Numerology: పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ (Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. పిల్లలకు పుట్టిన తేదీలోని అంకెల ఆధారంగా ఆల్ఫాబెట్ సెలక్ట్ చేసుకుని పేరు పెడితే మేలు జరుగుతుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతారు. ఆ ప్రభావంతో ఉన్నత స్థానాలు అందుకుంటారని, కీర్తి, ప్రతిష్టలు దక్కుతాయని చాలామంది నమ్ముతారు. ఆల్ఫాబెట్ G, Hతో పేరు మొదలయ్యే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ఆల్ఫాబెట్ G :
ఆల్ఫాబెట్ Gతో మొదలయ్యే పేరు ఉన్న వ్యక్తులు నిజాయతీగా, సూటిగా, గౌరవప్రదంగా ఉంటారు. ఇతరులను సులువుగా ఆకర్షిస్తారు, ఛార్మింగ్‌గా ఉంటారు. లోతైన నైతిక, మేధో విలువల ప్రకారం జీవిస్తారు. తమ జీవితాలను చక్కగా ప్లాన్ చేసుకుంటారు, అలాగే జీవించేందుకు ప్రయత్నిస్తారు. వీరికి అపారమైన సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. చక్కని భాష, విలువలు పూర్తిగా గొప్ప విజయాలకు చిహ్నం. G లెటర్‌తో పేరు మొదలయ్యే వారు వినయపూర్వకంగా ఉంటారు, డౌన్ టూ ఎర్త్‌గా కనిపిస్తారు. విజయం కోసం ఇతరులకు నష్టం కలిగించే పనులు చేయరు. తమ అంతర్ దృష్టిని మాత్రమే వినాలని, ఇతరుల ప్రభావానికి లోను కాకూడదని గుర్తుంచుకోవాలి. G లెటర్‌తో పేరు ఉండే వారికి కచ్చితమైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి సొంత నిర్ణయాలు, వ్యూహాలు అమలు చేయాలి.
పరిహారం: ఏ రూపంలోనైనా రాగి లేదా కాంస్య లోహాన్ని మీ వద్ద ఉంచుకోండి.
లక్కీ కలర్స్: ఎల్లో
ఆల్ఫాబెట్ H :
ఇంగ్లిషు లెటర్ Hతో పేరు మొదలయ్యే వ్యక్తులు సెల్ఫ్ సెంటర్డ్‌గా ఉంటారు. కొన్నిసార్లు తెలివిగా ఉంటారు. వారు తమ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేంత తెలివైనవారు. వీరికి పెద్ద ఆశయాలు ఉంటాయి. ఆడంబరం, ప్రదర్శనను నమ్ముతారు. ఈ రకమైన వ్యక్తులు వంచన, మోసపూరిత ప్రపంచంలో జీవిస్తున్నారని వారి చుట్టూ ఉన్న వ్యక్తులు భావిస్తారు. తమ కంటే తక్కువ స్థాయి వ్యక్తుల పట్ల వారి వైఖరి మారాలి. ఈ వ్యక్తులు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కావచ్చు కానీ వృత్తి నైపుణ్యాన్ని యథార్థంగా అనుసరించాలని గుర్తుంచుకోవాలి. ఇతరుల ప్రభావం లేకుండా ఉన్నప్పటికీ, వారు ఆనందాన్ని అందించే పర్యావరణంతో దూరంగా ఉంటారు. బహిరంగ ప్రసంగాలు, రాజకీయాలు, గ్లామర్, మీడియా, తయారీ, కళాత్మక రంగానికి సంబంధించిన వృత్తిలో ముందుంటారు. వైవాహిక జీవితంలో పోరాటాలు తప్పవు, కానీ ఏదో ఒక విధంగా వృత్తిపరమైన జీవితం ప్రశంసలను గెలుచుకుంటుంది. మాట, ప్రవర్తనలో మృదుత్వాన్ని కాపాడుకోవాలి.
పరిహారం: నాన్ వెజ్, మద్యం, పొగాకు కు దూరంగా ఉండాలి. లెదర్ ప్రొడక్టులను వినియోగించకూడదు. పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోండి. శారీరక వ్యాయామం తప్పనిసరి. జంతువులకు ఎల్లప్పుడూ ఆహారం అందజేయండి, సేవ చేయండి. ఆయుర్వేదాన్ని అనుసరించండి.
లక్కీ కలర్స్: బ్లూ
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Numerology