Home /News /astrology /

DO THIS ONE POOJA IN THE EVENING TO GET RID DEBTS ON OCCATION OF SANKATAHARA CHATURTHI RNK

Sankatahara chathuthi 2022: అప్పులు తీరక బాధపడేవారు సంకష్టహర చతుర్ధి సాయత్రంలోగా ఈ ఒక్క పని చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Sankatahara chatuthi: 2022 జనవరి 21 వ తేదీ అంటే శుక్రవారం ఉదయం 8.52 నిమిషాల నుంచి 22 ఉదయం 9.22 నిమిషాల వరకు ఉంటుంది.

తిథులలో అత్యంత ప్రీతికరమైనవి మొదటిది వరద చతుర్థి, రెండోది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే మొదటితిథిని వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే తిథిని సంకట హర చతుర్థి (Sankatahara chaturthi 2022) అని అంటారు. వరద చతుర్ధిని ప్రతి సంవత్సరం వినాయకచవితి నాడు చేసుకుంటారు. కానీ, సంకటహర చతుర్తి ప్రతినెల ఆలంబనగా చేసుకుంటారు. ఈ సంకటహర చతుర్థి మంగళవారం వస్తే.. అంగారక చతుర్ధి అంటారు. ఇది చాలా విశేషమైన పర్వదినం. ఈరోజు సంకటహర చతుర్ధి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలో కుజదోష (kuja dosham)  సమస్యలు తొలగి, చేసే పనుల్లో మంచి జరుగుతుందని చెబుతారు. ఈ సంకటహర చతుర్ధి ప్రతినెల క‌ృష్ణపక్షం అంటే.. పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితినాడు వస్తుంది. ప్రదోషకాలంలో అంటే సూర్యస్తమయం ఏ సమయంలో ఉంటుందో ఆరోజు సంకట హర చతుర్థిగా పరిగణిస్తారు.

ముడుపు ఎలా కట్టాలి?
తెలుపు లేదా ఎరుపు రంగు జాకెట్ ముక్క తీసుకుని అందులో మూడు గుప్పిట్ బియ్యం పోసి, రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు రూ.11 లేదా 21 లేదా 51 లేదా 101 పెట్టి ముడుపు కట్టుకోవాలి.ఎన్ని నెలలు పూజ చేయాలనుకుంటే అన్ని నెలలు ఆ ముడుపునకు పూజ చేయాలి. దానిపైన పూవు, ముడుపు కింద తమలపాకులు అరటిపండు పెట్టి పూజించాలి. ఆ తర్వాత నిత్యపూజ చేసుకుని, గణపతి అష్టోత్తరం, శోడషోపచార పూజ చేసుకోవాలి. దగ్గర్లో ఉన్న ఏదైనా గుడికి వెళ్లి 3 లేదా 5 ప్రదక్షిణలు చేయాలి. అలాగే గణపతికి గరికను కూడా సమర్పించాలి.

ఇది కూడా చదవండి: శని ప్రయాణం.. 33 రోజులపాటు ఈ 4 రాశులకు బ్యాడ్ డేస్..!


సూర్యస్తమయం తర్వాత స్నానం చేసి స్వామికి దీపారాధన చేయాలి. అప్పటి వరకు ఉడికించినవి ఏవీ తినకూడదు. పాలు, పండ్లు, పచ్చికూరగాయాలు తినవచ్చు. ఈ వ్రతాన్ని 3,5,21 నెలలు పాటించాలి. సాయంత్రం ఎక్కడ పూజించాలినుకుంటున్నారో అష్టదళం ముగ్గువేసుకోవాలి. ఆ తర్వాత ఆసనం కోసం పీఠం వేయాలి. పీఠపైన కొత్త జాకెట్ ముక్క వేసుకోవాలి. ప్రతినెల కొత్తది వేయాల్సిన అవసరం లేదు. పూజ పూర్తయిన తర్వాత మళ్లీ దేవుడి గదిలోనే పెట్టుకోవాలి.

ఇప్పుడు స్వామివారి పటాన్ని పెట్టి వినాయకుడికి ఇష్టమైన మందార పూవులను సమర్పించుకోవాలి. దీపాలను పెట్టుకుని పసుపు గణపతిని ఎప్పుడూ పూజకు కూర్చోన్న సమయంలోనే తయారు చేసుకోవాలి. పసుపు,కుంకుమ గంధంతో స్వామివారిని అలంకరించుకోవాలి. ఓం కేశవాయనమ:, ఓం మాధవాయనమ: మూడుసార్లు తీర్థాం తాగి దీపారాధన చేసుకోవాలి. రెండు వత్తులు నూనెలో ముంచి ఏకారాధన చేసుకోవాలి. ఆ తర్వాత సంకట నాశన స్తోత్రం పఠించాలి. ఇది చదువునేటప్పుడు స్వామివారిని వినాయకుడికి ఇష్టమైన దానిమ్మ, గన్నేరు, సమర్పించాలి. ప్రసాదం పరమాన్నం, కుడుములు అందించాలి. ఆ తర్వాత స్వామివారికి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత చంద్రడికి అర్ఘ్యం ఇవ్వాలి.

ఇది కూడా చదవండి: ఈ 4 రాశుల వారు బంగారు ఉంగరాన్ని ధరిస్తే అదృష్టం వరిస్తుంది..


సంకటహర చతుర్థిరోజు చంద్ర దర్శనం 9.05 నిమిషాలకు మొదలవుతుంది. ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. ఆ తర్వాత రోజు దీపారాధన చేసుకుని పూజలో పెట్టుకున్నవి కదపవచ్చు. పూజలో పెట్టిన పసుపు గణపతిని ఆడవారు ముఖానికి లేదా మంగళసూత్రానికి లేదా పచ్చని చెట్లలో వేసుకోవచ్చు. కానీ, తులసి చెట్టులో మాత్రం వేయకూడదు.
Published by:Renuka Godugu
First published:

Tags: Lord Ganesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు