హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Navaratri 2021: దుర్గామాత ఆయుధాలు ధరించడం వెనుక రహస్యం?

Navaratri 2021: దుర్గామాత ఆయుధాలు ధరించడం వెనుక రహస్యం?

మన పురాణాల ప్రకారం శివుడు దుర్గామాతకు త్రిశూలాన్ని ప్రసాదిస్తాడు. తల్లి ఈ త్రిషులంతోనే మహిషాసురుడిని సంహరించింది.

మన పురాణాల ప్రకారం శివుడు దుర్గామాతకు త్రిశూలాన్ని ప్రసాదిస్తాడు. తల్లి ఈ త్రిషులంతోనే మహిషాసురుడిని సంహరించింది.

Durga puja: హిందు మతంలో దుర్గామాతను చాలా ఆరాధిస్తారు. నవరాత్రి సమయాల్లో 9 రోజులపాటు 9 అవతారాల్లో దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. దుర్గామాత శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు. ఆమెను మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు.

ఈ నవరాత్రుల navaratri సందర్భంగా అసలు దుర్గామాత ఆయుధాలు ఎందుకు ధరిస్తుందో.. దానికి వెనుక ఉన్న రహస్యాలు ఏంటో తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం శివుడు దుర్గామాతకు త్రిశూలాన్ని ప్రసాదిస్తాడు. తల్లి ఈ త్రిషులంతోనే మహిషాసురుడిని సంహరించింది. గ్రంథాల ప్రకారం త్రిశూలం సత్వ, తమ, రాజస లక్షణాలు సూచిస్తాయి.

అనేకసార్లు durga mata తల్లి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని చూస్తే కొందరికి సందేహం వస్తుంది. అదే దుర్గామాత ఆయుధాలు ధరించడం.. మరి అవి అమ్మకు ఎవరు ప్రసాదించారు.. అనిపిస్తుంది.

దేవీభాగవత పురాణం ప్రకారం అసురుడైన మహిషారుడి వేధింపులు ఎక్కువవుతాయి. దీంతో దేవేంద్రుడు దేవతలందరితో కలిసి త్రిమూర్తుల వద్దకు వెళ్తాడు. మహిషాసురుడి శక్తి, అతడి వల్ల కలిగే భయాన్ని వారికి వివరిస్తాడు. దేవతలందరూ త్రిమూర్తులను రక్షణ కోరతారు.

అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శరీరాల నుంచి తల్లి దుర్గామాతగా అవతరిస్తుంది. ఆ సమయంలో దేవతలందరూ తమ శక్తిని దుర్గామాతకు ఇస్తారు. ఇందులో ఆయుధాలు కూడా ఉంటాయి. ఆ తరావత దుర్గా మహిషాసురుడిని చంపి దేవతలతోపాటు యావత్‌ సృష్టిని ఆ రాక్షసుడి నుంచి విముక్తి కల్పిస్తుంది. దుర్గామాత ఆయుధాలు ధరించడం వెనుక రహస్యం రాక్షసులను నాశనం చేయడం.. భక్తులను రక్షించడం.

 ఇది కూడా చదవండి: నవరాత్రి పూజలో నాలుగవ రోజు అమ్మవారి అలంకరణ!


త్రిశూలం..

శివుడు దుర్గామాతకు త్రిశూలాన్ని ప్రసాదిస్తాడు.దీంతోనే తల్లి మహిషాసురుడిని చంపుతుంది. గ్రంథాల ప్రకారం సృష్టి సమతుల్యతపై ఆధారపడిన సత్వ, తమ, రాజస్‌ లక్షణాలను సూచిస్తుంది.

ఖడ్గం..

వినాయకుడు దుర్గామాతకు ఖడ్గాన్ని సమర్పిస్తాడు. గ్రంథాల ప్రకారం మా దుర్గా ఖడ్గం అంచు షార్ప్‌ మెమొరీ, జ్ఞాన ప్రకాశానికి సూచన.

ఇది కూడా చదవండి: మీకు అదృష్టాన్ని తెచ్చే 5 వాస్తు చిట్కాలు!


సుదర్శన చక్రం..

ఇది విష్ణువు దుర్గామాతకు సమర్పిస్తాడు. ఇది సృష్టి కేంద్రామని.. విశ్వం దాని చుట్టూ తిరుగుతుందని అంటారు.

ఈటె..

దీన్ని అగ్నిదేవుడు దుర్గామాతకు సమర్పిస్తాడు. ఇది మండుతున్న శక్తి, శుభానికి చిహ్నంగా భావిస్తారు. చెడు, మంచి వ్యక్తుల మధ్య బేధానికి ప్రతీక.

వజ్ర..

ఇంద్రుడు తల్లికి వజ్రాయుధ శక్తిని బహుమతిగా సమర్పిస్తాడు. వేదాల ప్రకారం ఇది ఆత్మ దృఢత్వానికి చిహ్నం, బలమైన సంకల్పానికి శక్తి.

విల్లు, బాణం..

దుర్గామాతకు విల్లు,బాణం వాయుదేవుడు, సూర్యదేవుడు సమర్పిస్తారు. విల్లు సంభావ్య శక్తిని.. బాణం గతి శక్తిని సూచిస్తుంది.

గొడ్డలి..

విశ్వకర్మ మహాముని దుర్గాదేవికి గొడ్డలిని ఇస్తాడు. ఇది చెడుతో పోరాడటానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఎటువంటి పరిణామాలకు భయపడకూడదని సూచిస్తుంది.

Published by:Renuka Godugu
First published:

Tags: Durga Pooja, Dussehra 2021, Navaratri

ఉత్తమ కథలు