Ants in house: ఇంటి గోడలపై చీమల వరుస దేనికి సంకేతమో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

Ants in the house: ఇంట్లోకి నల్ల చీమలు ఉత్తరం లేదా దక్షిణం వైపు నుంచి వస్తే.. అది మంచి సంకేతం. అయితే, తూర్పు దిశ నుంచి చీమలు వస్తే.. మీ ఇంట్లో చెడువార్త రావచ్చు.

  • Share this:
వర్షం (winter) లేదా వేసవి కాలంలో ఇంటి గోడలపై చీమల (Ants) వరుస కనిపించడం సర్వసాధారణం. అవి క్యూలో నుంచే వెళ్లాయి. ఈ చీమలు తమ ఆహారాన్ని వెతుక్కుంటూ అక్కడికి.. ఇక్కడికి వెళ్లినా.. వాస్తు (vastu) లో దీనికి ఒక ప్రత్యేక అర్థం ఉంది. చాలా మంది ఇళ్లలో ఇది ఆనందం, సంపద సేకరణకు చిహ్నంగా పరిగణిస్తారు. అందువల్ల చాలా మంది చీమలకు ధాన్యం మొదలైనవి ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. ఇది కాకుండా అనేకమంది ఇళ్లలో నల్ల చీమలు రావడం పవిత్రంగా పరిగణిస్తారు. వాటికి ఆహారం (food)  ఇవ్వడం దానధర్మంగా పరిగణిస్తారు. వాస్తులో ఈ రంగు చీమలు రావడం చాలా సింబాలిక్‌ అర్థాలను కలిగి ఉంది. కాబట్టి వాస్తుకు సంబంధించిన చీమల సంకేతాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం.

గోడపై చీమలు..
ఇంట్లో చీమలు గోడలపైకి ఎక్కినట్లుగా కనిపిస్తే.. మీ ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయని, ఆ ఇల్లు వృద్ధి, పురోగతికి సంకేతంగా పరిగణిస్తారు. అయితే, అవరోహణ దిశగా ప్రయాణిస్తే.. నష్టానికి సంకేతంగా పరిగణిస్తారు.

నల్ల చీమలు..
ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే.. మీ జీవితంలో త్వరలో సంపద, ఆనందం రాబోతున్నాయని అర్థం. అటువంటి పరిస్థితుల్లో మీరు నల్ల చీమలకు ఆహారం ఇవ్వడం శుభప్రదంగా పరిగణిస్తారు.

ఇది కూడా చదవండి:  నాగదోషాలను తొలగించి 10 ప్రఖ్యాత నాగదేవాలయాలు!

బియ్యం డబ్బాల్లో..
బియ్యం డబ్బాల్లో నుంచి చీమలు వస్తే.. శుభసూచకం. ఇది డబ్బు రాకకు సంకేతం. ఇలా జరిగినప్పుడు ఆర్థిక సంక్షోభం తొలగిపోయి ఇల్లు ఏ లోటు లేకుండా ఉంటుందని నమ్ముతారు.

ఎర్ర చీమలు..
ఇంట్లో ఎర్రటి చీమలు కనిపిస్తే.. అది అశుభం. దీని అర్థం భవిష్యత్తులో ఇబ్బందులు వివాదాలు, డబ్బు ఖర్చు కావచ్చు.

ఇది కూడా చదవండి:  దీపావళి ఏ రోజు నిర్వహించనున్నారు? సమయం..

గుడ్లు మోసే ఎర్ర చీమలు..
ఇంట్లో ఎర్ర చీమలు గుడ్డును నోటిలో పెట్టుకుని కనిపిస్తే.. శుభప్రదం. మీ ఇంట్లో కొన్ని పనులు మంచి కార్యాలు జరగనున్నాయని అర్థం.

దిశను బట్టి..
ఇంట్లోకి నల్ల చీమలు ఉత్తరం లేదా దక్షిణం వైపు నుంచి వస్తే.. అది మంచి సంకేతం. అయితే, తూర్పు దిశ నుంచి చీమలు వస్తే.. మీ ఇంట్లో చెడువార్త రావచ్చు. చీమలు పడమర దిశ నుంచి వస్తే.. మీరు బయట ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
Published by:Renuka Godugu
First published: