Durga puja: మొదటి దుర్గాపూజ–ప్లాసీ యుద్ధానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

First durga puja in west bengal: పశ్చిమ బెంగాల్‌ దుర్గపూజకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అక్కడ జరిగే పండుగలు, పద్ధతులు కూడా అంతే విశిష్టంగా ఉంటుంది. బెంగాల్‌లో మొదటిసారి దుర్గాపూజ చేసే సమయం 1757 అప్పుడు ప్లాసీ యుద్ధం జరుగుతోంది.

First durga puja in west bengal: పశ్చిమ బెంగాల్‌ దుర్గపూజకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అక్కడ జరిగే పండుగలు, పద్ధతులు కూడా అంతే విశిష్టంగా ఉంటుంది. బెంగాల్‌లో మొదటిసారి దుర్గాపూజ చేసే సమయం 1757 అప్పుడు ప్లాసీ యుద్ధం జరుగుతోంది.

  • Share this:
ప్రతి ఏడాది నవరాత్రులు ఘనంగా నిర్వహించుకునే సంప్రదాయం పశ్చిమ బెంగాల్‌ది West bengal . అమ్మను 9 రోజులపాటు నిలబెట్టుకుని వివిధ రూపాల్లో ప్రతిమూల మూలల్లో పూజించే సంప్రదాయం. పశ్చిమ బెంగాల్‌ దుర్గపూజ Durga pooja అత్యంత వైభవంగా జరుగుతుంది. బెంగల్‌లోని వివిధ నగరాల్లో జరిగే దుర్గపూజ అందాలు మనకు చూడగానే కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి భారీ విగ్రహాలతోపాటు పండ్లు ఇతరాలతో అద్భుత రీతిలో ఆరాధిస్తారు.

బెంగాల్‌లో వందల సంవత్సరాలుగా దుర్గాపూజ నిర్వహించే పద్ధతి బెంగాల్‌ నుంచి దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించిందని చెబుతారు. ఇప్పటికీ దుర్గాపూజ అక్కడ చేసే విధంగా ఇంకా ఎక్కడా లేదు. దీని వెనుక అనేక కథనాలు వినిపిస్తున్నాయి. మొదటిసారి దుర్గాపూజ ఎలా ప్రారంభమైంది? ఎందుకు నిర్వహించారు? అనే ఆసక్తికర సందేహాలు ఉన్నాయి.

దుర్గపూజ ఆరంభం..
1757లో ప్లాసీ యుద్ధం తర్వాత పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్‌వారు విజయానికి  గుర్తుగా  అమ్మకు కృతజ్ఞతలు చెప్పడానికి మొదటిసారి దుర్గాపూజ చేశారని చెబుతారు. బెంగాల్‌ పాలకుడైన నవాబ్‌ సిరాజ్‌–ఉద్‌–దౌలా ప్లాసీ యుద్ధంలో ఓడిపోయాడు.

ఇది కూడా చదవండి: నవరాత్రుల్లో ఈ 5 దుర్గామాత ఆలయాలని దర్శిస్తే.. అశేష లాభాలు!
బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు దక్షిణంగా 22 మైళ్ల దూరంలో గంగానది ఒడ్డున ప్లాసీ అనే ప్రాంతం ఉంది. అక్కడ 1757 జూన్‌ 23న బ్రిటిష్, నవాబు సైన్యం మధ్య యుద్ధం జరిగింది. బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ East india company  సైన్యం రాబర్ట్‌ క్లైవ్‌ నాయకత్వంలో యుద్ధం చేసి నవాబ్‌ను ఓడించారు. ఏదేమైనా యుద్ధానికి ముందు కుట్రపూరితంగా రాబర్ట్‌ క్లైవ్‌ ఈ నగరంలోని ప్రముఖ సంపన్నులను తనతోపాటు కోర్టుకు తీసుకెళ్లిపోయాడు.

యుద్ధంలో గెలిచిన రాబర్ట్‌ క్లైవ్‌ దేవునికి కృతజ్ఞతలు చెబుదామనుకుంటాడు. కానీ, యుద్ధ సమయంలోనే నవాబ్‌ సిరాజ్‌ ఆ ప్రాంతంలోని చర్చిలను పూర్తిగా ధ్వంసం చేసేసాడు. అప్పుడు బ్రిటిష్‌ న్యాయవాది రాజు నవకృష్ణ దేవ్‌ దుర్గాపూజ చేయాలని రాబర్ట్‌ క్లైవ్‌ ముందు ప్రతిపాదిస్తాడు.దీనికి అంగీకరించి.. అదే ఏడాది మొదటిసారి కోల్‌కతాలో ఘనంగా దుర్గాపూజ నిర్వహించారు.

ఇది కూడా చదవండి: నవరాత్రుల్లో ఈ పనులు చేస్తే.. ధనాకర్షణ పెరుగుతుంది!


కోల్‌కతా మొత్తం అద్భుతంగా అలంకరించారు. శోభా బజార్‌లో పురాణ బరిలో దుర్గాపూజ నిర్వహించారు. ఇక్కడికి గొప్ప శిల్పులు, చిత్రకారులను పిలిపించారు. గొప్ప శిల్పాలను తయారు చేశారు. శ్రీలంక నుంచి నృత్యకారులు వచ్చారు.రాబర్ట్‌ క్లైవ్‌ ఏనుగుపై కూర్చొని వేడుకను ఆస్వాదించాడు. ఆ కార్యక్రమం చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి కోలకతాకు ప్రజలు చేరుకున్నారు.
దీనికి నిదర్శనంగా బ్రిటిష్‌వారి పెయింటింగ్‌ ఇక్కడ గుర్తించారు. ఇందులో కోల్‌కతాలో జరిగిన మొదటి దుర్గాపూజ చిత్రీకరించబడి ఉంది. నవకృష్ణ దేవ్‌ రాజభవనంలోని ఒక పెయింటింగ్‌ కూడా ఉంది. ఈ పెయింటింగ్‌ ఆధారంగానే ఈ విషయాలు బయటికి వచ్చాయి.

కార్యక్రమాన్ని చూసిన ధనవంతులు ఆశ్చర్యపోయారు. తరువాతి ఏడాది బెంగాల్‌లో జమిందారీ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఆ ప్రాంతంలోని భూస్వాములు తమ శక్తి, ప్రతిష్టను చూపించడానికి గొప్పగా దుర్గాపూజను చేయడం ప్రారంభించారు. దీన్ని చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చేవారు. క్రమంగా ప్రజాదరణ పొందింది.. దీంతో ప్రతిచోట నిర్వహిస్తున్నారు.

దీనికి సంబంధించిన ఇంకో కథనం...
మొదటిసారి ఇక్కడ దుర్గాపూజను 9వ శతాబ్దంలో బెంగాల్‌కు చెందిన యువకుడు ప్రారంభించాడు. బెంగాల్‌ నుంచి రఘునందన్‌ భట్టాచార్య అనే పండితుడు మొదటిసారి పూజను నిర్వహించాడనే ప్రస్తావన కూడా ఉంది. బెంగాల్‌లో తాహిర్‌పూర్‌ జమీందార్‌ పండిట్‌ ఆధ్వర్యంలో దుర్గాపూజ నిర్వహించారు. బెంగాల్‌ పాల, సెన్వాంశీలు దుర్గాపూజను బాగా ప్రోత్సహించారని చెబుతారు. 1757, 1790 తర్వాత మొదటిసారి రాజులు, సామంతులు, భూస్వాములు బెంగాల్‌లోని న దియా జిల్లాలో గుప్తిపాద వద్ద ప్రజా దుర్గాపూజను నిర్వహించారని చెబుతారు. రానురాను ఇది సంప్రదాయంగా మారింది.
Published by:Renuka Godugu
First published: