Home /News /astrology /

DO YOU KNOW WHY LORD GANESHA IDOL MAKE NIMAJJAN AFTER POOJA RNK

Ganesh nimajjan: వినాయకుడి ప్రతిమను నిమజ్జనం అందుకే చేస్తారట!

బొజ్జ గణపయ్యకు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా పూజలు చేసి.. కొన్ని రోజులు విగ్రహ ప్రతిష్ఠాపన చేసిన తర్వాత నిమజ్జనం చేస్తారు.

బొజ్జ గణపయ్యకు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా పూజలు చేసి.. కొన్ని రోజులు విగ్రహ ప్రతిష్ఠాపన చేసిన తర్వాత నిమజ్జనం చేస్తారు.

బొజ్జ గణపయ్యకు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా పూజలు చేసి.. కొన్ని రోజులు విగ్రహ ప్రతిష్ఠాపన చేసిన తర్వాత నిమజ్జనం చేస్తారు.

హిందు సంప్రదాయం ప్రకారం బాధ్రపద శుక్లపక్షంలో వినాయక చవితిని అంగరంగ వైభంగా నిర్వహిస్తరు. పూజాపురస్కారాలు చేసి, వీలైనన్ని రోజులు విగ్రహ ప్రతిష్ఠాపన చేసిన తర్వాత నిమజ్జనం nimajjan చేయడం ఆనవాయితీ. అస్సలు ఇలా వినాయకుడి ప్రతిమను నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసా? చాలా మందికి ఇది తెలియదు. ఆ వివరాలు తెలుసుకుందాం.

వినాయకుడిని ఇంట్లో మూడు రోజులు లేదా 5, 9, 11 రోజులు ప్రతిష్ఠాపన చేసిన తర్వాత నిమజ్జనం చేస్తారు. చెరువులో లేదా నదుల్లో నిమజ్జనం చేస్తారు. వీలు లేని వారు ఇంట్లోనే ఏదైన టబ్, బకెట్లలో నిమజ్జనం చేస్తారు. సాధారణంగా వినాయకుడి పూజలు పూవు పత్రితో పూజలు చేస్తారు. నిమజ్జనం సమయంలో వీటితోపాటు వినాయక నిమజ్జనం చేస్తారు. అపుడు నీటిలో ఉండే క్రిమికీటకాలు శుద్ధిగా అయిపోతాయి. వీటితో ఏ అనారోగ్య సమస్యలు రావు. కానీ, ప్రస్తుతం ఈ వినాయకుడి విగ్రహాలను అనేక రసాయనాలతో తయారు చేస్తున్నారు.

ఇటువంటి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు అపరిశుభ్రం అయిపోతాయి. వీటితో జలచరాలకు సైతం ముప్పు వాటిల్లుతుంది. కేవలం మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని మాత్రమే ఉపయోగిస్తే.. వాతావరణానికి సైతం ఏ హానీ కలుగదు. ఈ వినాయక నిమజ్జనం వెనుక మరొక చరిత్ర ఉంది. కేవలం మట్టితో తయారు చేసిన విగ్రహానికి 9 రోజులపాటు దైవత్వం ఉంటుందని అంటారు.

 వినాయకుడిని ఈ విధంగా నిమజ్జనం చేస్తే 100 శాతం పూజాఫలం!


ఆ తర్వాత వాటికి పూజలు చేసినప్పటికీ ఏ విధమైన దైవశక్తి ఉండదు. అందుకే తొమ్మిది రోజుల తర్వాత ఇలా నీటిలో నిమజ్జనం చేస్తారు. కేవలం వినాయక ప్రతిమను మాత్రమే కాదు, దేవీనవరాత్రుల తర్వాత అమ్మవారి ప్రతిమలను కూడా ఇదేవిధంగా నిమజ్జనం చేస్తారు. ఇంకా మనకు వినాయకుడి గురించి తెలియని నిజాలు ఉన్నాయి. ముఖ్యంగా వినాయకుడికి పెళ్లి కాలేదు, బ్రహ్మచారి అంటారు. కానీ ఆయనకు ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి, ఇద్దరు పిల్లలు శుభ్, లాభ్‌. ఒకరోజు వినాయకుడు తపస్సు చేస్తుంటే.. తులసీ మాత ఆయన్ను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని కోరుతుంది.

దానికి ఆయన తిరస్కరిస్తాడు. దీంతో ఆమె నిన్ను త్వరలో పెళ్లి చేసుకుంటానని అంటుంది. వెంటనే వినాయకుడు నీవు మొక్కగా మారిపోదువు అని శపిస్తాడట. అదే ఇప్పుడు మనం ప్రస్తుతం పూజ చేస్తున్న తులసీమొక్క. అందుకే వినాయకుడికి అన్నీ పూలు పత్రాలతో పూజ చేస్తారు కానీ, తులసీ ఆకులతో చేయరు. కేవలం ఒక్క వినాయక చతుర్ధినాడు మాత్రమే వీటితో పూజలు చేస్తారు.
Published by:Renuka Godugu
First published:

Tags: Ganesh Chaturthi 2021, Ganesh immersion

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు