Home /News /astrology /

DO YOU COLOR SAREE AND PRASADAM LIKES DURGA MAATA DURING DUSSEHRA NAVARATRI RNK

Navaratri 2021: నవరాత్రుల్లో ఏ రోజు ఏ రంగు వస్త్రం.. ఏ ప్రసాదం అమ్మవారికి ప్రీతికరం..

ప్రతి సంవత్సరం దసరా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటాం. అమ్మవారిని ఇంట్లో ఏర్పాటు చేసుకుని రోజుకు ఒక అవతారంలో పూజించి, అమ్మకు ఇష్టమైన నైవేధ్యాన్ని అందించి నచ్చిన రంగు వస్త్రాలతో అలంకరించి దేవి కృపకు పాత్రులమవుదాం.

ప్రతి సంవత్సరం దసరా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటాం. అమ్మవారిని ఇంట్లో ఏర్పాటు చేసుకుని రోజుకు ఒక అవతారంలో పూజించి, అమ్మకు ఇష్టమైన నైవేధ్యాన్ని అందించి నచ్చిన రంగు వస్త్రాలతో అలంకరించి దేవి కృపకు పాత్రులమవుదాం.

ప్రతి సంవత్సరం దసరా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటాం. అమ్మవారిని ఇంట్లో ఏర్పాటు చేసుకుని రోజుకు ఒక అవతారంలో పూజించి, అమ్మకు ఇష్టమైన నైవేధ్యాన్ని అందించి నచ్చిన రంగు వస్త్రాలతో అలంకరించి దేవి కృపకు పాత్రులమవుదాం.

నవరాత్రుల్లో Navaratri 9 రోజులపాటు అమ్మవారికి 9 అవతారాల్లో దుర్గాదేవిని పూజిస్తాం. ఏరోజు అమ్మకు ఏ నైవేద్యాన్ని పెట్టాలో తెలుసుకుందాం.

అమ్మను అలంకరించే విధానం..
ముందు కింద ఏదైన గుడ్డ పరచి పీటను ఏర్పాటు చేసుకుని దాని ఒక కంచెం పెట్టి అందులో ఒక కలశం పెట్టుకోవాలి. ఈ చెంబులో కొంచెం నీరు, పసుపు,కుంకుమ, అక్షితలు, పూలు వేసుకోవాలి. దాని మీద కొబ్బరికాయ పెట్టుకుని.. బ్లౌజ్‌ ముక్కతో చీర మాదిరి కట్టించాలి. అమ్మవారికి పూర్తి అలంకరణ చేయాలి.

1వ రోజు.. ఆశ్వీయుద శుద్ధ పాడ్యమి.

ఈ రోజున శ్రీ స్వర్ణకవచలాంకృత దుర్గాదేవి Durga devi గా అలంకరిస్తారు. అమ్మను ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించుకోవాలి. ఎందుకంటే ఎరుపు ఉత్తేజానికి సంకేతం. అలాగే నైవేధ్యం కట్టు పొంగలిని పెట్టాలి. ఎందుకంటే ఈ పదార్థంలోని మిరియాలు భూత, ప్రేత పిశాచాలను తరమడానికి నైవేద్యంగా పెడతారు.

ఇది కూడా చదవండి: Navaratri 2021: మొదటిరోజు పూజ ఎలా చేయాలి?


2వ రోజు.. ఆశ్వియుజశుద్ధ విదియ..

ఈరోజు శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా అలంకరిస్తారు. అమ్మకు బంగారు వర్ణం వస్త్రంతో అలంకరించాలి. ఎందుకంటే బంగారు రంగు పాజిటివ్‌ ఎనర్జిని తీసుకువస్తుంది. ఇక నైవేద్యం పులిహోరను పెట్టాలి. దీన్ని చిద్రాన్నం అని కూడా అంటారు. దీన్ని సకల దోషాలు తరమడానికి పెడతారు.

3వ రోజు...ఆశ్వీయుజశుద్ధ తదియ.. 
ఈరోజు గాయత్రీదేవిగా అలంకరిస్తారు. అమ్మవారిని పసుపు రంగు వస్త్రంతో అలంకరించాలి. ఎందుకంటే ఈ రంగు ఆటంకాలను తొలగించి.. విజయాలను చేకూరుస్తుంది. కొబ్బరి అన్నాన్ని నైవేధ్యంగా పెడతారు. ఎందుకంటే పూర్ణఫలాన్ని పొందడానికి ఈ నైవేద్యాన్ని పెడతారు.

4వ రోజు.. ఆశ్వీయుజ శుద్ధ చవితి..

ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ఈ దేవికి కాషాయం రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఎందుకంటే ఈ రంగు ఇచ్చే గుణానికి సంకేతం. కాబట్టి ఆ తల్లి అనుగ్రహంతోనే సమస్త జీవులకు ఆహారం చేకూరుతుంది. ఆ తల్లి అన్ని జీవరాసులకు ఆహారాన్ని ఇస్తుంది. గారెలు నైవేద్యంగా పెట్టాలి. అమ్మను శాంతపరచడానికి గారెలను పెడతారు.

ఇది కూడా చదవండి: గోపూజ చేస్తే.. ఈ పాపాలు పోతాయి!


5వ రోజు ఆశ్వీయుజ శుద్ధ పంచమి..

మూల నక్షత్రం.. ఈరోజు సరస్వతిదేవిగా అలంకరిస్తారు. తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు. హంస వాహనంపై కొలువై ఉంటుంది. ఈ దవళవస్త్రం మానసిక పరిపక్వతతోపాటు సకల విద్యలకు నిదర్శనం.దద్దోజనం నైవేద్యంగా పెట్టాలి. పిల్లలకు చదువు బాగా రావాలని ఈ నైవేద్యం పెడతారు.

6వ రోజు.. ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి..
ఈరోజు లలితాత్రిపురసుందరీదేవిగా అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించాలి. కేసరిబాత్‌ నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే సకల కార్యసిద్ధికి ఈ నైవేద్యాన్ని పెట్టాలి.

7వరోజు..ఆశ్వీయుజ శద్ధ సప్తమి..

శ్రీ మహాలక్ష్మిగా అలంకరిస్తారు. గులాబీరంగు వస్త్రంతో అలంకరించాలి. ఎందుకంటే మనస్సు ఆహ్లాదకరంగా ఉంచడానికి. కదంబం నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే.. సకల ఆహార పదార్థాలను అమ్మవారికి పెట్టవచ్చు.

8వ రోజు..ఆశ్వీయుజ శుద్ధ అష్టమి..

ఈరోజు దుర్గాష్టమి.. ఆకుపచ్చ రంగు వస్త్రంతో అలంకరించాలి. బుద్ధికి నిదర్శనం. చక్కెరపొంగలిని వైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే.. మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తుంది.

9వ రోజు మహర్నవమి.. మహిషాసురమర్ధిని దేవికి నీలం రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఎందుకంటే ఇది యుద్ధానికి సంకేతం. ఇది ధరించి మహిషాసురుని సంహరించింది. పాయస్సాన్ని నైవేద్యంగా పెడతారు.

విజయదశమి..
ఆశ్వియుజ శద్ధ దశమి.. ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. బంగారు రంగు వస్త్రంతో అలంకరించాలి. ఇది శుభానికి సంకేతం. గారెలు, పాయసం అన్ని అమ్మవారికి పెట్టవచ్చు. ఎందుకంటే విజయదశమిరోజు అపరాజితగా నిలిచింది. ఇక అమ్మవారు ఏ రంగు వస్త్రం ధరిస్తుందో ఆ వస్త్రం మనం కూడా ధరిస్తే.. సకల శుభాలు కలుగుతాయి.
Published by:Renuka Godugu
First published:

Tags: Durga Pooja, Dussehra 2021, Navaratri

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు