హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Zodiac signs: ఈ 5 రాశులవారు అబద్ధాలు చెప్పడంలో దిట్ట!

Zodiac signs: ఈ 5 రాశులవారు అబద్ధాలు చెప్పడంలో దిట్ట!

జోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారు అబద్ధాలు చెబుతారు. వారు వివిధ కారణాల వల్ల ఇలా అబద్ధాలు చెబుతారట.

జోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారు అబద్ధాలు చెబుతారు. వారు వివిధ కారణాల వల్ల ఇలా అబద్ధాలు చెబుతారట.

జోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారు అబద్ధాలు చెబుతారు. వారు వివిధ కారణాల వల్ల ఇలా అబద్ధాలు చెబుతారట.

కొంతమంది అబద్దాలు చెప్పడంలో దిట్టలు. ప్రపంచాన్ని మోసం చేశామనే భ్రమలో ఉంటారు. ఇలాంటివారు నిజాయితీపరులతోపాటు ఈ ప్రపంచాన్ని సులభంగా మోసం చేస్తారు. వీళ్లు అబద్ధం చెప్పడం ఎవ్వరూ ఆపలేరు. వాళ్లు ఎలా అంటే అబద్ధాలపై ఆధారపడి బతుకుతారు. వాటిని మనం గ్రహించకపోవచ్చు. ఎవరైనా వారిని నిందించినా... అవి వారికి నచ్చవు. కొన్ని విషయాల నుంచి తప్పించుకోవడానికి అబద్ధాన్నే సాధనంగా ఉపయోగిస్తారు. వీళ్లు అబద్ధం చెప్పడానికి మరో కారణం ఏంటంటే? అవతలి వ్యక్తి తమ దగ్గర ఏదో సమాచారాన్ని దాచిపెడుతున్నారని భావించడం. అందువల్ల వారు తరచూ అబద్ధం చెబుతారు. కానీ, ఇతరులను హాని కల్గించడానికి కాదు. జోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారు Zodiac signs అబద్ధాలు చెబుతారు. వారు వివిధ కారణాల వల్ల ఇలా అబద్ధాలు చెబుతారట.

కర్కాటక రాశి..

ఈ రాశివారు తమ అబద్ధాన్ని ఏ పాయింట్‌ వరకైనా తీసుకెళ్తారు. వాటిని కప్పి పుచ్చడానికి మరో అబద్ధం కూడా ఆడతారు. ఎందుకంటే, అవి ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆందోళనకరం కూడా కావచ్చు.

సింహ రాశి..

వారిపై ఇతరుల దృష్టి ఆకర్షించడానికి ఇలా అబద్ధం ఆడతారు. వీరు అహంకారంతో అబద్ధాన్ని ఆడతారు. కేవలం కీర్తి, ప్రజాదరణ మొదలైన వాటి గురించి అబద్ధం చెప్పడానికి సుప్రీం లెవల్‌లో వ్యవహరిస్తారు. కానీ, వీరు అబద్ధాలు ఆడేటపుడు అవతలి వ్యక్తికి ఐ కాంటాక్ట్‌ అవ్వలేరు.

ఇది కూడా చదవండి: ఈ రాశివారు ఎరుపు రంగు అస్సలు వాడకూడదు!


మిధున రాశి..

ఈ రాశివారు క్షణికావేశంతో నిజాన్ని మార్చేస్తారు. ఎందుకంటే, ఇది వారికి చాలా సులభమవుతుంది. మిధున రాశివారు ప్రతిఒక్కరిలోనూ అత్యంత సామాజిక వ్యక్తిగా తమ హోదాను నిలబెట్టుకోవాలని ఎంత ఖర్చు అయినా.. ఎలాంటి ఘర్షణలు అయినా తప్పించుకుంటారు. కానీ, వీరు అబద్ధాలు ఆడుతున్నారని ఎవరికీ తెలియనివ్వరు కూడా.

ఇది కూడా చదవండి: వామ్మో..ఈ రాశివారిది డిటెక్టివ్‌ మైండ్‌సెట్‌ అంటా!

వృశ్చిక రాశి..

ఈ రాశివారు అబద్ధం ఆడతారు. కానీ, మంచివాళ్లు. వారి అబద్ధాలు ఇతరులు గుర్తించలేని విధంగా చెబుతారు. వృశ్చిక రాశివారు ఎక్కడైనా.. ఏదైనా అబద్ధం ఆడతారు. వెంటనే దాని నుంచి సులభంగా బయటపడతారు. వాళ్లు చెప్పే వివరాలపై కాస్త దృష్టి సారిస్తే ఆ అబద్ధాలను గుర్తుపడ్టేయొచ్చు.

తులా రాశి..

ఈ రాశివారు నిజంగా అబద్ధం చెప్పాలని కాదు. తమను తాము రక్షించుకోవడానికి అలా చేస్తారు. దీంతో కొన్ని వివాదాలను సద్దుమణిగిస్తారు. వారు ఇబ్బందుల్లో పడకుండా ఉండటానికి నిజాన్ని కాస్త దాచుతారు. ఈ అబద్ధాలు వీరికి భారీ నష్టాన్ని కలిగిస్తాయి. దీంతో వారి స్థాయిని కూడా కోల్పోవాల్సి వస్తుంది.

First published:

Tags: Zodiac signs

ఉత్తమ కథలు