హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Navaratri 2021: దుర్గాష్టమి విశిష్టత.. కన్యాపూజ సమయం!

Navaratri 2021: దుర్గాష్టమి విశిష్టత.. కన్యాపూజ సమయం!

Durga ashtami: ఈరోజు దుర్గ అష్టోత్తరాన్ని తప్పకుండా పారాయణం చేయాలి.

Durga ashtami: ఈరోజు దుర్గ అష్టోత్తరాన్ని తప్పకుండా పారాయణం చేయాలి.

Navaratri durgashtami: మహాష్టమి రోజు మహాస్నానం తర్వాత తొమ్మిది కుండలను ఏర్పాటు చేసి 9 శక్తులను ఆవాహన చేస్తారు. ఈ మహా అష్టమి పూజ సమయంలో దుర్గామాత తొమ్మిది రూపాలను పూజిస్తారు.

నవరాత్రుల్లో దుర్గాష్టమి Durgashtami అష్టమి రోజు వస్తుంది. నవరాత్రుల్లో చివరి మూడు రోజులు అత్యంత శక్తిమంతమైనవి. ఇక దుర్గాష్టమి మహాస్నానంతో మొదలవుతుంది. ఎందుకంటే పవిత్రమైన వేడుకలకు ముందు శరీరాన్ని, అపవిత్రమైన ఆలోచనలను తొలగించడానికి ఇలా చేస్తారు. దుర్గాష్టమి మన దేశంలో అత్యంత ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. అష్టమి అంటే ఎనిమిది. నవరాత్రుల్లో మహాగౌరీ అంకితమిచ్చిన రోజు. ఇది దుర్గామాత  Durga mata ఎనిమిదవ అవతారం. 2021 అక్టోబర్‌ 13న దుర్గాష్టమి వస్తుంది. బెంగాల్‌లో షష్ఠి నుంచి మొదలు పెడతారు. మొత్తం ఆరురోజులపాటు వేడుకలు నిర్వహిస్తారు. దుర్గాష్టమిని మహాష్టమి అని కూడా అంటారు. ఈరోజు మహాశక్తి చాముండి అవతారాన్ని పూజిస్తారు. చాముండి ఈరోజు మహిషాసురుడి రాక్షస సహచరులైన చండా, ముండా, రక్తబీజాలను అంతం చేస్తుందని నమ్ముతారు.

ఈ రోజున చిన్నారులకు కుమారి పూజలో భాగంగా దేవత రూపంలో తయారు చేసి వారికి పూజలు చేస్తాం. దృక్‌ పంచాంగం ప్రకారం అష్టమి చివరి 24 నిమిషాలు అష్టమి తిథి, మొదటి 24 నిమిషాలు నవమి తిథి అంటారు. దీన్నే సంధి అని కూడా అంటారు. ఈ టైంలో పూజ చేస్తే విశేష లాభాలు ఉంటాయి.పూర్వకాలంలో ఈరోజు జంతు బలి కూడా ఉండేది. దీన్ని నిషేధించిన తర్వాత గుమ్మడికాయను కోస్తారు. అరటిపండ్లు కుకుంబర్‌ను కూడా పూజలో వాడతారు.

అలాగే హారతి సమయంలో 108 మట్టీ దీపాలను వెలిగించి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు. ఇది ఆచారంగా ఉంది.

ఇది కూడా చదవండి: దుర్గామాత ఆయుధాలు ధరించడం వెనుక రహస్యం?


కన్యాపూజ 2021.. అక్టోబర్‌ 13

కన్యాపూజ అష్టమి, తిథి.. అక్టోబర్‌ 12 రాత్రి 9.47 నుంచి 13 రాత్రి రాత్రి 8.07 వరకు.

శుభ ముహూర్తం.. అభిజిత్‌ ముహూర్తం, విజయ ముహూర్తం మ«ధ్యాహ్నం 2.03 నుంచి 2.49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు. ఈ సమయంలో పూజ చేయకూడదు.

దుర్గాష్టమి..

ఒకానొక సమయంలో దుర్గం అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు విశ్వం పూర్తిగా విధ్వంసం సృష్టించేవాడు. దేవతలు అతడిని ఓడించలేకపోయేవారు. అతడి దారుణాలు భరించలేక కైలాసానికి శివుడి సహాయం కోసం వెళ్లారు. కానీ, దుర్గానికి మనుషుల చేతిలో మరణం లేని వరం పొందాడు. బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులు తమ బలాలతో శక్తిని సృష్టిస్తారు. దీంతో ఆమె వెంటనే అవతరించి.. శాంతిని నెలకొల్పడానికి ఆమె ఆ రాక్షసుడిని సంహరించింది. అందుకే ఆమె దుర్గాగా అవతరించింది. ఈరోజు కొబ్బరికాయకు కూడా పూజ చేస్తారు.

ఇది కూడా చదవండి: నవరాత్రి.. అమ్మవారి 6వ అలంకరణ, ప్రసాదం, రంగు వస్త్రం!


అమ్మవారి నైవేద్యం.. కధంబం, బెల్లం.

అష్టమిరోజు అమ్మవారికి బెల్లాన్ని సమర్పిస్తే.. మన శోకాలు పోతాయట. దుర్గామాతకు ఎర్రటి వస్త్రం లేదా చీరను సమర్పించాలి. ఎరుపు రంగు పూలతోనే అమ్మవారికి పూజ చేయాలి. ఎరుపు అక్షింతలను అమ్మవారికి సమర్పించాలి. ఈరోజు దుర్గ అష్టోత్తరాన్ని తప్పకుండా పారాయణం చేయాలి. ఈరోజు అమ్మవారు కాళరాత్రి రూపంలో దర్శిస్తారు.

మంత్రం..

ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా

లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ

వామ పాదోల్లి సల్లో హలితా కంటకా భూషణా

వరవమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్బయంకరీ.

దీన్ని 3,7,9,12 లేదా 108 సార్లు పటించాలి.

Published by:Renuka Godugu
First published:

Tags: Durga Pooja, Dussehra 2021, Navaratri

ఉత్తమ కథలు