ఈరోజు అమ్మవారిని రెండు అలంకరణలు చేస్తారు. ఉదయం అన్నపూర్ణదేవి సాయంత్రం మహాలక్ష్మి దేవి Mahalaxi devi అలంకరణ చేస్తారు. నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలో.. ఏ నైవేద్యం, రంగుచీర సమర్పించాలో తెలుసుకుందాం.
శరన్నవరాత్రుల్లో Navaratri 5వ రోజు శ్రీ అన్నపూర్ణ దేవిగా అలంకరిస్తారు. అన్నపూర్ణదేవి అంటే సకల జీవులకు అన్నాన్ని అందించే అమ్మ అని అర్థం. ఈ తల్లి ఎడమ చేతిలో బంగారపు అమృతాన్నాన్ని వజ్రాలు పొదిగిన గరిటెతో తన భర్త అయిన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన మహాతల్లి. ఈరోజు అమ్మవారికి పటించాల్సిన మంత్రం...
ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీనీల సమానుకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
కనీసం మూడుసార్లైన చదువుకోవాలి.
పూజ సమయం.. ఉదయం 6.22 నుంచి 7.29 వరకు
తిరిగి సాయంత్రం 9.44 నుంచి 11.14 వరకు.
ఈ అన్నపూర్ణదేవికి ఈ రోజు నైవేద్యంగా పెరుగన్నం పెట్టాలి. దధ్యోజనం, కట్టెపొంగలి, అల్లంగారెలు కూడా పెట్టవచ్చు. మధ్యాహ్నం పంచభక్ష భోజనాలు పెట్టాలట. అంటే మనం ఏది వండుకున్నా పెట్టాలి. అదేవిధంగా ఈరోజు ఎవరికైనా అన్నదానం చేయాలి. ఇలా చేస్తే అమ్మవారు మరింత సంతోషిస్తుంది. ముఖ్యంగా ఈరోజు అన్నపూర్ణ అష్టకాన్ని తప్పకుండా చదువుకోవాలి.
ఈరోజు అమ్మవారికి లేత గంధం రంగు చీరను కట్టి అలంకరించాలి. మీ వద్ద కూడా ఈ రంగు చీర ఉంటే కట్టుకోండి. తెలుపు లేదా ఎరుపు రంగుపూలతో పూజించాలి.
ఈ మంత్రాన్ని కూడా మూడు లేదా 5 సార్లు పటించాలి.
సురాసంపూర్ణ కలశం
రుధిరాపుత్రమేవచ
దధనా హస్త పద్మాభ్యం
కూష్మాండా శుభదాస్తుమ్.
ఈ మంత్రం పటిస్తే.. ఆయుస్సును ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
మహాలక్ష్మి దేవి..
ఈమెను ఎవరైతే పూజిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు అందిస్తుందని నమ్ముతారు. ఈరోజు పటించాల్సిన మంత్రం...
ఓం శ్రీం హ్రీం క్లీం
మహాలక్ష్మీ స్వాహా అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
ఆ తర్వాత లక్ష్మీదేవి స్లోకాలు, అష్టోత్తరాలు చదువుకోవాలి.
లక్ష్మీదేవికి అందించాల్సిన నైవేద్యం.. బెల్లంతో తయారు చేసిన పరమాన్నాన్ని సమర్పించాలి. ఈరోజు అమ్మవారికి డార్క్ పింక్ లేదా ఎరుపు రంగు చీరను సమర్పించాలి. శ్రీ మహాలక్ష్మి దేవికి ఎరుపు లేదా తెలుపు రంగు పూవులతో పూజించాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రీసూక్తాన్ని పటించాలి. అలాగే లక్ష్మీ అష్టోత్తరంలోని 108 నామాలను జపించాలి.
పూజా సమయం..
ఆశ్వీయుజశుద్ధ షష్టి అక్టోబర్ 11 సోమవారం సాయంత్రం 4.53 నుంచి 7.38 వరకు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Durga Pooja, Dussehra 2021, Navaratri