హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Numerology: (ఫిబ్రవరి 2) మీ పేరు U అక్షరంతో మొదలవుతుందా..? న్యూమరాలజీ ప్రకారం మీ లక్షణాలు ఇవే..

Numerology: (ఫిబ్రవరి 2) మీ పేరు U అక్షరంతో మొదలవుతుందా..? న్యూమరాలజీ ప్రకారం మీ లక్షణాలు ఇవే..

Numerology

Numerology

Numerology Today:(పూజా జైన్ - న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890) ఇంగ్లీష్ U ఆల్ఫాబెట్‌తో పేరు మొదలయ్యే వ్యక్తుల గురించి న్యూమరాలజీ ఏం చెబుతోందో తెలుసుకోండి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Visakhapatnam

Numerology: న్యూమరాలజీ ప్రకారం నెలలో వేర్వేరు తేదీల్లో పుట్టిన వారిపై కొన్ని సంఖ్యల ప్రభావం ఉంటుంది. ఈ సంఖ్యల ఆధారంగా వ్యక్తులకు ఎదురయ్యే పరిస్థితులను సంఖ్యాశాస్త్ర నిపుణులు విశ్లేషిస్తుంటారు. అయితే పుట్టిన తేదీ ప్రకారమే పిల్లలకు పేరు పెట్టాలని న్యూమరాలజీ చెబుతోంది. ఇలా ఇంగ్లీష్ U ఆల్ఫాబెట్‌తో పేరు మొదలయ్యే వ్యక్తుల గురించి ఈ శాస్త్రం ఏం చెబుతోందో తెలుసుకోండి.

క్రియేటివ్ పర్సన్స్:

ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ Uతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు ఎప్పుడూ కొత్త ఆలోచనలతో ముందుకెళ్తారు. కొత్త ఆలోచనలకు వీరు మార్గదర్శకులుగా ఉంటారు. విషయం ఏదైనా సరే, చొరవ తీసుకోవడానికి, అమలు చేయడానికి కూడా ఇష్టపడతారు. తమ దారికి వచ్చే అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటారు. ఇలా అన్ని అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని బలంగా మారుతారు.

వీరి ఆలోచనలు క్రియేటివ్‌గా ఉంటాయి. ఇవి అమలు చేయడానికి హేతుబద్ధమైనవిగా, ప్రాక్టికల్‌గా కూడా కనిపిస్తాయి. వీరు నిజాన్ని నమ్ముతారు, అహింసతో పని చేస్తారు. ఈ విషయాల గురించి ఎల్లప్పుడూ మాట్లాడతారు. వీరు వర్తమానంలో మాత్రమే జీవిస్తారు, గతాన్ని మరచిపోతారు. ఎందుకంటే వీరు జీవితాన్ని దేవుని బహుమతిగా భావిస్తారు. గతం పట్టింపు లేదని, వర్తమానంలో సరైన ఆలోచనలు, విశ్వాసంతో జీవిస్తేనే భవిష్యత్తు ఉత్తమంగా మారుతుందని నమ్ముతారు. Uతో పేరు ఉన్నవారు కర్మ సిద్ధాంతాన్ని నమ్మి, అనుసరిస్తారు. వీరికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మంచి ఉత్సాహంతో ఏ రంగంలోనైనా పని చేయాలనే ధోరణి, వీరికి అసాధారణ విజయాన్ని అందిస్తుంది.

ఈ రంగంలో విజయాలు:

ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే యువత క్రీడలలో సత్తా చాటుతారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ట్రైనింగ్‌లో సత్తా చాటి విజయవంతమవుతారు. తమ పద్దతితో నలుగురిలో ప్రత్యేకంగా ఉంటారు. సాఫ్ట్‌వేర్, ట్రైనింగ్, కమీషనింగ్, ఎగుమతి దిగుమతి, సంగీతం, పుస్తకాలు, ఆడిటింగ్ సంస్థలు, అడ్వర్టైజింగ్ కన్సల్టింగ్, దుస్తులు, హోటల్‌, ఫుడ్, బ్యాంకింగ్‌ విభాగాలకు చెందిన కంపెనీలు గ్రాండ్ సక్సెస్ కోసం సంస్థ పేరును U అక్షరంతో మొదలయ్యేలా పెట్టుకోవచ్చు.

లక్కీ కలర్స్: నారింజ, పసుపు

లక్కీ డే: గురువారం

విరాళాలు: పేదలకు లేదా యాచకులకు ఎల్లో రైస్ దానం చేయండి

పాటించాల్సిన విధులు:

ఉదయం గురు మంత్రాన్ని జపించండి

రోజూ పొద్దున్నే నుదుటిపై చందనం దిద్దుకోండి

ఇంట్లో తులసి మొక్కను ఉంచండి. మీ గురువు లేదా తులసి మొక్కకు దీపం పెట్టండి

ఆఫీస్‌లో లోహ వస్తువులను ఉంచడం మానుకోండి. వీటికి బదులుగా చెక్క వస్తువులు లేదా ఫర్నిచర్ ఎంచుకోండి

దయచేసి నాన్ వెజ్, లిక్కర్, పొగాకు, లెదర్ ప్రొడక్ట్స్‌కు దూరంగా ఉండండి

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)

First published:

Tags: Astrology, Horoscope, Numerology

ఉత్తమ కథలు