్‌ 10. పూజా సమయం ఉదయం 6.05 నుంచి 7.00 వరకు. ఆ సమయంలో కుదరని వారు ఉదయం 9.55 నుంచి 11.35 వరకు చేసుకోవచ్చు. సాయంత్రం పూజా సమయం 6.00 నుంచి 8.10 వరకు. అమ్మవారికి అర్పించిన పుష్పాలు సన్నజాజి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల సౌభాగ్యం, ఐశ్వర్యం వరిస్తుందని నమ్ముతారు.

ఈ తల్లికి నిత్యం కుంకుమతో అర్చించడం వల్ల శుభ ఫలితాలు దక్కుతాయి. సువాసినులకు మాంగళ్య సౌభాగ్యాన్ని అందిస్తుంది. శ్రీచక్ర ఆరాధన, లలితా సహస్త్ర నామాలను ఈరోజు పాటిస్తే.. ఈ తల్లికి మిక్కిలి ప్రీతి. కాబట్టి పెళ్లైన స్త్రీలు అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.

ఇది కూడా చదవండి: నవరాత్రి రెండోరోజు అమ్మవారి అలంకారం..పూజావిధి!


మంత్రం..ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. లేకపోతే 11 సార్లు జపించాలి. అలాగే ఈరోజు అమ్మవారిని కుష్మాండ దుర్గా రూపంలో పూజిస్తారు.

మంత్రం..

సురాసంపూర్ణ కలశం

రూధిరాపుత్రమేవచ

దధనా హస్త పద్మాభ్యాం

కూష్మాండా శుభదాస్తుమ్‌

దేవిశరన్నవరాత్రులు అధర్మంపై ధర్మం గెలిచినట్లుగా నిర్వహిస్తాం.

దేవిశరన్నవరాత్రులు అక్టోబర్‌ 7 నుంచి ఆశ్వియుజ శుద్ధ నవమి వరకు జరుపుకుంటాం.

ఒకేరోజు అమ్మవారిని రెండు అలంకారాలు చేసేది 11వ తేదీనాడు వస్తోంది. ఆశ్వియుజ శుద్ధ పంచమినాడు పూజిస్తాం. విజయ దశమి 15 వ తేదీన నిర్వహిస్తారు.

Published by:Renuka Godugu
First published:

Tags: Durga Pooja, Dussehra 2021, Navaratri

ఉత్తమ కథలు