హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Sri rama navami 2022: శ్రీరామనవమిరోజు ఈ ఒక్క పనిచేస్తే.. ఏడాది మొత్తం అద్భుతాలే..

Sri rama navami 2022: శ్రీరామనవమిరోజు ఈ ఒక్క పనిచేస్తే.. ఏడాది మొత్తం అద్భుతాలే..

Ram Navami 2022: ఈ సంవత్సరం రామ నవమి ఏప్రిల్ 10 ఆదివారం రానుంది. చైత్ర శుక్ల నవమి రోజున అయోధ్యలో రాముడు జన్మించాడు. రామ నవమి సందర్భంగా, మీరు కొన్ని సులువైన ఉపాయాలతో మీ జీవితాన్ని ఆనందంగా ,సంతోషంగా మార్చుకోవచ్చు.

  Ram Navami 2022: ఈ సంవత్సరం రామ నవమి (Rama Navami) ఏప్రిల్ 10, ఆదివారం. చైత్ర శుక్ల నవమి రోజున అయోధ్య (Ayodhya) లో రాముడు జన్మించాడు. లంకాపతి రావణుడి దురాగతాల నుండి మూడు లోకాలను విముక్తి చేయడానికి విష్ణువు రామావతారం ఎత్తాడు. ఈ సంవత్సరం నవమి తిథి ఏప్రిల్ 09 అర్థరాత్రి 01:23 నుండి ప్రారంభమవుతుంది. ఇది ఏప్రిల్ 11 తెల్లవారుజామున 03:15 వరకు ఉంటుంది.. రామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో శ్రీరాముడిని పూజించి, రామజన్మోత్సవాన్ని జరుపుకుంటారు. రామ నవమి సందర్భంగా, మీరు కొన్ని సులువైన చర్యలతో మీ జీవితాన్ని ఆనందంగా ,సంతోషంగా మార్చుకోవచ్చు. రామ నవమికి ​​సంబంధించిన ఈ ఉపాయాల గురించి తెలుసుకుందాం.

   ఇది కూడా చదవండి: Ram Navami 2022: రామ నవమి రోజున ఈ 5 సులభమైన ఉపాయాలు చేస్తే.. మీ తలరాతే మారిపోతుందట..

  శ్రీరామనవమిరోజు సీతారామ కల్యాణం చేస్తారు. పందిళ్లు కూడా వేసి స్వామివారి కల్యాణం జరిపిస్తారు. కొంతమంది ఇళ్లలో కూడా సీతారామ కల్యాణం చేయిస్తారు. శ్రీరామచంద్రమూర్తి గొప్ప ఆదర్శమూర్తి. ఒక భర్తగా, కొడుకుగా, రాజుగా  అందరికీ ఆదర్శనీయమే.. ఏకపత్నివ్రతుడు కూడా. స్వామివారి కల్యాణం వీక్షించడం వల్ల కూడా మన జీవితంలో అద్భుతాలు కలిగిస్తాయి. రాములవారి కల్యాణ తలంబ్రాలు పెళ్లికాని వారిపై చల్లితే మంచి సంబంధం కుదిరి త్వరలో వివాహాం జరుగుతుంది. అదే, వివాహాం అయినవారికి వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది. రాములవారి కల్యాణం సమయంలో మాంగళ్యధారణ చేసినా వారి మూడుముళ్ల బంధం నూరేళ్లు సుఖంగా సాగిపోతుందని అంటారు.

   ఇది కూడా చదవండి: Vastu Tips: ఈ 5 వస్తువులను దక్షిణ దిశలో అస్సలు పెట్టకూడదు... అది దరిద్రానికి దారితీస్తుంది..

  కల్యాణం సమయంలోని తలంబ్రాలు పోయడం వీక్షించినవారికి ఆహారానికి లోటు ఉండదని అంటారు. ఈరోజు  రామనామం జపించాలి. రాములవారిని తులసిదళంతో, సీతమ్మతల్లిని మారేడు, హనుముంతుడిని తమలపాకులతో ఈరోజు పూజించాలి.

  ముఖ్యంగా ఈరోజు రామకథను చదవాలి. అందులో నామరామాయణం జపించాలి. విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని చదవుకోవాలి. ఈరోజు స్వామివారికి వడపప్పు, పాకం సమర్పించాలి. ఈరోజు ముఖ్యంగా రవ్వలడ్డును కూడా తయారు చేస్తారు. విష్ణుమూర్తి అవతారంలో ఉన్న రాముడికి ఈ విధంగా పాకం సమర్పించడం వల్ల సంతుష్టులవుతారు.

  (Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)

  First published:

  Tags: Sri Rama navami 2021

  ఉత్తమ కథలు