Home /News /astrology /

Kids in dream: కలలో మీకు పిల్లలు ఇలా కనబడితే ఏం జరగుతుందో తెలుసా?

Kids in dream: కలలో మీకు పిల్లలు ఇలా కనబడితే ఏం జరగుతుందో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Kids in dream: సాధారణంగా మీ కలలో ఆడపిల్ల కనిపిస్తే .. మీ మనస్సులోని భావాలను చెప్పేస్తున్నారని అర్థం.

నిద్ర పోతున్నప్పుడు మనం శాంతి, శారీరక ఒత్తిడిని తగ్గించుకుంటాం. అయితే, మనం ఇలా నిద్రలోకి జారిపోయే కొద్ది కలల (Dreams)  ప్రపంచంలోకి ప్రవేశిస్తాం. రోజంతా మనం ఏం ఆలోచిస్తాం లేదా మన మనస్సులో ఏం జరుగుతుందో మన కలలో చాలా సార్లు వస్తాయి. అయితే, స్వప్న శాస్త్రం ప్రకారం కలలు భవిష్యత్తు సంఘటనలకు సంబంధించినవి. కలలో కనిపించే విషయాలు, రాబోయే సంఘటనలను సూచిస్తాయి.

జోతిషం ప్రకారం తెల్లవారు జాము 3 గంటల నుంచి 5 గంటల మధ్య కలలు కంటే నిజమవుతుంది అని అంటారు. ఈ సమయంలో దైవిక శక్తులు పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. పాము-గుర్రం, ఇంటి మనిషి ఒకవేళ మీకు కలలో పిల్లలు పుడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: వాచ్.. ఇలా వాడితే ప్రమాదం తప్పదట..

మనకు పిల్లలు కలలో పదేపదే వస్తే ఏం జరుగుతుందో తెలుసా? వీటికి అనేక అర్థాలు ఉంటాయి. తద్వారా కలలో పిల్లలు కనిపించడం వల్ల నిజ జీవితంలో కూడా మనపై సానుకూల ప్రభావాలు ఉంటాయి.

ఏడుస్తున్న పిల్లవాడు మీ కలలో కనిపిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా? అది మంచిది కాదని అర్థం.

పిల్లలు చదువుతున్నట్లు కలలో వస్తే మీరు చాలా లక్కీ అని అర్థం.

మీ స్వంత బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కలలో వస్తే.. అది మీ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అర్థం.

ఇది కూడా చదవండి:  లక్ష్మీదేవి కరుణకు తులసి వద్ద ఈ ఒక్క ఉపాయం చేయాలి...

ఒకవేళ మీ కలలో కవలలు కనిపించినప్పుడు రకరకాల అర్థాలు వస్తాయి.

పిల్లవాడు బాధలో ఉన్నట్లు కలలో వస్తే.. రాబోయే రోజుల్లో మీ స్వేచ్ఛ రాజీ పడుతుందని అర్థం.

మంచం మీద శిశువు నిద్రిస్తున్నట్లు కనిపిస్తే.. గర్భిణీ స్త్రీలు మంచం మీద నిద్రిస్తున్న శిశువును చూడటం శుభ సంకేతం.

ఒకవేళ మీ కలలో ఆడుకుంటున్న పిల్లవాడు వస్తే.. మీరు ప్రేమ, సంభాషణతో మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నారని ఇది సూచిస్తుంది.

కలలో పిల్లవాడు నవ్వినా, లేదా కేకలు వేసినా ఇది మంచి సంకేతంగా పరిగణిస్తారు. మీరు త్వరలో ఊహించని రిలేషన్ షిప్ను కలిగి ఉంటారని అర్థం.

సాధారణంగా మీ కలలో ఆడపిల్ల కనిపిస్తే .. మీ మనస్సులోని భావాలను చెప్పేస్తున్నారని అర్థం.
Published by:Renuka Godugu
First published:

తదుపరి వార్తలు