During brahma muhurat: బ్రహ్మముహూర్తంలో ఈ పని అస్సలు చేయకండి.. లేకుంటే..!

ప్రతీకాత్మక చిత్రం

Brahma muhurat: బ్రహ్మ ముహూర్తంలో తిథి, వార, నక్షత్ర, యోగ దోషాలు ఉండవు.దైవత్వం ఉండే సమయం, బ్రహ్మ ముహూర్తంలో లేచి మీ పనిని ప్రారంభిస్తే.. మీరు జీవితంలో మార్పును అనుభవించవచ్చు. ఆ ఆలోచనలు నిజమవుతాయి. లక్ష్మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది.

  • Share this:
బ్రహ్మ ముహూర్తం (Brahma muhurat) లో మేల్కొంటే మీ మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది. దానికి సరైన సమయం ఉదయమే. బ్రహ్మదేవుడు (Lord brahma) సృష్టికారకుడు అంటారు. మనం ఉదయం 4.30 నుంచి 6 గంటల వరకు ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయంలో చేసే ఉత్తమ పనులు మంచి ఫలితాలను ఇస్తుంది. అందుకే బ్రహ్మ ముహూర్తం సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఈ సమయంలో తిథి వార నక్షత్ర దోషాలు ఉండవు. ఆ సమయం ఎల్లప్పుడూ శుభప్రదం. ఈ సమయంలో మనం లేచి స్నానం చేసి, పూజించి, మన పనిని ప్రారంభిస్తే.. రోజంతా విజయం సాధిస్తాం. ఇంట్లో బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.

ఇది కూడా చదవండి:  లాఫింగ్‌ బుద్ధుడి ఈ రూపం.. మీ అదృష్టాన్ని మార్చగలదు!

బ్రహ్మ త్రిమూర్తుల్లో ఒకరు. ఈ సమయంలో కచ్ఛితంగా నిద్రపోకూడదు. ధ్యానం, పూజ వంటి ఉపయోగకరమైన పనులు చేయాలి.ఈ సమయంలో వివాహం వంటి శుభకార్యాలు చేస్తారు.ఈ సమయంలో చేసే పని మెరుగైన ఫలితాలన్ని ఇస్తుంది.

బ్రహ్మ ముహూర్తం వల్ల కలిగే ప్రయోజనాలు..
బ్రహ్మ ముహూర్తంలో మేల్కొన్నప్పుడు అనేక అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యోదయ సమయంలో సూర్యుడి నుంచి భూమికి వచ్చే కాంతి కిరణాలు శక్తివంతమైనవి. ఇవి మన శరీరాన్ని తాకినప్పుడు నరాలు ౖచెతన్యమవుతాయి. ఉత్సాహం, శక్తిని అందిస్తుంది. కళ్లు ఆరోగ్యాన్ని పొందుతాయి. శరీరానికి అదనపు బలం వస్తుంది. అందుకే మన పూర్వీకులు సూర్యారాధన ఉత్తమ ఆరాధన అని చెప్పారు.

ఇది కూడా చదవండి:  వామ్మో! ఈ 5 రకాల వ్యక్తులను పెళ్లి చేసుకుంటే ఇక అంతే..!

బ్రహ్మ ముహూర్తం ముందే నిద్ర లేవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ఇంట్లో పని చేసుకోవాలి. తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. మనం నిద్రపోయే సమయంలో మెలకువడా ఉంటే.. వ్యాధులు వస్తాయి. అందుకే మన పెద్దలు మనం త్వరగా లేవాలని చెప్పారు. ఆ సమయంలో భగవంతునికి అన్ని రకాల ప్రార్థనలు దేవుడికి చేరుతాయి.

శాస్త్రీయ కారణాలు..
ఉదయమే మేల్కొనడం వల్ల శరీరం చురుకుగా, ఆరోగ్యంగా ఉంటుంది. అన్ని పరిస్థితులు మెరుగుపడతాయి. తెల్లవారుజామున స్వచ్ఛమైన గాలి ఉన్నప్పుడ బయట నడవడం వల్ల శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైంది.

ఈ సమయం దీపం వెలిగించడానికి సరైన సమయం. తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో 4–6 గంటల మధ్య దీపం వెలిగించి ఉదయమే పూజిస్తే.. అన్ని కార్యక్రమాలు ప్రయోజనకరంగా ఉంటాయని అంటారు. శనివారం బ్రహ్మముహూర్తంలో శివుడికి పూజించడం వల్ల శని నీచస్థితి నుంచి బయటపడవచ్చు.
Published by:Renuka Godugu
First published: