దుర్గే దుర్గతి నాశిని అంటారు. ఉత్తర భారత్‌లో జై మాతాదీ అని వేడుకుంటారు. ఈ నేపథ్యంలో నాగపూర్‌లోని దుర్గాదేవి Durga devi .. సింహవాహినిగా దర్శనమిస్తుంది. ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ అని తెలుగువారు కొనియాడతారు. సర్వజనావళిని రక్షించే అమ్మ. దుర్గ నామాన్ని వేదం ఓ మహా మంత్రంగా నిర్విచించింది.
నాగ్‌పూర్‌లోని ప్రతాప్‌నగర్ 130 ఏళ్ల చరిత్ర ఉంది. వసంతరావు సాటే అనే భక్తుడు స్ఫూర్తితో ఈ మందిరం నెలకొంది. మూడు గోపురాలు, త్రిశక్తులను సూచికలుగా ఉన్నాయి. కాషాయ ధ్వజాలు ఉంటాయి. మూడు వాక్కు, బుద్ధి, జ్ఞానాలకు సంకేతం. నాగ్‌పూర్‌లో అనేక శక్తిరూపాల ఆలయాలు ఉన్నాయి. ఇది ప్రధాన పట్టణానికి చేరువలో ఉంది.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు శక్తులు ఇచ్చిన అమ్మ జగన్మాత ఆదిశక్తి. అసుర నాశనం చేసి సకల లోకాలకు శాంతిని ప్రసాదించింది. ఇక్కడి ఆలయంలో పాలరాతితో తీర్చిదిద్దుకుని ఉంటుంది. దు అంటే దుర్వికారాలను ర్గా అంటే క్షమింపజేయటం అని అర్థం. అభయహస్తంతో కొలువై ఉంటుంది. ఈ మందిరంలో అష్టభుజ దేవిగా ఉంది. శాంతిసౌభాగ్యాలను అందిస్తుంది. శివాణిగా, భవాణి ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి.
దాదాపు 140 ఏళ్ల క్రితం ప్రాంతంలో వ్యాధులు సోకినాయి. ఓ యోగి చెప్పడంతో వసంతరాయి ఇక్కడ చిన్న మందిరాన్ని ఏర్పాటు చేశాడు. దుర్గామాతను దర్శించుకున్న భక్తులు.. మిగతా దేవులను దర్శించుకుంటారు. ఇక్కడ వేంకటేశ్వరుడు ప్రత్యేకంగా నల్లరాతితో దర్శనమిస్తాడు.
అరుదైన గణపతి దేవుడి ఆలయం కొలువుదీరింది. మరో మందిరంలో హనుమాన్ అభయాంజనేయ స్వామిగా దర్శనమిస్తాడు. ఈ మందిర సమీపంలో శ్రీ సీతారాముల విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయం సంవత్సరం మొత్తం ఉత్సవాలు జరుగుతాయి. రాధకృష్ణులు కూడా తేజరిల్లుతారు. ముగ్ధమనోహరంగా అలరిస్తాయి. పంచముకేశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. ప్రతి మంగళ, శుక్రవారంతో రాహు దీపాలు పెడతారు. శరన్నవరాత్రుల్లో ఈ మందిరాన్ని విశేషంగా అలంకరించి, వేడుకలు నిర్వహిస్తారు.
ఆలయ మార్గం..
దేశంలోని ఏ ప్రాంతంలోనైనా మహారాష్ట్రలోని ముంబైకి చేరుకుంటారు. అక్కడి నుంచి నాసిక్ మీదుగా ఈ నాగ్‌పూర్‌కు చేరుకుంటారు. హైదరాబాద్ Hyderabad నుంచి దాదాపు 500 కీమీ దూరంలో ఉన్న నాగ్‌పూర్ నగరానికి కామారెడ్డి, ఆర్మూర్, ఆదిలాబాద్, హింగన్ఘాట్ల మీదుగా నాగ్‌పూర్‌కి చేరుకుంటారు. ఈ ప్రాంతం ప్రముఖ వ్యాపార కేంద్రాలకు సమీపంలో ఉంది. వివిధ వాహనాల ద్వారా ప్రతాప్ నగర్‌కు చేరుకోవచ్చు.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.