Home /News /astrology /

DO YOU KNOW HOW MANY WINDOWS AND DOORS A HOUSE SHOULD HAVE DETAILS HERE VB

Vastu Tips: ఇంటికి ఎన్ని కిటికీలు, తలుపులు ఉండాలో తెలుసా.. మీ ఇంటి నిర్మాణం ఇలా ఉందా.. లేదా తెలుసుకోండి..

ఇల్లు అద్దె (rent)కు కావాలంటూ.. వెళ్లేవారు. కాసేపు యజమాను (owners)లతో మాట కలిపి.. నమ్మకం కలిగించేవారు. ఆ తర్వాత యజమానుల దృష్టి మరల్చి.. ఇంట్లోని వస్తువులను దొంగిలించేవారు (theft). (ప్రతీకాత్మక చిత్రం)

ఇల్లు అద్దె (rent)కు కావాలంటూ.. వెళ్లేవారు. కాసేపు యజమాను (owners)లతో మాట కలిపి.. నమ్మకం కలిగించేవారు. ఆ తర్వాత యజమానుల దృష్టి మరల్చి.. ఇంట్లోని వస్తువులను దొంగిలించేవారు (theft). (ప్రతీకాత్మక చిత్రం)

Vastu Tips: ఇంటి నిర్మాణం చేసేసమయంలో చాలామందికి ఎన్ని కిటికీలు ఏర్పాటు చేయాలి.. అలాగే ఎన్ని ద్వారాలు ఉండాలి.. ఎన్ని తలుపులు ఉండాలనే విషయాలు చాలామందికి తెలియదు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    ఎవరైనా ఇంటిని నిర్మించే సమయంలో వాస్తు(Vastu) ప్రకారమే నిర్మిస్తారు. దానికి సంబంధించిన వాస్తు శాస్త్ర నిపుడిని లేదా ఇంటి నిర్మాణానికి ముగ్గులు వేసే (పంతులు) వ్యక్తిని పిలిచి ఇంటి నిర్మాణ గ్రాఫ్ ను రఫ్ గా ఒక పేపర్ పై డ్రా చేయిస్తాం. అందులో ఉన్న దాని ప్రకారమే ముందుకు వెళ్తాం. ఇలా వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణాన్ని నిర్మిస్తారు. మొదట్లోనే ఇంటికి ఎన్ని తలుపులు ఉండాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని గదులు ఉండాలి అనే విషయాలు అన్నీ తెలిసిపోతాయి. ఇదిలా ఉండగా.. అస్సలు వాస్త ప్రకారం ఇంటికి ఎన్ని తలుపులు, కిటికీలు ఉండాలి.. అనే విషయాలు సాధారణంగా చాలామందికి తెలియదు. నిపుణులు ఏది చెబితే అది ఫాలో అవుతూ మనం నిర్మాణాన్ని పూర్తి చేయిస్తాం. ముఖ్యంగా.

    Zodiac signs: ఈ రాశుల వారు మీ భాగస్వామిని మోసం చేస్తారు..! వివరాలు తెలుసుకోండి..


    ఇంటి ప్రధాన ద్వారం ఆరు అడుగుల ఎత్తు కంటే పైనే ఉండాలి..
    కిటికీల విషయానికి వస్తే.. ఇంటి యజమాని నాభి ఎత్తు వరకు కిటికీలు ఉండాలి.
    ఇంట్లో ఉన్న కిటికీలు, తలుపులు అన్నీ లెక్కేస్తే అవి ఎట్టి పరిస్థితుల్లో బేసి సంఖ్యలో ఉండకూడదు. ఎప్పుడూ సరిసంఖ్యలోనే ఉండే విధంగా చూసుకోవాలి.

    ఇక పండితులు చెప్పే మరో విషయం ఏంటంటే.. కిటికీలు, కబోర్డ్స్ లెక్కిస్తే.. 10 రాకూడదట. తలుపులు, కిటికీలు అన్నీ కూడితే పక్కన సున్నా రాకూడదు. అలా అని బేసి సంఖ్య కూడా రాకుండా చూసుకోవాలి.

    ఇక ఇంటి నిర్మాణం చేపట్టేసమయంలోనే ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం వల్ల అనుకూల వాతావరణం ఏర్పడటంతో పాటు.. ఇంట్లో వాళ్లు ఎక్కువగా ఒత్తిడికి గురికాకుడం ఉంటారట.
    ప్రధాన ద్వారానికి ఎదురుగా.. అంటే సింహద్వారానికి ఎదురుగా పెద్ద చెట్టు ఉంటే పుత్ర సంతానానికి నష్టం వస్తుందని వాస్తు పండితులు చెబుతుంటారు.

    అంతే కాకుండా ఇంటికి చుట్టు గోడ ఉన్నట్లైతే ఆ గోడలకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి.

    చుట్టూ ఉన్న గోడల్లోల కాంపౌండ్ గోడకు అంటే ఒకే గోడకు మూడు గేట్లు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని వాస్తు శాస్త్ర పండితులు తెలుపుతున్నారు.

    వాస్తుపరంగా ఇంటిని నిర్మించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వాస్తుపరమైన ఇబ్బందులే ముందు గుర్తొస్తాయి. కాబట్టి గృహం నిర్మాణం చేపట్టే ముందే వాస్తుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిని నిర్మించే ముందు ముఖ ద్వారానికి ఎదురుగా ఎలాంటి గోడలు లేకుండా చూసుకోవాలి. దీంతో పాటు ఇంటి నిర్మాణానికి ముందు పైన చెప్పిన విధంగా ఫాలో అయితే మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Vastu Tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు