TTD: తిరుమల గురించి మీకు తెలియని నిజాలు!

సాధారణంగా తిరుమలకు వెళ్లే భక్తులు కేవలం రోడ్డు మార్గం, నడక మార్గం రెండు మాత్రమే ఉంటాయి అనుకుంటారు. కానీ, నడకమార్గానికి దారులు 8 ఉంటాయని ఎవరికీ తెలియదు.

సాధారణంగా తిరుమలకు వెళ్లే భక్తులు కేవలం రోడ్డు మార్గం, నడక మార్గం రెండు మాత్రమే ఉంటాయి అనుకుంటారు. కానీ, నడకమార్గానికి దారులు 8 ఉంటాయని ఎవరికీ తెలియదు.

  • Share this:
కళియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశుడు Tirumal tirupati devastanam. జీవితంలో ఒక్కసారైనా... శ్రీనివాసుడు దర్శనం చేసుకోవాలని ప్రతి హిందువు ఆశ. అందుకే నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వెళ్తుంటారు. అయితే, ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని విషయాలు చాలా మంది భుక్తులకు తెలియవు. అవేంటో తెలుసుకుందాం.

మొదటిది అలిపిరి మార్గం ఇది భక్తులందరికీ తెలిసిన మార్గం. దీని ద్వారా తిరుమలకు 3,500 మెట్ల ద్వారా చేరుకుంటారు. ఈ పవిత్రమైన మెట్ల మార్గాన్ని 16వ శతాబ్దంలో విజయనగర వారసులు నిర్మించారని చెబుతుంటారు.

రెండోది శ్రీవారి మెట్టు.. ఈ దారిగుండా పోవాలంటే తిరుపతి నుంచి 14 కీ,మీ దూరంలో ఉన్న శ్రీనివాస మంగపురానికి చేరుకోవాలి. అక్కడి నుంచి కుడివైపు తిరిగి మరో 3 కీ,మీ వెళ్లగానే.. శ్రీవారి మెట్ల మార్గాన్ని చేరుకోవచ్చు. ఇందుకు 2,788 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ నడక మార్గంలో కేవలం గంటలో తిరుమలకు చేరుకోవచ్చు. తిరుమలకు పూలు, పండ్లు ఇతర కూరగాయలు ఈ మార్గం నుంచే తీసుకెళ్లేవారు.

మూడవది అన్నమయ్య మార్గం.. దట్టమైన అడవుల మధ్య శ్రీవారికి ప్రియ భక్తుడైన తాళ్లపాక అన్నమాచార్యులు ఈ మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారు. అందుకే ఈ మార్గానికి అన్నమయ్య మార్గం అని పేరు వచ్చింది. ఈ మార్గంలో విజయనగరం రాజులు రాతి మెట్లను కట్టించారు. ఇది ఏడుకొండలను తాకుతూ వెళ్తుందని అంటారు. అందుకే అనుమతి లేకుండా ఈ మార్గం గుండా భక్తులు వెళ్తుంటారు. తిరుమలకు వెళ్లే 6 మైళు రాయి దగ్గర అలిపిరి మార్గం, అన్నమయ్య మార్గం కలుస్తాయి. ఈ మార్గం ద్వారా భక్తులను అనుమతించడం లేదు.

అద్దె ఇంట్లో ఉన్నా.. ఐశ్వర్యప్రాప్తి కలగాలంటే..!ఇక నాలుగవ మార్గం కుక్కల దొడ్డి. కడప జిల్లా బార్డర్‌ దగ్గర కుక్కల దొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుంచి రమణీయమైన ప్రదేశం నుంచి తుంబురు తీర్థానికి చేరుకోవచ్చు. అక్కడ నుంచి పవిత్రమైన గోవిందుడిని తలచే పాపవినాశనానికి చేరకోవచ్చు. ఇందులో స్నానం ఆచరిస్తే పాపాలు తొలిగిపోతాయని నమ్మకం. అక్కడి నుంచి ఓ 5 కీ,మీ నడిస్తే.. తిరుమల చేరుకోవచ్చు.

ఐదవ మార్గం అవ్వచాడికోన రేణిగుంట నుంచి భయంకరమైన అడవుల్లో గంటా మార్గాన్ని దాడి వెళ్లాలి. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లే దారి అందరికీ తెలిసిందే.

ఆరవ మార్గం ఏనుగుల దారి.. శ్రీవారి మెట్టు నుంచి అవ్వచాడి కోనకు ఓ మార్గం ఉండేది. అక్కడ పెద్ద రాళ్లను, శిలాలను ఆలయ నిర్మానికి ఏనుగుల ద్వారా ఈ మార్గం గుండా తీసుకెళ్లేవారట. కానీ, ఇప్పుడు ఆ మార్గం పూర్తిగా మూసుకుపోయింది.

ఏడవ మార్గం తలకోన.. ఈ మార్గం ప్రకృతి అందాలకు పుట్టినిల్లు ఈ శేషాచలం అడవుల్లో దట్టమైన కొండలు, పాములు,పులులు,రెపై్టల్స్, పూలు, పండ్లు ఉంటాయి. ఎక్కడా లేని విధంగా తిరుమల శేషాచలం అడవిలో 512 మెడిసినల్‌ ప్లాంట్స్‌ ఉన్నాయి. తలకోన జపపాతం నుంచి జెండాకోన వరకు చేరుకుని అక్కడి నుంచి 20 కీ,మీ దూరంతో తిరుమలకు చేరుకోవచ్చు.

ఎనిమిదవ దారి కళ్యాణి డ్యాం తిరుమలకు పశ్చిమ దిశలోఉంటుంది. పక్కనే ఉన్న శ్యామల కొండ నుంచి15 కీ.మీ నడిస్తే.. స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ ఎనిమిది మార్గాల్లో ప్రస్తుతం కేవలం రెండు మార్గాల ద్వారా మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. ఆ మిగిలిన మార్గాల్లో క్రూరమృగాలు ఉంటాయి కాబట్టి ఆ మార్గాల గుండా పర్మిషన్, గైడ్స్‌ లేకుండా వెళ్లాలని ప్రయత్నించకూడదు.
Published by:Renuka Godugu
First published: