Lord ganesh festival: పండగవేళల్లో.. ఈ ఫుడ్‌ అస్సలు తినకండి! లేకపోతే అనారోగ్యం..

గణేష్‌ ఉత్సవాల్లో భాగంగా తీసుకునే కొన్ని ఆహార పదార్థాలపై నియమాలు పాటించాలనిæవైద్యులు సూచిస్తున్నారు. లేకపోతే వీటితో అనారోగ్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

గణేష్‌ ఉత్సవాల్లో భాగంగా తీసుకునే కొన్ని ఆహార పదార్థాలపై నియమాలు పాటించాలనిæవైద్యులు సూచిస్తున్నారు. లేకపోతే వీటితో అనారోగ్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

  • Share this:
సాధారణంగా పండుగలు అంటేనే ప్రత్యేకమైన ఆహార పదార్థాలు వండుకుంనే సమయం. భారతీయ సంస్కృతిలో ఆరోగ్యకరమైన ఆహారం, ఆ రోజుల్లో ఏ నిబంధనలు లేకుండా తినేస్తాం. ప్రస్తుతం గణేష్‌ ఉత్సవ సమయం. ప్రతిరోజు ఏదో ఒక స్వీట్‌ అన్న తయారు చేసుకుంటారు. కానీ, దానికి బదులుగా పుష్కలమైన పోషకాలున్న ఆరోగ్యకరమైన భోజనం, ఇతర ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు. ఇది వారి ఆరోగ్యంతోపాటు రుచికరమైన టేస్ట్‌ను ఇస్తుంది. ఇలాంటి ఉత్సవ సమయంలో ఎలాంటి భోజనం తీసుకోవాలో వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

తీసుకోవాల్సిన ఆహారం..

  1. ఈ పండుగకు తయారు చేసుకునే ముఖ్యమైన ఆహారం మోదక్‌. ఇందులో కొబ్బెర, బీట్‌రూట్, శనగ పప్పు వంటివి వేసి తయారు చేస్తారు.

  2. రిషీ భాజీ ఇది రిషి పంచమినాడు తయారు చేసుకుంటారు. ఇందులో సీజన్‌లో దొరికే కూరగాయలను వేసి చేస్తారు. ఇది చాలా ఆరోగ్యకరమైన వంటకం. దీన్ని చపాతీ, రైస్‌తో తీసుకోవాలి.

  3. థాలిపీట్‌ .. మల్టీ గ్రెయిన్‌ పిండితో తయారు చేసుకుంటారు. శనగ పప్పు, గుండు పప్పు, రైస్, గోధుమ పిండి, బట్టర్, నెయ్యి కూడా వాడతారు.

  4. పంచఖద్యా.. దీన్ని గణపతి నిమజ్జనం రోజు అందరికీ పంచుతారు. పారబాయిల్డ్‌రైస్, శనగపప్పు, బెల్లం, ఎండు కొబ్బరి, జొన్నలు వేసి ఈ వంటకం తయారు చేస్తారు. దీంట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

  5. ఆలు చే ఫద్‌ఫద్‌.. దీన్ని చామ ఆకులతో తయారు చేస్తారు. తెల్లటి మక్కలు, గుమ్మడి కాయ, పల్లీ, తోటకూర వేస్తారు. దీన్ని గణనాథుడుకి ప్రసాదంగా పెడతారు.

  6. కెల్‌ఫులాచి బాజీ.. దీన్ని అరటిపూవుతో తయారు చేస్తారు. కొబ్బరి ఇతర వస్తువులతో తయారు చేస్తారు.
    ఈ ఫెస్టివ్‌ సీజన్‌లో కొంతమంది ఉపవాసం చేసి, లైట్‌ ఫుడ్‌ తీసుకుంటారు. వారు సూప్స్, స్ప్రౌట్స్, సలాడ్స్‌ తీసుకుంటే రోజంతా వారికి సరిపోయే శక్తి అందుతుంది.


తీసుకోకూడనివి..
గణేష్‌ ఉత్సవాలకు అందించే స్వీట్లలో ముఖ్యంగా రెడీమేడ్‌ స్వీట్లకు దూరంగా ఉండాలి.
ఇందులో డీప్‌ ఫ్రై చేసినవి,పాపడ్, ఫ్రై కరాంజీ, ఫ్రైడ్‌ మోదక్‌లను ఎక్కువగా తీసుకోరాదు..
మీరు ఫాస్టింగ్‌ చేసినట్లయితే.. ఆయిలీ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. సాముదాన వడా, పోటాటో వేఫర్స్‌ బదులుగా పాలు, బట్టర్‌ మిల్క్, ఫ్రూట్స్, లెమన్‌ జ్యూస్, మిల్క్‌ షేక్స్‌ తీసుకోవచ్చు.
షుగరీ బివరేజెస్‌ను అస్సలు తీసుకోరాదు.
ఇన్ఫెక్షన్లు సోకే సీజన్‌ కాబట్టి ఫ్రెండ్స్, రిలేటివ్స్‌ ఇళ్లకు తరచుగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా రోడ్డుపై విక్రయించే వస్తువులను అస్సలు తినకూడదు.
Published by:Renuka Godugu
First published: