Home /News /astrology /

DO THIS ONE THING ON JANUARY 1ST AND BE HAPPY FOR ENTIRE YEAR SAYS VEDIC EXPERTS BA

Happy New Year 2021: న్యూ ఇయర్ ఒక్క రోజు ఈ పని చేస్తే సంవత్సరమంతా అదృష్టం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2020 ముగుస్తోంది. ఈ ఏడాదిలో కొన్ని కోట్ల మంది జీవితాలను ఆర్థికంగా ప్రభావం చూపించింది. కనీసం 2021లో అయినా కూడా తమ బతుకులు మారాలని భావిస్తారు జనం. అయితే, అందు కోసం ఏం చేస్తే బాగుంటుందో కొందరు పండితులు చెబుతున్నారు.

    2020 ముగుస్తోంది. ఈ ఏడాదిలో కొన్ని కోట్ల మంది జీవితాలను ఆర్థికంగా ప్రభావం చూపించింది. కనీసం 2021లో అయినా కూడా తమ బతుకులు మారాలని భావిస్తారు జనం. అయితే, అందు కోసం ఏం చేస్తే బాగుంటుందో కొందరు పండితులు చెబుతున్నారు. జనవరి 1వ తేదీన ఒక్క రోజు కొన్ని రకాలైన పద్ధతుల్లో పూజలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఏడాది మొత్తం పొందవచ్చునని అంటున్నారు. ఈ సారి జనవరి 1 శుక్రవారం వస్తోంది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనది. అలాగే, శుక్రవారానికి అధిపతి శుక్రుడు. ఆ రోజు ఎవరైనా సరే తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీ కటాక్షం, శుక్రుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే, గులాబీ రంగు లక్ష్మీదేవికి ఇష్టం. ఒకవేళ తెల్లటి వస్త్రాలు లేకపోతే గులాబీ రంగు దుస్తులు ధరించండి.

    జనవరి 1న ఉదయం స్నానం చేయగానే పూజ చేసేటప్పుడు పూజా మందిరంలోని ప్రమిదలో 6 వత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించాలి. ఈ 6 అనేది శుక్రుడికి, లక్ష్మీదేవికి ఇష్టమైన సంఖ్య. కాబట్టి 6 వత్తులు వేసి దీపం వెలిగిస్తే మంచిది. అలాగే, దీపాన్ని వెలిగించిన తర్వాత అందులో రెండు యాలుకలు వేయాలి. గులాబీ పూజ చేయాలి. లక్ష్మీదేవికి జాజిపూల దండ వేయాలి. ఉదయాన్నే స్నానం చేసి లక్ష్మీ పూజ ప్రారంభించడానికి ముందు ఇంటి గోడల మీద, గుమ్మాల మీద స్వస్తిక్ గుర్తు వేయాలి. పూజ గదిలో కూడా ఒకవైపు స్వస్తిక్, మరోవైపు పద్మం గుర్తులు వేయాలి. అలాగే, పూజ చేసేటప్పుడు ఓం ధనదాయైస్వాహా అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. లక్ష్మీదేవిని కుంకుమపువ్వు రంగులో ఉండే కుంకుమతో పూజిస్తూ మంత్రం చదవాలి.

    జనవరి 1న స్నానం చేసేటప్పుడు చిటకెడు కుంకుమపువ్వు, రెండు యాలుకలు, కొంచెం సెంటు నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి. ఈ రకమైన స్నానం అనేది శుక్రుడికి ప్రియమైన, లక్ష్మీదేవికి ప్రియమైన స్నానం. అలాగే, పూజ తర్వాత హారతిచ్చి దానిమ్మ పండు గింజలు ప్రసాదంగా పెట్టాలి. అతి కష్టమైన మొండి బాకీలు కూడా వసూలు కావాలంటే బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఓ ముత్తైదువను పిలిచి తాంబూలం ఇవ్వాలి.

    ఇక జనవరి 1 శుక్రవారం సాయంత్రం ఇంట్లో దీపం పెట్టాలి. మూడు మూలల ఆ దీపాలు పెట్టాలి. ఆగ్నేయం (అగ్ని స్థానం), ఉత్తరం (కుబేర స్థానం), ఈశాన్యం (శివస్థానం) దిక్కుల్లో ప్రమిదలో ఆవునెయ్యి వేసి దీపం వెలిగించాలి. అవకాశం ఉన్నవారు పసుపురంగు గవ్వలను లక్ష్మీ పూజలో పెట్టండి. ఆ గవ్వలకు గంధం, కుంకుమ బొట్లు పెట్టండి. పూజ చేసిన తర్వాత హారతిచ్చేటప్పుడు ఆ గవ్వలకు కూడా హారతివ్వండి. పూజ పూర్తయిన తర్వాత కాసేపటికి ఆ గవ్వలను తీసుకుని ఓ తెలుపు రంగు క్లాత్‌లో చుట్టి ధనం దాచిపెట్టే బీరువాలో ఉంచండి. ఈ రకంగా చేస్తే ఏడాది మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Money, New Year 2021, Zodiac sign

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు