శనిత్రయోదశి రోజు (Shani trayodashi 2022) ఏ కోరికలు , కష్టనష్టాలు ఉన్నా.. సంకల్పం చేసుకుంటే.. కచ్ఛితంగా నేరవేరతాయి. ఎందుకంటే అత్యంత అరుదుగా 180 ఏళ్ల తర్వాత వస్తుంది. ఇది శనిదేవుడి (Shani dev) కే కాదు.. శివకేశవులకు సంబంధించినది. గత జన్మల కర్మాలకు అధిపతి శనిదేవుడు. కష్టాల రూపంలో అవి కడిగేస్తాడు. శని కర్మకారకుడు. శని మకర రాశి (Makara rashi) లో సంచారం చేస్తున్నాడు కాబట్టి 2022లో శనిప్రభావానికి లోనయ్యేది దాదాపు ప్రతిఒక్కరు కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుంటే..శనివక్రదుష్టి నుంచి బయటపడవచ్చు,
Shani trayodashi: శనిత్రయోదశి ప్రతిమాసంలో మనం చూస్తూనే ఉంటాం. శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక పూజలు నిర్వహిస్తాం. ఎందుకంటే ఈరోజు శనిదేవుడికి ప్రీతికరమైన రోజు. అయితే, 2022 మొదటి శనిత్రయోదశి జనవరి 15.. అంటే సంక్రాంతి పండగ రోజు వస్తోంది. అందుకే దీనికి అంత ప్రాముఖ్యత సంతరించుకుంది. అంతేకాదు ఈరోజు రవితో కూడిన శనిత్రయోదశికి ఎంతో ప్రాధాన్యమైంది.
శని త్రయోదశి రోజు శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేసుకుంటే.. చాలా మంచిది. శనిదేవుడికి నువ్వులు చాలా ఇష్టం. అందుకే ఈరోజు ప్రతిఒక్కరూ ఒంటికి తైలాన్ని పట్టించి స్నానం చేసుకోవాలి అంటారు.
శనిత్రయోదశి తిథి రోజు ఎవరైతే దైవారాధన చేస్తారో వారికి సంకల్పం కలుగుతుంది. ఇది కేవలం శనికి సంబంధించినదే కాదు, శివ కేశవులకు సంబంధించిన తిథి. నారాయణుడు రావిచెట్టులో ప్రవేశిస్తాడు శనివారం. త్రయోదశి అంటే కాముడు, రుద్రుడు శివుడు. ఈరోజు ప్రదోషకాలంలో 2 గంటలకు పైగా ఈశ్వరుడు ఆనంద తాండవం చేస్తాడు అంటాడు. ఆ సమయంలో చేసిన ఏ కార్యమైన 100 రేట్ల ఫలితం లభిస్తుంది. అందుకే కుటుంబ సభ్యులు దేవాలయాలకు కచ్ఛితంగా వెళ్లాలి.
ఉదయం సూర్యోదయం కాగానే నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయాలి. ఆరోజు మద్యం, మాంసం ముట్టుకోరాదు. వీలైతే ఉపవాసం చేయాలి. శనిగ్రహ దోషాల వల్ల బాధపడేవారు.
'నీలాంజన సమభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ
సంభూతం, తం నమామి శనైశ్చరం'
అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించాలి.
వీలైనన్ని సార్లు ఏ పని చేస్తున్నా.. ఓం నమ: శివాయ అనే శివపంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. ఆరోజు పేదవాల్లకు, వికలాంగుతు భోజనం పెట్టాలి. ఆరోజు ప్రదోష సమయంలో శివారాధన చేస్తే సుఖ:సంతోషాలు కలుగుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.